శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

26 లోగా కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముత్తుకూరు, జనవరి 19: ఈనెల 26వ తేదీలోగా కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే మరోసటిరోజు నుంచి సమ్మెను ఉద్ధృతం చేస్తామని రాష్ట్ర విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల ఐక్యవేదిక కన్వీనర్ ఎస్‌వి రమణమూర్తి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన్నప్పటికీ ఏ మేరకు అమలు జరిగిందని, ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. శుక్రవారం రాత్రి ఏపీ జెన్‌కో థర్మల్ కేంద్రం సమీపాన రోడ్డు వెంబడి మైదానంలో నేలటూరు ఏపీ జెన్‌కో రీజనల్ ఐక్యవేదిక ఆధ్వర్యంలో కాంట్రాక్టు కార్మికుల ఆత్మీయ సదస్సు జరిగింది. ఈ సదస్సుకు రాష్ట్ర కన్వీనర్ ఎస్‌వి రమణమూర్తి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఎంప్లారుూస్ ఐక్యవేదిక వైస్‌చైర్మన్ డి సూరిబాబు, కోఆర్డినేటర్ భారతి, మరికొంత మంది యూనియన్ నాయకులు విచ్చేశారు. ఆత్మీయ సదస్సును ఉద్దేశించి ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ రమణమూర్తి మాట్లాడారు. ఏపీజెన్‌కో కాంట్రాక్టు కార్మికుల న్యాయపరమైన డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పరిష్కారం చూపాలని ఆయన కోరారు. ఈ నెల 26లోగా కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే మరుసటి రోజున సమ్మెను ఉద్ధృతం చేస్తామని ఈ విషయంలో కార్మికులంతా కలిసికట్టుగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. అందులో భాగంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏపీజెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కమ్‌లో విద్యుత్ కార్యకలాపాలను స్తంభింపజేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పొరుగు దేశాల నుంచి పారిశ్రామికవేత్తలను పరిశ్రమలను నెలకొల్పే దిశగా ఆహ్వానించడం శుభపరిణామం అన్నారు. పారిశ్రామికవేత్తలు రావాలన్నా, పరిశ్రమలు రావాలన్నా కార్మికులు సంతోషంగా ఉండాలని, కార్మిక సంక్షేమం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. కాంట్రాక్టు కార్మికుల డిమాండ్లను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వ, ప్రాజెక్టు అధికారులు సమస్యలు పరిష్కరించడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారని, ఇదే కొనసాగితే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన అన్నారు. తదుపరి రాష్ట్ర ఎంప్లారుూస్ ఐక్యవేదిక వైస్‌చైర్మన్ డి సూరిబాబు మాట్లాడుతూ ఏపీ జెన్‌కో కాంట్రాక్టు కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని, అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న సుప్రీం కోర్టును తీర్పును అమలు చేయాలని ఆయన కోరారు. ఉద్యమాలతోనే ఏదైనా సాధించవచ్చని, బెదిరింపులకు, పోలీసులకు భయపడవద్దని ఎలాంటివాటికైనా కార్మికుల ముందు తాము ఉక్కుకవచంలా నిలబడతామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా కాంట్రాక్టు కార్మికుల సంఘం ఐకయవేదిక చైర్మన్ జి కృష్ణ, ఏపీ జెన్‌కో రీజనల్ ఐక్యవేదిక కాంట్రాక్టు కార్మికుల అధ్యక్షులు ఎ అనిల్, జనరల్ సెక్రటరీ ఎన్ సురేష్, కోశాధికారి కె నాగరాజు, కోఆర్డినేటర్ రవీంద్ర, కన్వీనర్ సిహెచ్ నాగరాజు, ఉప చైర్మన్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.