బిజినెస్

అక్రమార్జనపరులు తప్పించుకోలేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 20: అక్రమార్జనపరులను విడిచిపెట్టే ప్రసక్తే లేదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అవినీతి ద్వారా సంపాదించేవారినెవరినీ ఉపేక్షించబోమని తేల్చిచెప్పింది. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు నాలుగు నెలలపాటు లెక్కలు లేని ఆదాయాన్ని స్వచ్చంధంగా బహిర్గతం చేసేందుకు కేంద్రం అవకాశమిస్తుండగా, ఇది నల్లధన కుబేరులకు ఎంతమాత్రం లాభించబోదని ఆర్థిక శాఖ చెప్పింది. ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఆదాయాన్ని చట్టసమ్మతం చేసుకోవాలని సూచించింది. వెల్లడించిన నల్లధనానికి సంబంధించి ఆదాయ పన్ను చెల్లిస్తే వారి పేర్లను రహస్యంగానే ఉంచుతామంది.
మరోవైపు విద్యా, ఆరోగ్య రంగాలకూ ఆర్థిక సాయం అందించాలని ప్రపంచ బ్యాంక్‌ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ కోరారు. భారత్‌లో పర్యటిస్తున్న తొమ్మిది మంది ప్రపంచ బ్యాంక్‌కు చెందిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లనుద్దేశించి మాట్లాడుతూ మరిన్ని ప్రాజెక్టులకు ప్రపంచ బ్యాంక్ చేయూతనివ్వాలని ఆకాంక్షించారు. ఇదిలావుంటే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయంపై మాట్లాడుతూ 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మరింత చేదు అనుభవం ఎదురవుతుందన్నారు.

దేశవ్యాప్తంగా ఎస్‌బిఐ అనుబంధ బ్యాంకుల సమ్మె
ముంబయి, మే 20: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ.. అనుబంధ బ్యాంకుల ఉద్యోగులు శుక్రవారం ఒకరోజు సమ్మెను నిర్వహించారు. ఎస్‌బిఐలో అనుబంధ బ్యాంకులను విలీనం చేయాలన్న ప్రతిపాదనకు నిరసనగా ఈ సమ్మెను చేపట్టారు. జూన్ 7, జూలై 20న దేశవ్యాప్త బంద్‌కు ఈ సందర్భంగా ఉద్యోగులు పిలుపునిచ్చారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌తోపాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావన్‌కోర్‌ను తమలో విలీనం చేసుకోవాలనుకుంటున్నట్లు కేంద్ర ప్రభుత్వానికి ఎస్‌బిఐ తెలియపరిచినది తెలిసిందే. భారతీయ మహిళా బ్యాంకునూ విలీనం చేసుకుంటామంది. అయితే దీనిపై ఆయా బ్యాంకుల సిబ్బంది నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరోవైపు మాతృ సంస్థ ఎస్‌బిఐలో ఐదు అనుబంధ బ్యాంకులతోపాటు భారతీయ మహిళా బ్యాంక్ విలీనం విలువ 1,600 కోట్ల రూపాయలని గ్లోబల్ క్రెడిట్ రేటింగ్ సంస్థ మూడీస్ అభిప్రాయపడింది.

గుర్గావ్‌లో ఎస్‌బిఐ అనుబంధ బ్యాంక్ ఉద్యోగుల ఆందోళన