శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

జైల్ అదాలత్‌తో శిక్షాకాలం తగ్గింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూరు, ఏప్రిల్ 19: జైల్ అదాలత్ కార్యక్రమం ద్వారా ఖైదీల శిక్షాకాలం తగ్గించే అవకాశాలుంటాయని ఆత్మకూరు జూనియర్ సివిల్ జడ్జి ఎం శంకర్రావు పేర్కొన్నారు. మంగళవారం ఆత్మకూరు సబ్ జైల్‌లో మండల లీగల్ సెల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో న్యాయవిజ్ఞాన సదస్సు చేపట్టారు. ఈ సదస్సులో భాగంగా ఆయన మాట్లాడుతూ ఖైదీలకు శిక్ష పడినా లేక రిమాండ్‌లో ఉన్నా జైల్ అదాలత్ ద్వారా శిక్షాకాలం తగ్గించే అవకాశాలుంటాయన్నారు. దాదాపుగా 90 రోజులపాటు శిక్షాకాలం కొనసాగేలా ఈ సందర్భంగా పలువురు రిమాండ్ ఖైదీలకు విముక్తి కల్పించారు. మొత్తం 90 రోజుల్లో ఇప్పటివరకు అనుభవించిన శిక్షాకాలం పోను మిగిలిన కాలం ఉండి ఆ తరువాత విడుదలయ్యేలా ఆదేశాలు జారీ చేశారు. అయితే దరఖాస్తు చేసుకున్న నిందిత ఖైదీలు నేరాన్ని అంగీకరించే పక్షంలోనే జైల్ అదాలత్ ద్వారా అవకాశం పొందేందుకు వర్తింపు ఉంటుందని వివరించారు. సదరు ఖైదీలు ఇతర కేసుల్లో కూడా ఉన్నట్లైతే తమ ఆదేశాలు వర్తించబోవన్నారు. అవన్నీ విచారణ చేసుకుని కొలిక్కి వచ్చిన తరువాతే జైలువాసం నుంచి విముక్తి పొందుతారని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆత్మకూరు హరిజనవాడకు చెందిన జ్యోతి మధు అనే గుళ్లలో చోరీల కేసు నిందితుడు మరో 16 రోజుల శిక్ష అనుభవించిన అనంతరం విడుదలయ్యేలా ఆదేశించారు. అలాగే ఉదయగిరికి చెందిన సైదాపురానికి చెందిన శ్రీకాంత్ విద్యుత్ తీగల కేసులో నిందితుడు కాగా, అతనికి కూడా జైల్ అదాలత్ ద్వారా విముక్తి కల్పించేలా ఆదేశించారు. అదేవిధంగా ఖలీల్ అనే ఆత్మకూరు పట్టణంలో రెండుచోట్ల మోటార్ బైక్‌లు అపహరించిన నిందితుడికి ఇప్పటివరకు 86 రోజులపాటు శిక్షాకాలం పూర్తి చేసిన దృష్ట్యా మరో నాలుగురోజుల అనంతరం విడుదలయ్యేలా ఆదేశించారు. ఈ సందర్భంగా న్యాయవాదులు తిరుపతమ్మ, ఓబులేష్ మాట్లాడుతూ ఖైదీలు శిక్ష అనుభవిస్తుంటే వారి కుటుంబాలు మనోవ్యధతో జీవిస్తుంటాయన్నారు. క్షణికావేశంలో నేరారోపణలకు గురయ్యే ఖైదీలు మానసిక పరివర్తనతో మెలిగి భవిష్యత్ జీవితాన్ని మెరుగుపరచుకోవాలని ఆకాంక్షించారు. రూ. లక్ష రూపాయల్లోపు సాంవత్సరీక ఆదాయం కలిగిన ఖైదీల కుటుంబాలకు ప్రభుత్వం తరపున ఉచిత న్యాయ సహాయం అందజేస్తున్నట్లు తెలిపారు.