శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

నగదు రహిత లావాదేవీలు నేర్చుకోండి: జెసి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు రూరల్, డిసెంబర్ 5: కేవలం చేతిలో సెల్‌ఫోన్ ఉంటే చాలని, నగదు రహితంగా ఎంత దూరమైన వెళ్లవచ్చునని జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ పేర్కొన్నారు. సోమవారం ఒకటో డివిజన్ పరిధిలోని నారాయణరెడ్డిపేటలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు బ్యాంక్ ఖాతా కలిగి ఉండాలని, అందరికి రూపేకార్డులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. రాబోవు రోజుల్లో నగదు లేకుండా కార్డుల ద్వారానే నగదు బదిలీ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ టెక్నాలజీని అందరూ తెలుసుకోవడం కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, నెల్లూరు మండలంలో ఉప్పుటూరు గ్రామం నగదు రహిత గ్రామంగా తయారైందని, ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి బ్యాంక్ ఖాతాలు, రూపే కార్డులు ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. రూపేకార్డు కలిగి ఉండటం వలన రేషన్ షాపు, వంట గ్యాస్ తదితర అవసరాలకు ఈ కార్డు ఉపయోగించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. అనంతరం ప్రజలను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

జయలలిత ఆరోగ్యంపై సరిహద్దులో ఆందోళన
సూళ్లూరుపేట, డిసెంబర్ 5: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం బాగా క్షీణించిందని తెలియడంతో తడ, సూళ్లూరుపేట సరిహద్దులో ఎడిఎంకె అభిమానులు ఆందోళన చెందారు. సరిహద్దు కావడంతో ఏవైన ఆందోళనలు జరుగుతాయని ముందుగానే తడ ఎస్సై సురేష్ బాబు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటు సరిహద్దు ఆరంబాకం వద్ద కేంద్ర బలగాలతో బందోబస్తు విధించారు. తమిళనాడు సిఎం అయినా ఈ ప్రాంతంలో కూడా ఆమెకు అభిమానులు ఉండటంతోపాటు మన రాష్ట్రంలో ఉన్న ఇతర పార్టీ నాయకులతో సత్సంబంధాలు ఉండటంతో ఆమె ఆరోగ్యంపై అన్ని పార్టీల నాయకులు ఆరాతీశారు.