ఆంధ్రప్రదేశ్‌

‘పోలవరం’ కాంట్రాక్టు ఏజెన్సీని ఎందుకు రద్దుచేశారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలవరం, ఏప్రిల్ 15: వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తున్న కాంట్రాక్టు ఏజన్సీని రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం లేకుండా ఎందుకు రద్దుచేశారో జగన్, కెవిపి రామచంద్రరావులు చెప్పాలని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండు చేశారు. శనివారం ఉదయం పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాలైన స్పిల్‌వే కాంక్రీటు పనులు, ఎర్త్ కం రాక్‌ఫిల్ డ్యాం పనులు, గేట్ల నిర్మాణ పనులను పరిశీలించారు. అలాగే శుక్రవారం అగ్నికి ఆహుతైన భారీ ఎక్స్‌కవేటర్‌ను పరిశీలించారు. అనంతరం మంత్రి దేవినేని విలేఖర్లతో మాట్లాడుతూ 2009లో ప్రాజెక్టు పనులు చేస్తున్న కాంట్రాక్టు ఏజన్సీని స్వలాభం కోసం రాజశేఖర్‌రెడ్డి తొలగించారని ఆరోపించారు. కాంట్రాక్టు ఏజన్సీని జగన్ దక్కించుకునేందుకు రాజశేఖర్‌రెడ్డి ప్రయత్నం చేశారని, అయితే కాంట్రాక్టు ఏజన్సీ వైఎస్ జగన్ ప్రతిపాదించిన కంపెనీకి ఇవ్వనందున కాంగ్రెస్‌తో విభేదించి సొంతంగా పార్టీని స్థాపించారని ఆరోపించారు. విజయసాయిరెడ్డి, జగన్మోహన్‌రెడ్డి, కెవిపి రామచంద్రరావులు పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపేందుకు కుతంత్రాలు చేస్తున్నారని, వారి ఆటలు సాగనివ్వబోమన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు అనుకున్న సమయానికి పూర్తిచేస్తామని చెప్పారు. ఈ సంవత్సరం జూన్ నెలాఖరునాటికి లక్ష్యంగా నిర్థేశించిన పనులు పూర్తిచేయాలని ఇరిగేషన్ అధికారులు, కాంట్రాక్టు ఏజన్సీ ప్రతినిధులను ఆదేశించామన్నారు. స్పిల్‌వేలో ప్రస్తుతానికి ఆరు బ్లాకుల నిర్మాణం పూర్తయినట్లు తెలిపారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన టెలీబెల్ట్ ద్వారా స్పిల్‌వే కాంక్రీటు పనులు జరుగుతున్నాయని, దీని ద్వారా గంటకు 2000 క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పనులు జరుగుతాయని చెప్పారు. అలాగే 200 అడుగుల దూరం నుంచి టెలీబెల్ట్ ద్వారా కాంక్రీటు పనులు చేయవచ్చునన్నారు. శుక్రవారం అగ్నిప్రమాదానికి గురైన భారీ ఎక్స్‌కవేటర్ స్థానంలో మరో మూడు 2వేల కెపాసిటీ కల్గిన ఎక్స్‌కవేటర్లను త్రివేణి కాంట్రాక్టు ఏజన్సీ తీసుకువస్తున్నట్టు తెలిపారు. దీంతో మట్టి పనులు మరింత వేగంగా జరుగుతాయని చెప్పారు. స్పిల్‌వేలో అమర్చే గేట్లు ఇప్పటికి నాలుగు పూర్తయ్యాయని, నిర్మాణం పూర్తయిన గేట్లను భద్రపరిచేందుకు 20 ఎకరాల భూమిని సేకరిస్తామన్నారు. గోదావరి నదికి వరదలు వచ్చే సమయానికి నిర్ధేశించిన 660 మీటర్ల డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తిచేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. ఇప్పటి వరకూ ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో 6కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టిపని జరిగిందన్నారు. సిఎం చంద్రబాబునాయుడు ప్రతి సోమవారం వర్ట్యువల్ ఇన్‌స్పెక్షన్ చేసి లక్ష్యాలకు అనుగుణంగా అధికారులను, కాంట్రాక్టు ప్రతినిధులను సమన్వయంతో పనులు వేగవంతంగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి దేవినేని తెలిపారు. మంత్రి వెంట ఇఎన్‌సి ఎం వెంకటేశ్వరరావు, ప్రాజెక్టు సిఇ విఎస్ రమేష్‌బాబు, ఇఇలు కుమార్, పుల్లారావు, ట్రాన్స్‌ట్రాయ్ కాంట్రాక్ట్ ఏజన్సీ వైస్ ప్రెసిడెంట్ కె తిరుమలేశ్వరరావు, ఎల్‌ఎన్‌టి, పావర్, త్రివేణి కాంట్రాక్టు ఏజన్సీ ప్రతినిధులు ఉన్నారు. అనంతరం మంత్రి ప్రాజెక్టు నిర్మాణ పనుల ప్రగతిపై ఇరిగేషన్ అధికారులు, ఏజన్సీ ప్రతినిధులతో సమీక్ష జరిపారు.

అగ్నికి ఆహుతైన ఎక్స్‌కవేటర్‌ను, గేట్ల నిర్మాణాలను పరిశీలిస్తున్న మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు