శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్న చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేదాయపాళెం, ఏప్రిల్ 2: రాజ్యాంగాన్ని కాపాడాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అపహాస్యం చేస్తున్నారని వైసిపి జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి శాసన సభ్యుడు కాకాణి గోవర్థన్‌రెడ్డి విమర్శించారు. నగరంలోని స్థానిక మాగుంట లేఅవుట్‌లోగల వైసిపి జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివారం విలేఖరుల సమావేశం జరిగింది. ఈసందర్భంగా కాకాణి మాట్లాడుతూ మంత్రి వర్గ విస్తరణలో కుల వ్యవస్థీకరణ జరిగిందన్నారు. ఐదుగురు మంత్రులను తొలగించి 11 మంది కొత్త మంత్రులను చేర్చుకోవడం జరిగిందన్నారు. అందులో వైసిపికి బి ఫారంపై గెలిచిన వారికి మంత్రి పదవి ఇవ్వడం దురదృష్టకరమన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక వ్యక్తి టిఆర్‌ఎస్‌లో చేరి క్యాబినెట్ మంత్రి అయినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అన్యాయం, దారుణమని మాట్లాడారని, ఇప్పుడు వైసిపికి చెందిన ఎమ్మెల్యేలను ఎలా టిడిపిలోకి చేర్చుకున్నారో సమాధానం చెప్పాలన్నారు. మీకు జరిగితే ఓ న్యాయం మాకు జరిగితే ఓ న్యాయమా అని ఎద్దేవా చేశారు. టిడిపికి చెందిన ఎమ్మెల్యే టిఆర్‌ఎస్‌లోకి చేరడం రాజ్యాంగ ఉల్లంఘన అని కొంత మంది మంత్రులను వెంటబెటుకుని గవర్నర్‌పై దాడికి దిగిన మీరు రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. పార్టీ ఫిరాయింపు రాజ్యంగ ఉల్లంఘన అయితే వైసిపికి చెందిన ఎమ్మెల్యేలను టిడిపిలోకి తీసుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీకి ప్రజలు ఓట్లు వేస్తారన్న నమ్మకం ఉంటే ఫిరాయింపు ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించి తిరిగి సైకిల్ గుర్తుపై వారిని గెలిపించుకుని ఆ తరువాత క్యాబినెట్‌లో మంత్రి పదవులు ఇస్తే గౌరవప్రదంగా ఉంటుందన్నారు. ఫ్యాన్ గుర్తుపై గెలిచి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయకుండా, నైతిక విలువలు పాటించకుండా ఉన్న వారు డబ్బు, అధికారం కోసం కక్కుర్తిపడిన వారిని పార్టీలోకి తీసుకోవడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల కోసం పాటుపడుతున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఏదోరకంగా బురదచల్లే ప్రయత్నం చేయడం మంచి పద్ధతి కాదన్నారు. రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు అండగా ఉంటూ వారికి న్యాయం జరిగేలా చూస్తున్నారన్నారు. ప్రజల్లో జగన్‌కు రోజురోజుకు అభిమానం పెరుగుతుందన్నారు. రాబోవు రోజుల్లో చంద్రబాబుకు ప్రజలే సమాధానం చెబుతారన్నారు. 2019 ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్‌రెడ్డి రావడం ఖాయమన్నారు. ఈ సమావేశంలో వైసిపి నాయకులు పాల్గొన్నారు.

ఆరుగురు దారిదోపిడీ దొంగల ముఠా అరెస్ట్
* పోలీసులకు రివార్డులు
దొరవారిసత్రం, ఏప్రిల్ 2: హైవేలపై మహిళల వేషాలతో లారీ డ్రైవర్లను మోసగించే ఆరుగురు దొంగల ముఠాను దొరవారిసత్రం పోలీసులు శనివారం రాత్రి పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో గూడూరు ఇన్‌చార్జి డిఎస్పీ శ్రీనివాసాచారి వివరాలను వెల్లడించారు. శ్రీకాళహస్తికి చెందిన వెంకటగిరి శ్రీరాం, వెంకటేష్, నెల్లూరుకు చెందిన నాగుల అజయ్, వినోద్, ముత్తుకూరుకు చెందిన డేగా శీనయ్య, సోగా వెంకటేశ్వర్లు ముఠాగా ఏర్పడి హైవేలపై మహిళల వేషంలో లారీ డ్రైవర్లను సెక్స్ వర్కర్లుగా నమ్మించి చెట్ల పొదల మాటుకు వెళ్లిన అనంతరం వారిపై దాడి చేసి వారిని దోపిడీ చేసేవారని తెలిపారు. ఈ సభ్యులకు నాయకుడైన శ్రీరాం మహిళగా మేకప్ వేసుకొని హైవే పక్కన నిలిచి డ్రైవర్లను ఆకర్షించి వారిని చెట్ల పొదల్లోకి తీసుకొని వెళ్లేవాడని అక్కడ ముందుగా మాటు వేసిన మిగిలిన సభ్యులు డ్రైవర్‌పై దాడి చేసి వారి వద్దనున్న సొమ్ము అపహరించే వారని తెలిపారు. శనివారం రాత్రి హైవేపై గస్తీ నిర్వహిస్తున్న సత్రం కానిస్టేబుళ్లకు కలగుంట బ్రిడ్జి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరు కంటపడగా వీరి కదలికలను గమనించి చాకచక్యంగా వారిని అదుపులోకి తీసుకొన్నారు. మహిళ వేషంలో ఉన్న శ్రీరాం మగవాడు కావడం ఇతనిపై నాయుడుపేట పోలీస్ స్టేషన్‌లో పలు కేసులు ఉండటం గుర్తించి పలు కోణాల్లో విచారించారు. ఈ విచారణలో వారు తమ నేరాలను పోలీసులకు చెప్పారు. నిందితులపై కేసు నమోదు చేసి సూళ్లూరుపేట కోర్టుకు హాజరు పరచగా వారిని నెల్లూరు జైలుకు, తరలించారు. ముఠా సభ్యులను పట్టుకున్న పోలీస్ సిబ్బంది ఎ సునీల్‌కుమార్, ఎ వెంకటేశ్వర్లు, ఎస్ కిషన్, బాబ్జి బాలచంద్రరావు, వెంకటయ్య, రాఘవయ్య, హోం గార్డులు నరేష్, షాహుల్‌కు డిఎస్పీ శ్రీనివాసాచారి నగదు ప్రోత్సాహకాలను అందించారు. ఈ కార్యక్రమంలో నాయుడుపేట సిఐ రత్తయ్య, ఎస్సై కోటిరెడ్డిలు పాల్గొన్నారు.