శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ఈ మార్కెటింగ్‌తో దళారీ వ్యవస్థకు చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొదలకూరు, మార్చి 22 : దళారీ వ్యవస్థకు చెక్ పెట్టేందుకు ఈ మార్కెటింగ్ విధానం అమల్లోకి తీసుకొచ్చామని రాష్ట్ర వ్యవసాయ ప్రత్యేక కమిషనర్ శామ్యూల్ ఆనందకుమార్ పేర్కొన్నారు. గురువారం స్థానిక నిమ్మ మార్కెట్ యార్డులో జరుగుతున్న అభివృద్ధి పనులతో పాటు నిమ్మకాయల గ్రేడింగ్‌ను పరిశీలించారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని పలువురు వ్యాపారులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు ఆయన సమాధానమిస్తూ నిర్మాణాల్లో అక్రమాలు జరిగినట్లు తేలితే బాధ్యులపై తప్పక చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతుల ముసుగులో కొందరు వ్యాపారులు ఈ మార్కెటింగ్ విధానం వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. మార్కెటింగ్‌శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఉపేంద్ర, డీఈ నారాయణ తదితరులు ఆయన వెంట ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.