ఆంధ్రప్రదేశ్‌

మాతృభాషలో సైన్స్ బోధన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భవిష్యత్ శాస్తస్రాంకేతిక రంగాల్లో భారతీయ యువతదే అద్భుత పాత్ర

తప్పనిసరి చేయనున్న సర్కారు
సైబర్ సెక్యూరిటీ అథారిటీ అవసరం
ఐఎస్‌సి సదస్సులో శాస్తవ్రేత్తలు

ఫోన్లకు సెక్యూరిటీ సర్టిఫికెట్

తిరుపతి, జనవరి 7: మొబైల్ ఫోన్లు, యాప్‌లు వాటికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించి మన దేశంలో ఎలాంటి సైబర్ సెక్యూరిటీ సర్ట్ఫికేషన్ లేదని టెలికమ్యునికేషన్స్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జి. నరేంద్రనాథ్ అన్నారు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ముగింపు సదస్సులో భాగంగా ఆయన మాట్లాడారు. దేశ వ్యాప్తంగా నగదు రహిత లావాదేవీలు పెరుగుతున్న నేపథ్యంలో మొబైల్ ఫోన్లకు, యాప్‌లకు సైబర్ సెక్యూరిటీ సర్ట్ఫికేషన్ తప్పనిసరి చేసేందుకు కేంద్రప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని ఆయన అన్నారు. ‘‘మొబైల్ ఫోన్లు అమ్మే వ్యాపారులు రేడియేషన్ సర్ట్ఫికేట్ ఉంటోంది. కానీ సెక్యూరిటీ సర్ట్ఫికెట్ మాత్రం లేదు. అమెరికాలో కూడా అక్కడి ప్రభుత్వం మొబైల్ ఏజెన్సీలకు సెక్యూరిటీ సర్ట్ఫికేషన్ తప్పనిసరి చేసింది. అలాగే సెక్యూరిటీ ప్రమాణాలనూ నిర్దేశించింది. అయితే అక్కడ కూడా సాధారణ ప్రజల దగ్గర ఉన్న ఫోన్లు ప్రమాణాలకు తగినట్లుగా లేవు. మనం ఈ సెక్యూరిటీ సర్ట్ఫికేషన్‌ను ఏ విధంగా అమల్లోకి తీసుకురావాలో చూడాలి.’’ అని ఆయన అన్నారు. అయితే ఇదే సమయంలో దేశంలో మళ్లీ లైసెన్స్ రాజ్యం తీసుకురావాలని ప్రభుత్వం భావించటం లేదన్నారు. ‘పరిశ్రమలే వాటంతట అవే మొబైల్ ఫోన్లలో, యాప్‌లలో రక్షణ చర్యలు తీసుకునేలా ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రస్తుతం యాప్స్ మొబైల్ ఫోన్ సమాచారాన్నంతా సంపాదించగలుగుతున్నాయి. సాఫ్ట్‌వేర్‌ను కూడా మార్చేస్తున్నాయి. మేం యాప్‌లన్నీ ఒకేచోట ఒక వర్గంగా ఉండేలా చూడాలని, అప్పుడే అవి సెక్యూర్‌గా ఉంటాయని కంపెనీలకు సూచిస్తున్నాం’’ అని నరేంద్రనాథ్ తెలిపారు.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ప్రొఫెసర్ ఎన్ బాలకృష్ణన్ మాట్లాడుతూ దేశంలో ఆర్థిక లావాదేవీలను నిర్వహించే పేటిఎం వంటి వాటికి కూడా ఎలాంటి సైబర్ సెక్యూరిటీ లేదన్నారు. సెక్యూరిటీ సర్టిఫై చేసేందుకు మన దేశంలో ఎలాంటి ఏజెన్సీ కూడా లేదని ఆయన వివరించారు. రానున్న రోజుల్లో డిజిటల్ లావాదేవీలపై భారీ ఎత్తున దాడులు జరిగే అవకాశాలున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో సైబర్ సెక్యూరిటీ అథారిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరం తక్షణం ఉందని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ‘‘క్రెడిట్ కార్డు పిన్ నెంబర్ దొంగతనం జరిగిందనుకోండి.. అది ఎక్కడి నుంచి ఎవరు దొంగతనంగా సంపాదించారన్నది నిరూపించటం చాలా కష్టమైన పని. మొబైల్ యాప్‌కు ఇవ్వటం ద్వారా జరిగిందా అన్నది తెలుసుకోవటం కష్టమైన పని. ఐటి, టెలికం ఉత్పత్తులను ధ్రువీకృత ఏజెన్సీలు సర్టిఫై చేయటం చాలా అవసరం. పే టిఎం సీనియర్ వైస్ చైర్మన్ వాసిరెడ్డి కిరణ్ మాట్లాడుతూ ‘‘మాకు కావలసిన అన్ని సెక్యూరిటీ సర్ట్ఫికేట్లు ఉన్నాయి. మోసాలను అధిగమించటానికి అవసరమైన అన్ని చర్యలనూ మేం తీసుకున్నాం. ప్రతిరోజూ లక్షలాది లావాదేవీలు మా యాప్‌లో జరుగుతున్నా చిన్న మోసం కూడా చోటుచేసుకోలేదు’’ అని ఆయన అన్నారు.

చిత్రం... అంతర్జాతీయ సైన్స్ కాంగ్రెస్‌లో ముగింపు ఉపన్యాసం చేస్తున్న మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్‌రావు