శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

క్రికెట్ దిగ్గజం సచిన్ నేడు పిఆర్ కండ్రిగకు రాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గూడూరు, నవంబర్ 15 : క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తాను దత్తత తీసుకున్న గూడూరు మండలంలోని పుట్టంరాజువారికండ్రిగ గ్రామానికి రెండేళ్ల తర్వాత వస్తున్నారు. గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించేందుకు, పలు శంకుస్థాపనలు చేయడానికి బుధవారం ఉదయం 11.35 గంటలకు రానున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వచ్చ్భారత్ ప్రకటించిన నేపథ్యంలో రెండేళ్ల క్రితం పలువురు పలు గ్రామాలను, వార్డులను దత్తత తీసుకున్నారు. ప్రభుత్వం గూడూరు మండలం పుట్టంరాజువారికండ్రిగ గ్రామాన్ని దత్తత గ్రామంగా ప్రకటించిన నేపథ్యంలో అప్పుడు ఇక్కడ జెసిగా పనిచేస్తుండిన రేఖారాణి పిఆర్ కండ్రిగ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని సూచించడంతో అప్పుడు క్రికెట్ దిగ్గజం సచిన్ సదరు గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించి తన రాజ్యసభ నిధుల నుంచి రూ.3 కోట్లు విడుదల చేశారు. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. గ్రామంలో ఉన్న గుడిసెలన్నింటిని పక్కాగృహాలుగా మారుస్తామని, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని, బ్యాంకు కౌంటర్ ఏర్పాటు చేస్తామని చెప్పిన హామీలు నేటికీ నెరవేరక పోవడంతో ఆ గ్రామ ప్రజలు అభివృద్ధి పనులపై పెదవి విరుస్తున్నారు. ఇటీవల సచిన్ గ్రామానికి వస్తున్నట్లు సమాచారం అందడంతో గత వారం నిరుద్యోగులకు జాబ్ మేళా నిర్వహించి ఉద్యోగ అవకాశాల కోసం పలువురిని ఎంపిక చేశారు. ఇంకా గ్రామంలో పూరిగుడిసెలు దర్శనమిస్తుండటంతో ప్రజలు తమకు సచిన్ దత్తత తీసుకున్నందున ఏమి లాభం చేకూరిందని ప్రశ్నిస్తున్నారు. పాడి గేదెలు, రుణాలు విరివిగా ఇప్పిస్తామని అధికారులు చెప్పిన మాటలు నీటి మూటలుగా మారాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వచ్చి హడావుడి చేయడం తప్పించి గ్రామంలో చెప్పుకోతగ్గ అభివృద్ధి జరగలేదన్నదని గ్రామస్థుల వాదనగా ఉంది. ఇదిలాఉండగా ప్రధాన రహదారి నుంచి గ్రామంలోకి సిసి రోడ్డు నిర్మాణం జరిగింది. ప్రస్తుతం కమ్యూనిటీ హాలు నిర్మాణం పూర్తికాగా, ఇంకా పలు అభివృద్ధి పనులు గత నాలుగైదు రోజులుగా యుద్ధప్రాతిపదికన అధికారులు దగ్గరుండి పనులు చేయిస్తున్నారు. ఇదే హడావుడి దత్తత తీసుకున్నప్పటి నుంచి చేసి ఉంటే ఇప్పటికే గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగి ఉండేవని గ్రామస్థులు గుర్తుచేస్తున్నారు.
నేడు పిఆర్ కండ్రిగకు సచిన్ రాక
క్రికెట్ దిగ్గజం, రాజ్యసభ సభ్యుడు, భారతరత్న సచిన్ టెండూల్కర్ ఉదయం 10.40 గంటలకు విమానంలో చైన్నైలో దిగి అక్కడ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 11.35కి పుట్టంరాజువారికండ్రిగకు చేరుకుంటారు. 11.38 గంటలకు గ్రామంలో నిర్మించిన కమ్యూనిటీ హాలును ప్రారంభిస్తారు. 11.45కి జిల్లా అధికారులతో సమీక్షిస్తారు. 12.05 గంటలకు గతంలో పిఆర్‌కండ్రిగ గ్రామానికి వచ్చినప్పుడు సందర్శించిన పింక్ కలర్ ఇంటిని సందర్శించి ఆ ఇంటి వారితో కాసేపు ముచ్చటిస్తారు. 12.15 గంటలకు గ్రామంలో నిర్మించిన క్రీడామైదానాన్ని, క్రికెట్ కిట్లను క్రీడాకారులకు ఆయన అందచేయనున్నారు. అనంతరం అక్కడ జిల్లా అధికారులు, క్రీడాకారులు, స్థానిక ఎమ్మెల్యేతో కలసి సమీక్ష నిర్వహించనున్నారు. 12.25 గంటలకు గ్రామస్థులతో సమావేశం కానున్నారు. అనంతరం 1 గంటకు హెలిప్యాడ్ ద్వారా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం పోర్టుకు వెళ్లనున్నారు.
సచిన్ రాక కోసం భారీ ఏర్పాట్లు
సచిన్ రాక కోసం జిల్లా అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పోలీసులు ఆ మార్గంలో వాహనాల రాకపోకలను నియంత్రించే ఏర్పాట్లలో ఉన్నారు. గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. ఇదిలాఉండగా గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను గత వారంరోజుల నుంచి యుద్ధప్రాతిపదికన పనులను చేపడుతున్నారు. సచిన్ చేత మొక్కలు నాటే కార్యక్రమానికి గుంతలు తవ్వుతున్నారు. ఇప్పటికే స్టేజి ఏర్పాట్లు పూర్తయ్యాయి. వచ్చేవారి కోసం కుర్చీలు, సచిన్ తిరిగే ప్రాంతంలో అన్ని పనులు చకచకా చేయిస్తున్నారు.
గ్రామాన్ని సందర్శించిన కలెక్టర్
సచిన్ టెండూల్కర్ గ్రామానికి రానున్న దృష్ట్యా మంగళవారం జిల్లా కలెక్టర్ ఆర్ ముత్యాలరాజు, జెసి ఇంతియాజ్ అహ్మద్ పుట్టంరాజువారికండ్రిగ గ్రామాన్ని సందర్శించారు. అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, సచిన్ పర్యటనలో ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆయన డిఎస్పీ శ్రీనివాస్‌ను ఆదేశించారు. ప్రతి పని నాణ్యతతో కూడినదిగా ఉండాలని, గతంలోలాగా కాకుండా ఈసారి ఇక్కడ సభ జరగనున్న నేపథ్యంలో ప్రజలు అసౌకర్యానికి గురికాకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.