శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

పెద్దల సభకు వేమిరెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, ఫిబ్రవరి 20: జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి రాజ్యసభ సభ్యుడిగా వెళ్లే అవకాశాలు రోజురోజుకి మెరుగవుతున్నాయి. జిల్లాలో తన సొంత నిధులతో ఎన్నో సంక్షేమ, అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించే ఆయనకు జిల్లాలో మంచి వ్యక్తిగా, దాతృత్వం కలిగిన సహృదయుడిగా పేరుంది. జిల్లాలో ఇప్పటికే పదుల సంఖ్యలో గ్రామాల్లో సురక్షిత తాగునీటి ప్లాంట్లను ఆయన ఏర్పాటు చేయడంతో పాటు ఉచిత విద్య కోసం పాఠశాల, ఉచిత వైద్యం కోసం వైద్యశాల తన సొంత నిధులతో నిర్వహిస్తున్నారు. గత మూడేళ్లుగా జిల్లాలో వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తాను చేపట్టిన పలు సంక్షేమ కార్యక్రమాల కారణంగా ప్రజలకు దగ్గరయ్యారు. తొలుత వైకాపాలో చేరిన ఆయన తదనంతర పరిణామాల నేపథ్యంలో టీడీపీలో చేరేందుకు సిద్ధమై ముఖ్యమంత్రిని, ఆయన కుమారుడితోనూ చర్చలు జరిపారు. జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాటుచేసి ప్రత్యేక కార్యక్రమంలో పార్టీలో చేరేందుకు ఆయన అన్ని ఏర్పాట్లు చేశారు. మూడు పర్యాయాలు ఈ కార్యక్రమం రద్దయింది. వేమిరెడ్డి చేరికను టీడీపీలో ఒక వర్గం గట్టిగా వ్యతిరేకిస్తుండడమే ఇందుకు కారణమనే అభిప్రాయం అప్పట్లో వ్యక్తమైంది. దీంతో కొంతకాలంగా స్తబ్ధుగా ఉన్న వేమిరెడ్డి వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా జిల్లాలో పర్యటించే సమయంలో తిరిగి వైకాపాలో చేరేందుకు నిర్ణయించుకొని భారీ ఏర్పాట్లతో జగన్‌కు స్వాగతం పలుకుతూ తిరిగి వైకాపా గూటికి చేరారు. ఆయన్ను పార్టీలోకి తిరిగి తీసుకురావడంలో వైకాపా రాజ్యసభ సభ్యుడు, జిల్లాకే చెందిన విజయసాయిరెడ్డి కీలకపాత్ర పోషించారు. వేమిరెడ్డితో పలు దఫాలు చర్చించిన ఆయన వేమిరెడ్డి సేవలు జిల్లాలో పార్టీకి అవసరమని ఆయన్ను ఒప్పించినట్లు తెలిసింది. ఈ చర్చల సమయంలో వేమిరెడ్డి కోరుకున్న రాజ్యసభ స్థానాన్ని ఇచ్చేందుకు జగన్‌మోహన్‌రెడ్డితో మాట్లాడి ఒప్పిస్తామని హామీనిచ్చారు. వారి హామీతో గూడూరులో జరిగిన కార్యక్రమంలో జగన్ సమక్షంలో వేమిరెడ్డి తిరిగి పార్టీలోకి వచ్చారు. రాబోయే నెలలో జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లో రాష్ట్రంలో ఖాళీ కాబోతున్న మూడు స్థానాల్లో ఒక స్థానం ప్రతిపక్ష వైకాపాకు దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. స్థానానికి అవసరమైన 44 మంది ఎమ్మెల్యేల బలం అవసరమైన నేపధ్యంలో ప్రస్తుతం గెలిచిన ఎమ్మెల్యేలు కొందరు టీడీపీలోకి వెళ్లడంతో ప్రస్తుతం వైకాపా వద్ద కూడా సరిపడా 44 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. వీరిలో కూడా ఎవరూ కప్పదాటుకు పాల్పడకుండా ఉండేందుకు, ముందస్తుగా ఆర్థికంగా స్థితిమంతుడైన వేమిరెడ్డిని రాజ్యసభ రేసులో నిలిపేందుకు జగన్ కూడా పచ్చజెండా ఊపినట్లు తెలిసింది. ఈ విషయాన్ని ఆయన ఇప్పటికే పార్టీ స్టీరింగ్ కమిటీతోపాటు జిల్లా నేతలకు స్పష్టం చేసినట్లు సమాచారం. తమ ఎమ్మెల్యేలు జారిపోకుండా చూడడంతో పాటు తమను విభేదించి టీడీపీలోకి వెళ్లి అక్కడ నిరాదరణకు గురవుతున్న కొందరు ఎమ్మెల్యేలను తిరిగి తమ గూటికి తీసుకువచ్చే ప్రయత్నాలకు వైకాపా నేతలు దిగారు. కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ వైకాపా తరపున గెలిచినా టీడీపీలోకి వెళ్లి తాను తప్పు చేశానని ఇటీవల బహిరంగంగా పేర్కొనడం ఆ పార్టీశ్రేణుల్లో ఉత్సాహాన్ని తీసుకువచ్చింది. ఆయనతో పాటు మరికొందరు తమ పార్టీ ఎమ్మెల్యేలు తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయని జిల్లాకు చెందిన వైకాపా నేత ఒకరు భరోసా వ్యక్తం చేశారు. ఈక్రమంలో రాజ్యసభ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పేరు త్వరలోనే వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రకటించే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. అయితే విజయసాయిరెడ్డి మాత్రం ఇప్పటికే దీనిపై బహిరంగంగా తమ పార్టీ తరపున రాజ్యసభకు వేమిరెడ్డి పోటీలో ఉంటారని ప్రకటించారు. అయితే అధినేత నోటి వెంట మాట వినేందుకు వేమిరెడ్డి అభిమానులు ఎదురుచూస్తున్నారు. రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ మార్చి నెలలో ఎన్నికల సంఘం విడుదల చేసే అవకాశం ఉన్నందున అది జరిగిన వెంటనే వేమిరెడ్డి పేరును జగన్ ప్రకటిస్తారని జిల్లా నేతలు చెబుతున్నారు.

ఉపాధ్యాయులు సకాలంలో విధులకు హాజరుకావాలి:ఆర్‌జెడి
వింజమూరు, ఫిబ్రవరి 20: ఉపాధ్యాయులు పాఠశాలలకు సకాలంలో హాజరుకావాలని గుంటూరు రీజనల్ జాయింట్ డైరెక్టర్ కెవి శ్రీనివాసులురెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన స్థానిక జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలను పరిశీలించేందుకు వచ్చారు. ఈసందర్భంగా ఆయన ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ బయోమెట్రిక్, ఐరిష్‌లను ఉపయోగిస్తూ ప్రతి ఉపాధ్యాయుడు సకాలంలో పాఠశాలకు హాజరుకావాలన్నారు. ప్రతి తరగతిలో వెనుకబడి ఉన్న విద్యార్థుల జాబితాను తయారుచేసి వారిపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. 45 రోజులకు ఓ ప్రణాళిక తయారీ చేయాలన్నారు. పదో తరగతి పరీక్షల్లో జిపిఏ పది పాయింట్లతో సహా ఉత్తీర్ణతాశాతం పెంచాలన్నారు. అందుకు అందరు ఉపాధ్యాయులు సమష్టిగా కృషి చేయాలన్నారు.