శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ఎటిఎం దర్శనం కోరుతూ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, డిసెంబర్ 5: పాత నోట్ల రద్దు జరిగి ఓ మాసం పూర్తవుతోంది. సామాన్యుల సమస్య ఇప్పటికి సశేషంగానే ఉంది తప్ప సమాప్తం కానంటోంది. కరెన్సీ కష్టాలు ఓ వైపు, చచ్చి చెడి తెచ్చుకున్న పెద్ద నోటుకు చిల్లర దొరకక మరో వైపు ప్రజల కష్టాలకు పరిమితం ఉండటం లేదు. శనివారం జిల్లాకు రూ.167 కోట్ల మేర నగదు రిజర్వ్ బ్యాంక్ నుంచి వచ్చినట్లు జిల్లా అధికార యంత్రాంగం తెలిపింది. మరి వచ్చిన నగదు కొంత మందికే దక్కిందనే ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి. కొందరు ప్రైవేటు బ్యాంక్ సిబ్బంది తమ బ్యాంకులోని సామాన్యులను పట్టించుకోకుండా పెద్ద ఖాతాదారుల మెప్పు పొంది కమీషన్లు పొందుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నగదు ఉంచుకొని కూడా తమకు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాడనే ఆరోపణలతో ఖాతాదారులు వేదాయపాలెంలోని ఓ ప్రైవేటు బ్యాంక్ మేనేజర్, సిబ్బందిపై దాడికి యత్నించారు. వారిని నచ్చచెప్పేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. చివరకు ఎలాగోలా వ్యవహారం సద్దుమణిగింది. గత వారం కూడా ఇదే తరహాల్లో వేదాయపాలెం ఎస్‌బిఐ బ్రాంచి ఎదుట ఖాతాదారులు ఆందోళనకు దిగి బ్యాంకు సిబ్బందితో ఘర్షణకు దిగారు. ఆ సమయంలోనూ పోలీసులు లేకుంటే పరిస్థితి చేయి దాటిపోయేది. ఆర్‌బిఐ నుంచి బ్యాంకులకు వచ్చే నగదును బట్వాడా చేయడం బ్యాంక్ సిబ్బందికి కత్తి మీద సాములా మారింది. వచ్చే కొద్ది మొత్తం కాసేపటికే నిండుకుంటుండటంతో క్యూలైన్లలో నిలిచిన ఖాతాదారులకు ఏమి చెప్పాలో బ్యాంక్ సిబ్బందికి పాలుపోవడం లేదు. సోమవారం కూడా నగరంలో ప్రధాన బ్యాంకులు, ఎటిఎంల ముందు భారీ క్యూలైన్లు దర్శనమిచ్చాయి. వేకువజాము నుంచే ఖాతాదారులు నగదు డ్రా చేసుకొనేందుకు ఎటిఎంల ముందు బారులు తీరుతున్నారు. తెల్లవారుజాము నుంచి రాత్రి ఒంటి గంట వరకూ ఈ క్యూలైన్లు కనిపిస్తూనే ఉన్నాయి. బ్యాంకుల ముందు గంటల తరబడి నిలబడి చివరకు ఎలాగోలా కొంత నగదు తెచ్చుకుంటున్న వారి ఆనందం ఆ క్షణంలోనే ఆవిరవుతోంది. చేతిలో రూ.2వేల నోట్లు ఉంటుండటంతో వాటిని మార్చి చిల్లర సాధించడం మరో సవాల్‌గా మారింది. ఎక్కడకెళ్లినా రూ.2వేలకు ఎంతకు కొనుగోలు చేసినా చిల్లర దొరకని పరిస్థితి. ఇలా నోట్ల కోసం ఓ సారి, చిల్లర కోసం మరోసారి సామాన్యుడు నిత్యం నరకం అనుభవిస్తున్నాడు. నోట్లరద్దుకు నెలనాళ్లు పూర్తవుతున్నా దరిదాపుల్లో సమస్య పరిష్కారమయ్యే ఆనవాళ్లు మాత్రం కనిపించడం లేదు. ఎంత సేపటికి నల్లధనం రద్దు కోసం, భవిష్యత్తు కోసం ఇటువంటి సాహసోపేత నిర్ణయం తీసుకున్నామని చెబుతున్న నేతలు వర్తమానంలో సామాన్యుడు పడుతున్న బాధలు తాము అనుభవిస్తే తప్ప తెలిసిరాదనే భావనలో ప్రజలున్నారు.