శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

టిడిపి పాలనలోనే ఇంజనీరింగ్ విద్యకు ప్రోత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గూడూరు, జనవరి 7: రాష్ట్రంలో 2001లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం మండలానికొక ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటుచేసి ఇంజనీరింగ్ విద్యను సామాన్యులకు అందుబాటులోకి తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుదేనని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. శనివారం గూడూరు సమీపంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో నూతనంగా నిర్మించిన కళాశాల అదనపు భవనాలను, కనె్వన్షన్ హాళ్లను మంత్రులు యనమల, నారాయణ ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి యనమల విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ కళాశాల గుర్తింపు విద్యార్థుల హాజరుశాతాన్నిబట్టి పరిగణనలోకి తీసుకొనవచ్చునని తెలిపారు. విద్యార్థుల హాజరు శాతం ఎక్కువగా ఉంటే అన్ని గుర్తింపులు ఆ కళాశాలకు వస్తాయనడంలో సందేహం లేదని అన్నారు. 2001లో ఇంజనీరింగ్ విద్యను సామాన్యులకు దగ్గరకు చేయాలన్న సంకల్పంతో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం మండలానికొక ఇంజనీరింగ్ కళాశాలను మంజూరు చేసిందన్నారు. ఇంజనీరింగ్ కళాశాలలంటే గతంలో ఉన్నత వర్గాలకే పరిమతమయ్యేవని, నేడు సామాన్యుడు సైతం ఇంజనీరింగ్ విద్యను అభ్యసించి మంచి మంచి ఉద్యోగాల్లో ఉన్నారని పేర్కొన్నారు. ఉత్తమ విద్యను అందించేందుకు ఇంజనీరింగ్ కళాశాలలు కృషి చేయాలని అన్నారు. ప్రస్తుతం గూడూరులో ఆదిశంకర, నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు మంచి నాణ్యతా ప్రమాణాలతో విద్యను అందిస్తున్నాయనడానికి అక్కడ నుండి తయారైన విద్యార్థులు నేడు ఎన్నో రంగాల్లో రాణిస్తున్నారని అన్నారు. త్వరలో విద్యార్థులకు ఫీజు రీయంబర్స్‌మెంట్ సౌకర్యం అందించనున్నట్లు తెలిపారు. అనంతరం రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ ప్రతి ఇంజనీరింగ్ కళాశాలకు అనుంబంధంగా పరిశ్రమల వారితో టై అప్ పెట్టుకొని అక్కడ లభించే వస్తు ఉత్పిత్తికి సంబంధించి విద్యార్థులకు అవగాహన కల్పించడం, అక్కడ ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా కళాశాల యాజమాన్యాలు కృషి చేయాలన్నారు. హయ్యర్ ఎడ్యుకేషన్‌ను ప్రైవేటుపరం చేసి మంచి నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని తెలిపారు. ఇందుకోసం మేధావుల సలహాలు, సూచనలు తీసుకుంటామన్నారు. ప్రతి కళాశాలకు హాజరు శాతం పునాదిరాయి వంటిదన్నారు. అందులో ఆదిశంకర కళాశాల యాజమాన్యం ఉత్తమ ప్రమాణాలు పాటిస్తున్నదని, అందుకు నిదర్శనం ఇక్కడ చేరిన విద్యార్థుల సంఖ్యే తెలియచేస్తున్నదని అన్నారు. ఇదే విధానాన్ని కళాశాల యాజమాన్యం కొనసాగించాలన్నారు. ఇప్పటికే కొన్ని ఇంజనీరింగ్ కళాశాలలు నడపలేక మూతబడ్డాయన్నారు. కళాశాల నాణ్యత, విద్యా ప్రమాణాలకు గుర్తు విద్యాసంస్థలకు నాక్, ఎన్‌బిఎ, ఇతర అక్రిడేషన్లలన్నారు. విద్యార్థుల హాజరు విషయంలో 75 శాతం ఎలాంటి వత్తిడిలకు లోనుకాకుండా యాజమాన్యం అనుసరిస్తున్నందున కళాశాలకు మంచి గుర్తింపు వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ టూరిజం చైర్మన్ జయరామిరెడ్డి, ఎపిఐఐసి ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పి కృష్ణయ్య, తిరుపతి పార్లమెంటు సభ్యులు వి వరప్రసాద్‌రావు, గూడూరు శాసనసభ్యులు పాశం సునీల్‌కుమార్, ఎమ్మెల్సీలు బీద రవిచంద్ర, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, వి నారాయణరెడ్డి, పరసా రత్నం, పెంచలకోన దేవస్థాన ట్రస్టు బోర్డు చైర్మన్ తానంకి నానాజి, కళాశాల చైర్మన్ వంకి పెంచలయ్య, డైరెక్టర్ ఆర్ కృష్ణకుమార్, ఎవో జె రామయ్య, ప్రిన్సిపాల్ ఎస్‌వి రమణ, కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, కళాశాలల విద్యార్థులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.