శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

సహకార బ్యాంకుల ద్వారా రైతులకు రూ. 755కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనుబోలు, ఏప్రిల్ 22: 2016-17 సంవత్సరంలో రైతులకు సహకార బ్యాంకుల ద్వారా 755కోట్ల రూపాయలు రుణాలు అందించనున్నట్లు జిల్లా సహకార బ్యాంకు ఛైర్మన్ మెట్టకూరు ధనుంజయరెడ్డి వెల్లడించారు. శుక్రవారం ఆయన స్థానిక సహకార బ్యాంకులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు వికాస పథకం కింద రూ.250కోట్లు, క్రాప్ లోన్లు రూ.350కోట్లు, వ్యక్తిగత రుణాలు రూ.35కోట్లు, ఎల్‌టి రుణాలు రూ.30కోట్లతోపాటు తదితర రుణాలను అందిస్తామన్నారు. రైతులు ఆర్థికాభివృద్ధి సాధించడమే తమ బ్యాంకు లక్ష్యమన్నారు. అధిక వడ్డీలు తెచ్చుకుని రైతులు ఆర్థికంగా చితికిపోకుండా ఉండేందుకు తమ బ్యాంకు రుణాలు అందిస్తుందన్నారు. గత 2006 సంవత్సరం వరకు తమ బ్యాంకులో పనిచేస్తున్న సిబ్బందికి జీతాలు ఇవ్వలేక నష్టాల ఊబిలో ఉండగా నేడు లాభదాయకంగా తయారైందన్నారు. తన పదవీ కాలం ముగిసే లోగా రూ.1000కోట్లు రుణాలు అందించే దిశగా ప్రణాళికలు తయారు చేస్తున్నామన్నారు. మనుబోలు సొసైటీకి సొంత కార్యాలయ నిర్మాణానికి ఎంఎల్‌సి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ద్వారా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
మిల్లర్ల వద్ద రైతులు పడే బాధలను సిఎం దృష్టికి తీసుకెళ్తా
ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల నుండి వెళ్లే రైతులు మిల్లర్ల వద్ద తీవ్ర ఇబ్బందులుపడుతున్న విషయం వాస్తవమేనని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారాయణ, ఎంఎల్‌సి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళానన్నారు. వీరితోపాటు జెసి ఇంతియాజ్‌కు నివేదికను అందిస్తామన్నారు. ప్రస్తుత సంవత్సరం పండిన ధాన్యంతో రైతుల కళ్లల్లో ఆనందం వెల్లివిరుస్తుందన్నారు. జిల్లాలో 89 సొసైటీల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని, వీటి ద్వారా గురువారం సాయంత్రానికి రైతుల వద్ద నుండి రూ.72కోట్లు విలువ చేసే 49.50మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. సివిల్ సప్లయ్స్ అధికారులు సక్రమంగా పనిచేయడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార సొసైటీ డైరెక్టర్లు చిట్టమూరు వెంకటశేషారెడ్డి, వై.కృష్ణారెడ్డి, సిఇఓ రాజారెడ్డి, స్థానిక డైరెక్టర్ మోడేగుంట వెంకటరమణయ్య, మనుబోలు మాజీ ఎంపిపి చేరెడ్డి పట్ట్భారామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.