శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

అన్నదమ్ముల మధ్య విభేదాలు స్పష్టించవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరుసిటీ, ఫిబ్రవరి 18: రామలక్ష్మణుల్లా కలసిమెలసి ఉన్న తమ సోదరుల మధ్య విభేదాలు స్పష్టించవద్దని మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి హితవు పలికారు. శనివారం ఏసి సెంటర్‌లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను ఎమ్మెల్సీ కావాలని అధిష్ఠానాన్ని అడుగుతున్నానని, కాని స్థానిక సంస్థల నుంచి కాదని చెప్పారు. ఆనం కుటుంబంపై ఇటీవల వస్తున్న భిన్న కథనాలపై స్పందించి తనకు, తన సోదరుడు ఆనం రామనారాయణరెడ్డిల మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. గతంలో ఇలాంటి పుకార్లే రాగా, వాటిని ఖండించకపోవడమే తాను చేసిన తప్పు అన్నారు. మంత్రి పదవి ఇస్తానంటే తన సోదరుడికి ఇవ్వమని తాను అడిగిన సంగతిని గుర్తు చేశారు. తాము రాజకీయాలు చేసేది నెల్లూరు కోసమేనని, పదవుల కోసం కాదన్నారు. రామనారాయణరెడ్డి చేసిన సిఫార్సుతోనే తాను ముఖ్యమంత్రిని కలిశానని తెలిపారు. తన తుదిశ్వాస విడిచేవరకు నెల్లూరు ప్రజలను, రాజకీయాలను, సోదరుడు ఆనం రామనారాయణరెడ్డిని వదులుకోనని ఆయన స్పష్టం చేశారు. ఈసమావేశంలో బర్నాబాస్, దిలీప్‌రెడ్డి, ముజీర్ తదితరులు పాల్గొన్నారు.

‘అసెంబ్లీలో చేనేతలపై ప్రస్తావించే నాయకుడే లేరు’
వెంకటగిరి, ఫిబ్రవరి 18: రాష్ట్రంలో చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు గురించి మాట్లాడేందుకు ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ముందుకు రావడం లేదని పద్మశాలీ సాధికారక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కెఎన్ మూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం పట్టణంలోని పద్మశాలీ కల్యాణ మండపంలో ఈనెల 20న జరిగే చేనేత సత్యాగ్రహాన్ని విజయవంతం చేయాలంటూ పట్టణంలోని చేనేతకు సంబంధించిన అన్ని కులాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా చేనేతను పూర్తిస్థాయిలో పట్టించుకున్న నాధుడే లేరన్నారు. ఎవరైతే రైళ్ళు తగలబెట్టి, ప్రభుత్వాన్ని అతలాకుతలం చేస్తారో వారికి ప్రత్యేక కార్పోరేషన్‌లు, రుణాలు, ఇతర సౌకర్యాలు ఏర్పాటుచేసే దిశగా ఈ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని ఆరోపించారు. తమ సమస్యలను శాంతియుతంగా ప్రభుత్వానికి తెలిపేందుకే తాము ఈనెల 20న మంగళగిరిలో చేనేత సత్యాగ్రహాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. చేనేతలు మంగళగిరిలో చేనేత సత్యాగ్రహం ఏర్పాటు చేస్తున్న విషయం తెలుసుకున్న సంబందిత మంత్రి చేనేతలకు ఇది చేస్తాం, అది చేస్తామంటూ తాజా ప్రకటనలు చేశారని అన్నారు. ఇప్పటిదాకా చేనేతల సమస్యలు మంత్రికి పట్టలేదని ఆయన విమర్శించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు నక్కా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ చేనేతల్లో ఐక్యత ఉందని, తామంతా ఒక్కటేనని, తాము ప్రభుత్వాన్ని తలవంచి సమస్యలు పరిష్కరించుకోగలమన్న విషయాన్ని తెలిజేసేందుకు చేనేత సత్యాగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి చేనేత కార్మికుడు పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమంలో పాల్గొని మన సత్తా చాటాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మాడా జానకిరాయమ్య, జిల్లా మహిళా కార్యదర్శి చొప్పా పద్మమ్మ, కౌన్సిలర్ మంచిబాబు, ఆప్కో డైరెక్టర్ పడిదం చెంచలబాబు, స్థానిక నాయకులు డాక్టర్ సంజీవరావరాయుడు, చెంచుకృష్ణయ్య, మధు, పెంచలయ్య, ఆదినారాయణ, తూపాటి చెంచయ్య, చేనేత నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.