శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, ఫిబ్రవరి 20: నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఆదుకోవాలని ఎన్‌ఎంయూ రాష్ట్ర కార్యదర్శి రమణరాజు డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక డిపోలో ఆయన కార్మికుల సమస్యలపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీలో పనిచేస్తున్న కార్మికులు చిన్నచిన్న పొరపాట్లు చేస్తే చర్యలు చాలా దారుణంగా ఉన్నాయన్నారు. ఏదైనా పొరపాటు జరిగితే విచారణ చేసి నిజమని తేలితే చర్యలు తీసుకొంటే బాగుంటుందన్నారు. మహిళా కండక్టర్లకు ప్రత్యేక వసతులు కల్పించి వారికి అనువైన డ్యూటీలు వేయాలన్నారు. అదేవిధంగా ప్రతి డిపోలో మహిళా కార్మికులకు ప్రత్యేక విశ్రాంతి గది ఏర్పాటు చేయాల్సిన బాధ్యత సంస్థదేనని స్పష్టం చేశారు. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి 2017 ఏఫ్రిల్ నుంచి చేసిన నూతన పే స్కేల్‌ను వెంటనే అమలు చేయాలన్నారు. కాలంచెల్లిన బస్సుల స్థానంలో నూతన బస్సులు ఏర్పాటు చేయాలన్నారు. కాలంచెల్లిన బస్సులను నడిపి యాజమాన్యం ఏదైనా జరగరానిది జరిగితే సిబ్బందిపై నెపం నెట్టివేస్తున్నారని ఈ విధానానికి స్వస్తి పలికాలన్నారు. జోనల్ కార్యదర్శి మురళీధరన్ మాట్లాడుతూ సమైక్యాంధ్ర సమ్మె కాలంలో కార్మికులందరికి జీతాలు చెల్లించాలన్నారు. గ్యారేజిలో ఖాళీ పోస్టులన్ని భర్తీచేసి కార్మికులకు డిపోలో ఆరోగ్య భద్రత కోసం ప్రత్యేక వైద్యులను కేటాయించాలన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ఈనెల 22న నెల్లూరు ఆర్‌ఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామన్నారు. యాజమాన్యం వెంటనే కార్మికులపై కక్షసాధింపు చర్యలు మానుకొని ఆర్టీసీ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.