రాష్ట్రీయం

భారీగా బడ్జెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 17 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2016-17 సంవత్సరానికి భారీ బడ్జెట్ ప్రతిపాదించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. సిఎం చంద్రబాబు సూచనల మేరకు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పివి రమేష్ తదితరులతో సమీక్షిస్తున్నారు. అన్నీ సవ్యంగా కొనసాగితే ఫిబ్రవరి రెండోవారం లేదా మూడోవారంలో అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్‌ను సమర్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్త బడ్జెట్ 1,32,000 కోట్లమేరకు ఉండవచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం. వ్యవసాయం, అనుబంధ రంగాలు, పరిశ్రమలు, ఐటి, స్వయం ఉపాధి తదితర అంశాలకు ప్రాధాన్యతనివ్వాలని భావిస్తున్నారు. బడ్జెట్ మొత్తం 2015-16కంటే 19 వేల కోట్ల రూపాయలు అధికంగా ఉంటుందని స్పష్టమవుతోంది.
రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ శాఖలు ప్రతిపాదించిన బడ్జెట్ వివరాలను ఆర్థిక శాఖ పరిశీలిస్తోంది. 2015-16లో ఏ శాఖ సమర్థతగా నిధులను ఉపయోగించిందో నిర్ణయించి, ఆయా శాఖలను ప్రోత్సహించాలని భావిస్తున్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతల ప్రకారం వ్యవసాయం, నీటి సంరక్షణ, అడవుల పెంపకం, పశుసంవర్థకం, మత్స్య శాఖలకు ఎక్కువ నిధులిచ్చే అవకాశం ఉంది. వ్యవసాయం అనుబంధ రంగాలకు 18 వేల కోట్ల రూపాయలపైగా కేటాయిస్తారని తెలుస్తోంది. అలాగే నీటి పారుదల రంగానికి ఎనిమిది వేల కోట్లు కేటాయించవచ్చని తెలుస్తోంది. విద్యారంగానికి 20 వేల కోట్లు, వైద్య ఆరోగ్య రంగానికి ఆరువేల కోట్లు, తాగునీటి అవసరాలకు 1200 కోట్ల రూపాయలు కేటాయిస్తారని తెలుస్తోంది. ప్రభుత్వ ఖజానాకు ఇబ్బందిలేకుండా కేంద, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పన్నురూపంలో వచ్చే నిధులు లక్ష కోట్లకుపైగా ఉండేలా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. ప్రజలపై పన్నుల భారం వేయకుండానే రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో లభించే నిధులు ఎక్కువ మొత్తంలో ఉండేలా ప్రయత్నిస్తున్నారు.