శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

జిల్లాలో 16 లక్షల భూ రికార్డుల తప్పిదాలు:జెసి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మర్రిపాడు/ అనుమసముద్రంపేట, సెప్టెంబర్ 21: భూముల రికార్డులు తాజాపరచుట ప్రక్రియలో భాగంగా ఇప్పటివరకు జిల్లాలో 16 లక్షల వరకు తప్పిదాలను గుర్తించామని జిల్లా జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ పేర్కొన్నారు. గురువారం మర్రిపాడు, ఎఎస్‌పేట, ఆత్మకూరు మండలాల్లో ఆయన పర్యటించారు. ఇప్పటి వరకు చేపట్టిన రికార్డులను తాజాపరిచే ప్రక్రియ గురించి విఆర్‌ఓలను అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను సేకరించారు. అనంతరం ఆయన స్థానిక విలేఖర్లతో మాట్లాడుతూ జూన్ మాసాంతం తరువాత ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. అందులో భాగంగా జిల్లాలో 16 లక్షల తప్పిదాలను గుర్తించామన్నారు. మీ భూమికి భరోసా అనే కార్యక్రమం కూడా జరుగుతుందన్నారు. రెవెన్యూ రికార్డుల్లో తప్పులుంటే సవరించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. రైతులు అర్జీలు ఇస్తేనే సమస్యను పరిష్కరించేలాగాక, ముందస్తుగానే రెవెన్యూ రికార్డులను సరిచేయడం జరుగుతుందన్నారు. తప్పిదాలను గుర్తించిన అనంతరం వచ్చే నవంబర్ 2వ తేదీలోగా సవరించడం జరుగుతుందన్నారు. రైతులకు ఎలాంటి ఇక్కట్లకు తావివ్వకుండా రికార్డులను సజావుగా సరి చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్రం అంతటా నెల్లూరుజిల్లా రికార్డుల తాజాపరిచే కార్యక్రమం వైపునకు దృష్టిసారిస్తుందన్నారు. కార్యక్రమంలో ఆత్మకూరు బాపిరెడ్డి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
చిరమన భూములపై విచారణ
ఎఎస్ పేట మండలంలోని చిరమన గ్రామంలో ఓ భూస్వామి బినామీ పేర్లతో ప్రభుత్వ భూమి ఆక్రమించిన వైనంపై ఇటీవల జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో విచారణ వేగవంతం చేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. ఈ మేరకు త్వరితగతిన విచారణ చేపట్టి నివేదికలను తయారు చేయాలని తహశీల్దార్ నాగరాజును ఆదేశించారు. తహశీల్దార్ ఇందుకు స్పందిస్తూ ఇప్పటికే సంబంధిత భూ ఆక్రమణదార్లకు నోటీసులు జారీ చేయడం జరిగిందన్నారు. వారంరోజుల్లోగా నివేదిక మొత్తం అందచేయడం జరుగుతుందన్నారు. అలాగే ఎఎస్ పేట గ్రామ పంచాయతీ మజరా చందులూరుపాడుకుకి చెందిన మండవ వీరయ్య అనే రైతు జెసి కోర్టులో కేసు నడుస్తున్న భూమిని దౌర్జన్యంగా దున్నడంపై ఏఎస్‌పేటకు చెందిన పి సందానీ జిల్లా జాయింట్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై పరిశీలించాలని తహశీల్దార్‌ను ఆదేశించారు.

జొన్నవాడలో ప్రారంభమైన శరన్నవరాత్రి ఉత్సవాలు
బుచ్చిరెడ్డిపాళెం, సెప్టెంబర్ 21: మండలంలోని జొన్నవాడ గ్రామంలో గల శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు గురువారం సాయంత్రం కలశ స్థాపనతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈసందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పుట్టా సుబ్రహ్మణ్యం నాయుడు మాట్లాడుతూ శరన్నవరాత్రులను పురస్కరించుకుని రోజూ రెండుసార్లు నవావరణ పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉభయకర్తలకు కాలరాత్రి నవావరణ పూజలు జరుగుతాయని చెప్పారు. భక్తులు పెద్దసంఖ్యలో విచ్చేసే అవకాశం ఉన్నందువల్ల గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. భక్తులు సౌకార్ధ్యం అన్నదాన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని శరన్నవరాత్రుల ఉత్సవాలను జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

భువనేశ్వరిగా కన్యకాపరమేశ్వరి
ఆత్మకూరు, సెప్టెంబర్ 21: ఆత్మకూరు పట్టణంలోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా తొలిరోజున భువనేశ్వరి అలంకరణ చేపట్టారు. గురువారం నిర్వహించిన ఈ అలంకరణకు ఆర్యవైశ్య మందుల దుకాణదార్ల సంఘం, రైస్‌మర్చంట్‌ల సంఘం, మారుతీ మెడికల్స్, శ్రీనివాస మెడికల్స్, లక్ష్మీమెడికల్స్, కృష్ణమెడికల్స్, వెంకటేశ్వర మెడికల్ స్టోర్స్, మహాలక్ష్మి మెడికల్స్, కనమర్లపూడి గుర్నాధం, మురారిశెట్టి సుబ్రహ్మణ్యం, కొత్త నారాయణ సోదరులు, మెంటా ఆదినారాయణ, దేవరశెట్టి మోహన్‌రావు, రాచపూటి వెంకటేశ్వర్లు, దోర్నాదుల కిశోర్‌లు ఉభయకర్తలుగా వ్యవహరించారు. అలాగే పట్టణంలోని విశే్వశ్వరాలయంలో అన్నపూర్ణాదేవికి బాలత్రిపుర సుందరి అలంకరణను ఆలయ అర్చకులు శివయ్యస్వామి ప్రత్యేకంగా రూపొందించారు. అదేవిధంగా కాశీనాయన ఆశ్రమంలో, పాఠశాలల్లో గాయత్రి అమ్మవారిని రాజరాజేశ్వరిదేవిగా అలంకరించారు. ఉత్తరబలిజవీధిలోని జ్వాలాముఖి అమ్మవారికి స్వర్ణకవచ అలంకరణ చేపట్టారు. ఈ కార్యక్రమానికి బైసాని మధుసూదనరావు, ఉషారాణి, శ్రీనివాసులు, ద్వారక దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు.