శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

నిండితే కడలిపాలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూరు, అక్టోబర్ 15: నెల్లూరుజిల్లా రైతాంగం అవసరాలను తీర్చే సోమశిల జలాశయం నేటికీ నిల్వ చేసుకునేలా పూర్తి సామర్ధ్యం (77.98) టిఎంసిలకు అనుకూలించడం లేదు. పెన్నాకు ఉప నదులు అయిన కుందూ, చెయ్యేరుతో సహా శ్రీశైలం ప్రాజెక్ట్ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి వరద ప్రవాహం తరలి వస్తుండటంతో సోమశిల పరిస్థితి ఆశాజనకంగా మారింది. ఇప్పటికే 41 టిఎంసిల నీటి నిల్వ చేరింది. ఆదివారం 23 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. గత వారం రోజులుగా హెచ్చు తగ్గులుగా వస్తూ గరిష్టంగా 40వేల క్యూసెక్కులకు కూడా ఇన్‌ఫ్లో చేరడం విశేషం. సుమారుగా 73 టిఎంసిల వరకు చేరగానే పైతట్టున ఇంకా ఖాళీ చేయాల్సి ఉన్న మూడు గ్రామాల్లో ముంపులోకి చేరుతుండటంతో అంతటితో అదనపునీటి రాశి అంతా కడలిపాల్జేయడం ఆనవాయితీగా మారుతోంది. ప్రస్తుతం రోజూ రెండు టిఎంసిల వంతున నీటి నిల్వ చేరుతోంది. వాస్తవంగా 21 టిఎంసిల నీటి నిల్వ చేరగానే ఆ తరువాత వచ్చే నీటిని కండలేరు రిజర్వాయర్‌కు కూడా తరలించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఆ నిల్వకు రెట్టింపు చేరినా ఇంతవరకు కండలేరుకు తరలించే సంగతి పట్టించుకోలేదు. ఐఏబి సమావేశం తరువాతనే కండలేరు తరలింపు విషయమై నిర్ణయించనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆలోగా మరోమారు వరద వస్తే భారీ రాశి సముద్రానికి వదిలేయాలి. అప్పటికప్పుడు అధిక మొత్తంలో తరలిద్దామన్నా ఎస్‌కెఎఫ్‌ఎఫ్‌సి (సోమశిల-కండలేరు వరద ప్రవాహపుకాలువ) పటిష్టత అంతంత మాత్రమే. ఈ కాలువను 12వేల క్యూసెక్కుల తరలింపునకు అనుగుణంగా నిర్మించినా అందులో సగభాగం తరలించేటప్పుడే ఇరువైపులా పంట పొలాలు మునకకు గురవుతున్న సందర్భాలున్నాయి. గతంలో గ్రౌంటింగ్ పనులు జరిగినా గరిష్ట సామర్ధ్యానికి తగ్గట్లు తరలింపు వ్యవహారంలో సమస్యలు నెలకొంటున్నాయి. ఇదిలాఉంటే జిల్లా సాగునీటి సలహా సంఘ సమావేశం ఈనెల 24 లేక 25 తేదీల్లో నిర్వహించవచ్చనే ప్రకటనలొస్తున్నాయి. గతంలో ఐఏబి భేటీకి ముందుగానే కండలేరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు నీటి తరలింపు చేపట్టిన దాఖలాలు అనేకం. ఇదిలావుంటే ఐఏబి సమావేశంలో నిర్మాణపరమైన కీలక నిర్ణయాలు, తీర్మానాల అమలుకు సంబంధించి పురోగతి కరవవ్వడంపై రైతుల వెతలు ఎప్పటికప్పుడు వర్ణనాతీతం. ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వంలోనైనా ఈ సమస్య కొలిక్కి రావాలని కొండంత ఆశతో అన్నదాతలు నిరీక్షిస్తున్నారు. ఇప్పటివరకు ప్రతి పర్యాయం నీటి విడుదల తీర్మానాలను మాత్రమే మొక్కుబడిగా అమలుచేసి సరిపెట్టుకోవడానికే ఇరిగేషన్ అధికార యంత్రాంగం పరిమితమవుతుండటం పరిపాటి. నెల్లూరుజిల్లాలో ఏటేటా విధిగా లేట్ ఖరీఫ్, రబీ (ఎడగారు) పంటలపరంగా ఐఏబి సమావేశాలు నిర్వహిస్తారు. ఈ సమావేశాల్లో భాగంగా నీటిపారుదలకు సంబంధించిన వివిధ శాశ్వత, తాత్కాలిక నిర్మాణాలపై కూలంకుశ చర్చలు చోటుచేసుకోవడం పరిపాటి. ఆ చర్చలను అనుసరించి తీర్మానాలు చేస్తున్నారు. గత ఏడాది జిల్లాలో వర్షపాతం సగటు కంటే తక్కువగా నమోదైంది. అలాంటి సందర్భాల్లో సాగునీటిపరమైన అభివృద్ధి పనులు సమగ్రంగా జరిగితే పారుదల సౌకర్యం మెరుగుపడేందుకు అవకాశాలుంటాయి. జిల్లాలోనే అతిపెద్ద సాగు వనరుగా అక్కరకొచ్చే సోమశిల జలాశయంలో ఆశాజనకంగా నీటి మట్టం ఉన్నప్పుడు కూడా వివిధ సమస్యల నేపథ్యంలో రైతులు పంటలు సజావుగా గట్టెక్కించు కోలేకపోవడం బాధాకరం. గత కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన జలయజ్ఞం ప్యాకేజీల పనులు ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అనేలా నిర్మాణాలుండటం శోచనీయం. జిల్లాలో ప్రధానంగా నెల్లూరు, సంగం బ్యారేజిల నిర్మాణాలు సమీప భవిష్యత్‌లో ఓ కొలిక్కి వచ్చే అవకాశాలైతే లేవు. ఐఏబిపరంగా నీటి విడుదల తీర్మానాలకే తప్ప అభివృద్ధి పనులకు సంబంధించిన అంశాల్లో కదలికల్లేకపోవడంతో రైతుల వేదన వర్ణనాతీతం. జలయజ్ఞం పథకం కింద వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరగాల్సి ఉంటే ఏళ్ల తరబడి ఈ పనుల్లో జాప్యం చోటుచేసుకుంటున్నా నివారించే నాధుడే కరవు. గతంలో ప్యాకేజీలకు తగ్గట్లుగా భారీ యంత్ర సామగ్రి సమకూర్చుకునేందుకు అవసరమైన మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు పంపిణీ చేసినా పనుల పురోగతి ఆశాజనకంగా ఉండకపోవడం విమర్శలకు తావిస్తోంది. నిర్ధిష్టమైన కార్యాచరణ దిశగా కాంట్రాక్టర్లు పనులు చేసేలా అధికార యంత్రాంగం పర్యవేక్షణా లోపంపైనే విమర్శలు చోటుచేసుకుంటున్నాయి. నిర్మాణక్రమం ఎంతగా జరిగితే అంతవరకు బిల్లులు చెల్లిస్తామంటూ గతంలో ప్రభుత్వం నుంచి హామీ వచ్చినా స్పందన కరవు. ఇదే నేపథ్యంలో కాంట్రాక్టర్లు పర్సంటేజీల్లో లెక్కలు చూపుతూ బిల్లులు కాజేయడంలో దృష్టిసారించారు. ఉత్తర కాలువకు సంబంధించి విస్తరణ, లైనింగ్ పనులకు సంబంధించి ఇక్కడో అక్రమానికి తెరతీశారు. ఒక కిలోమీటర్ నిడివిలో విస్తరణ, లైనింగ్ చేయాల్సి ఉంటే, విస్తరణ (మట్టిపని చేసి) ఏభై శాతం వరకు బిల్లులు వసూళ్లు చేసుకున్నారు. ఇందుకు అధికారులు కూడా తిలాపాపం తలా పిడికెడుగా సహకరించడం గమనార్హం. ఇదిలాఉంటే ఐఏబి సమావేశంలో ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికార యంత్రాగం హాజరుకావడం, ఆయా ప్రతిపాదనలపై చర్చించి ఆమోదముద్ర వేయడం జరుగుతుంది. అవి ఏపాటి చిత్తశుద్ధితో పురోగతి సాధిస్తున్నాయనేది ఏటేటా నత్తకు మేనత్తను తలపించే పరిస్థితిలా మారుతోంది.