బిజినెస్

సెనె్సక్స్ 330 పాయింట్లు పతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 8: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీగా నష్టపోయాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 329.55 పాయింట్లు పతనమై 24,287.42 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 101.85 పాయింట్లు క్షీణించి 7,387.25 వద్ద స్థిరపడింది. ఈ ఆర్థిక సంవత్సరం (2015-16) మూడో త్రైమాసికానికి (అక్టోబర్-డిసెంబర్)గాను వెల్లడయ్యే జిడిపి గణాంకాలకు ముందు మదుపరులు పెట్టుబడులపై సంశయానికి లోనయ్యారు. అంతర్జాతీయంగా ఐరోపా మార్కెట్లు నష్టాల్లో కదలాడటం కూడా దేశీయ స్టాక్ మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. గ్లోబల్ మార్కెట్‌లో ముడి చమురు ధరల పతనం, చైనా ఆర్థిక మందగమనం పరిస్థితులు భారత్‌తోపాటు వివిధ దేశాల స్టాక్ మార్కెట్ల ఒడిదుడుకులకు కారణమవుతున్నాయని జియోజిత్ బిఎన్‌పి పరిబాస్ ఫండమెంటల్ రిసెర్చ్ అధిపతి వినోద్ నాయర్ అన్నారు. ఇదిలావుంటే ఐటి, టెక్నాలజీ, చమురు, గ్యాస్, ఎనర్జీ, ఎఫ్‌ఎమ్‌సిజి, ఆటో, హెల్త్‌కేర్, పవర్, మెటల్ రంగాల షేర్ల విలువ 1.95 శాతం నుంచి 0.85 శాతం మేర పడిపోయింది. అయితే టెలికామ్, రియల్టీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ షేర్ల విలువ 0.78 శాతం నుంచి 0.19 శాతం మేర పెరిగింది. విదేశాల నుంచి చౌకగా జరుగుతున్న ఉక్కు దిగుమతులకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం 173 రకాల ఉక్కు ఉత్పత్తులపై కనీస దిగుమత ధర (ఎమ్‌ఐపి)ను పెంచుతూ తీసుకున్న నిర్ణయం దేశీయ ఉక్కు తయారీ సంస్థల షేర్లకు కలిసొచ్చింది. భూషణ్ స్టీల్, జెఎస్‌డబ్ల్యు స్టీల్, టాటా స్టీల్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. కాగా, లూనార్ న్యూ ఇయర్ సందర్భంగా సోమవారం చైనా, హాంకాంగ్ మార్కెట్లకు సెలవు. జపాన్ సూచీ మాత్రం 1.1 శాతం పెరిగింది. ఐరోపా మార్కెట్లలో ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ సూచీలు 1.61 శాతం వరకు నష్టపోయాయి.