రాష్ట్రీయం

ఉమ్మడి పౌరస్మృతి భారత్‌లో సాధ్యం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 20: బహుళ జాతులు, మతాలు, సంస్కృతులు గల భారత్ వంటి దేశంలో ఉమ్మడి పౌరస్మృతి ఉండటం సాధ్యం కాదని ఎఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. అవిభక్త హిందూ కుటుంబాలు (హెచ్‌యుఎఫ్) పొందుతున్న పన్ను రాయితీలను సమీక్షించడానికి సంఘ్ పరివార్ సిద్ధంగా ఉందా? అని ఆయన నిలదీశారు. హైదరాబాద్ లోక్‌సభ సభ్యుడయిన అసదుద్దీన్ సోమవారం ఇక్కడ పిటిఐ వార్తాసంస్థతో ఉమ్మడి పౌరస్మృతి తదితర అంశాలపై మాట్లాడారు. ఉమ్మడి పౌరస్మృతిపై చర్చకు మీ పార్టీ సిద్ధంగా ఉందా? అని ప్రశ్నించగా, ‘మన రాజ్యాంగంలో 16 ఆదేశిక సూత్రాలు ఉన్నాయి. వాటిలో ఒకటి సంపూర్ణ మద్యనిషేధం విధించాలని చెబుతోంది. దాని గురించి మనం ఎందుకు మాట్లాడకూడదు? ఆదేశిక సూత్రాల్లో పేర్కొన్నందు వల్ల భారతదేశ వ్యాప్తంగా సంపూర్ణ మద్యనిషేధాన్ని ఎందుకు విధించకూడదు?’ అని ఆయన ప్రశ్నించారు. దేశంలో అనేకమంది మహిళలు తమ తాగుబోతు భర్తల నుంచి వేధింపులకు గురవుతున్నారని, వారి చేతుల్లో తన్నులు తింటున్నారని గణాంకాలు వెల్లడిస్తున్నాయని ఒవైసీ పేర్కొన్నారు. ‘అందువల్ల, మనం భారత్‌లో ఎందుకు సంపూర్ణ మద్యనిషేధం విధించకూడదు?’ అని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగంలోని 371వ అధికరణ నాగాలకు, మిజోలకు ప్రత్యేక సౌకర్యాలను అందిస్తున్న విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ, వాటిని రద్దు చేస్తారా? అని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలు ఇవ్వాలని ఆయన అన్నారు. బహుళ సంస్కృతులు, జాతులు, మతాలే భారతదేశ బలమని, అందువల్ల భారత్‌లో ఉమ్మడి పౌరస్మృతి సాధ్యం కాదని ఒవైసీ స్పష్టం చేశారు. ముస్లిం పర్సనల్ లాలోని ‘మూడుసార్లు తలాక్’, బహు భార్యత్వం అంశాలను సమీక్షించాల్సిన అవసరం గురించి ప్రశ్నించగా, ఇది ఇస్లాంకు చెందిన ఉలేమాలు, నిపుణులు, ముస్లిం పరిశోధకులు సమాధానం ఇవ్వాల్సిన ప్రశ్న అని ఆయన అన్నారు.