రాష్ట్రీయం

గుండు హనుమంతరావు మృతిపట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రముఖ హాస్య నటుడు గుండు హనుమంతరావు మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. హైదరాబాద్‌లోని స్వగృహంలో ఉన్న గుండు హనుమంతరావు భౌతికకాయానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు నివాళులర్పించారు. ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం, సీనియర్ నటి కవిత, హేమ, మా అధ్యక్షుడు శివాజీరాజా, కాదాంబరి కిరణ్, మా మాజీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ ఇతర నటీనటులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. గుండు హనుమంతరావు మృతిపట్ల ప్రముఖ హీరోలు నందమూరి బాలకృష్ణ, మోహన్‌బాబు సంతాపం ప్రకటించారు.