తెలంగాణ

భద్రకాళి అమ్మవారికి రేపు స్వర్ణ కిరీటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 7: వివిధ ఆలయాలకు ముఖ్యమంత్రి కెసిఆర్ గతంలో మొక్కుకున్న మొక్కులను వరుసగా తీర్చనున్నారు. తొలుత వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారికి దేవీ నవరాత్రుల సందర్భంగా మొక్కు తీర్చనున్నారు. పదకొండు కిలోల ఏడు వందల గ్రాముల స్వర్ణ కిరీటాన్ని అమ్మవారి కోసం జీఆర్టీ జువెలర్స్ వారితో తయారు చేయించారు. మూడు కోట్ల 70లక్షల రూపాయల విలువ గల స్వర్ణ కిరీటాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ ఈనెల తొమ్మిదిన ఆదివారం ఉదయం సతీ సమేతంగా వెళ్లి వరంగల్ భద్రకాళి అమ్మవారికి సమర్పించనున్నారు. ముఖ్యమంత్రి సతీమణి శోభ, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. శుక్రవారం క్యాబినెట్ సమావేశం తరువాత ముఖ్యమంత్రి కెసిఆర్ క్యాంపు కార్యాలయంలో స్వర్ణ కిరీటాన్ని పరిశీలించారు. తెలంగాణ ఆవిర్భావం తరువాత వివిధ ఆలయాలకు మొక్కుల గురించి ముఖ్యమంత్రి గతంలో ప్రకటించారు. వరంగల్ భద్రకాళి అమ్మవారు, విజయవాడ కనక దుర్గమ్మ, తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి మొక్కుకున్నారు. ఆభరణాలు సిద్ధం అయ్యాయి. వరుసగా కెసిఆర్ మొక్కులు చెల్లించుకుంటారని అధికార వర్గాలు తెలిపాయి.