ఆంధ్రప్రదేశ్‌

గణనీయంగా తగ్గిన విద్యుత్‌లైన్ నష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 5: అనేక ఒడుదుడుకులతో నెట్టికొస్తోన్న ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఈపిడిసిఎల్) విద్యుత్ పంపిణీ నష్టాలను గణనీయంగా తగ్గించగలుగుతోంది. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మండలి నుంచి ఈపిడిసిఎల్‌గా ఏర్పడినప్పటి నుంచి అధిక శాతం ఉండే విద్యుత్ పంపిణీ నష్టాలను క్రమేపీ తగ్గించుకుంటూ వస్తోంది. సబ్‌స్టేషన్ల దూరాన్నిబట్టి విద్యుత్ నష్టాలు పెరుగుతుంటాయి. అదే సబ్‌స్టేషన్లు సమీపంలో ఉండే వీటి లోడ్‌ను బట్టి నష్టాలు తగ్గుతూ ఉంటాయి. రకరకాల విద్యుత్ వృథా, విద్యుత్ చౌర్యాన్ని తగ్గించేందుకు అనేక చర్యలు చేపట్టడంతో పంపిణీ నష్టాలను ప్రతి ఏడాది తగ్గిస్తోంది. ఈవిధంగా 2000-01లో 17.91 శాతం మేర ఉండే విద్యుత్ పంపిణీ నష్టం 2001-02లో 17.28 శాతానికి, 2002-03లో 16.80, 2003-04 సంవత్సరంలో 15.29 శాతానికి తగ్గించగలిగింది. అలాగే 2004-05లో 15.17 శాతం వరకు తగ్గించగా, 2005-06 ఆర్ధిక సంవత్సరంలో అది 12.95 శాతానికి చేరుకుంది. అలాగే 2006-07లో 12.29 శాతం, 2007-08లో ఒక్కసారిగా 9.01 శాతానికి నష్టాలు తగ్గాయి. 2008-09లో 8.83 శాతం నష్టాలు, 2009-10లో 8.42 శాతం, 2010-11లో 7.09, 2011-12లో 6.91 శాతానికి పంపిణీ నష్టాలను తగ్గించగలిగింది. ఈ విదంగా 2012-13 ఆర్ధిక సంవత్సరంలో 6.46 శాతం, 2013-14లో 6.33 శాతం, 2014-15లో 6.32 శాతం, 2015-16లో 4.90 శాతం మేర పంపిణీ నష్టాలు తగ్గాయి. ఈ విధంగా 2016-17 ఆర్ధిక సంవత్సరంలో దీన్ని నాలుగు శాతానికి తగ్గించాలనే లక్ష్యంతో సంస్థ పలు చర్యలు చేపట్టింది. గడచిన 15 ఏళ్ళ కాలంలో 12 నుంచి 13 శాతం మేర విద్యుత్ పంపిణీ నష్టాలు తగ్గించగలిగిన ఈపిడిసిఎల్ భారతదేశంలోనే అగ్రగామిగా నిలిచి నాల్గవ స్థానం నుంచి రెండవ స్థానానికి చేరుకోగలిగింది. అదే ఆంధ్ర రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది. సంస్థ పరిధిలోకి వచ్చే 29 పట్టణాల్లో విద్యుత్ పంపిణీ నష్టాలు మరింతగా తగ్గించగలిగిన సంస్థ మండల కేంద్రాలు, గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో సాంకేతికపరమైన ఇబ్బందులను ఎదుర్కోంటోంది. అందువల్ల అత్యంత అధునీకరణ సామర్ధ్యాన్ని పెంపొందించగలిగే విద్యుత్ సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేయడం, వీటిని వీలైనంత మేర సమీపంలో నెలకొల్పేందుకు సంస్థ యాజమాన్యం చర్యలు తీసుకుంటోంది. కాగా విద్యుత్ పంపిణీ నష్టాలను తగ్గించడంలో దేశంలోని 48 డిస్ట్రిబ్యూషన్ కంపెనీల్లో ఈపిడిసిఎల్ అగ్రగామిలో నిలవడంతో కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ నుంచి అనేకసార్లు ప్రశంసలు వచ్చాయి.