శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

అందరి భాగస్వామ్యంతో జల ఉద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకటాచలం, ఏఫ్రిల్ 28 : భవిష్యత్ తరాలకు నీటి ఎద్దడి లేకుండా ఉండేందుకు జరుగుతున్న నీటి పొదుపు ఉద్యమంలో పార్టీలకతీతంగా అందరూ భాగస్వాములు కావాలని సర్వేపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జ్, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. మండల కేంద్రమైన వెంకటాచలంలోని తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో ఆయన గురువారం ఇంకుడుగుంత తవ్వారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తు తరాల వారు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఇంకుడుగుంత కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిందని వెల్లడించారు. నీటి పొదుపులో భాగంగా వర్షపునీటిని, భూగర్భ జలాలలుగా మార్చేందుకు ఇంకుడుగుంతలు తవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన పిలుపునకు మంచి స్పందన వచ్చిందన్నారు. ప్రజలు నీటిని పొదుపుగా వాడటంతోపాటు వాడిన నీటిని కూడా భూగర్భంలో ఇంకించేందుకు తమ ఇళ్లలో ఇంకుడుగుంతలు తవ్వుకోవాలని ఆయన సూచించారు. నాయకులు తమ వద్ద పనికి రావాలంటే తప్పనిసరిగా ఇంకుడుగుంతలు తవ్వాల్సిందేనని తేల్చి చెప్పారు. స్థానిక ప్రజాప్రతినిధులు పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని తమ సామాజిక బాధ్యతగా తీసుకోవాలన్నారు. ఉదయగిరి నియోజకవర్గంలోని జలదంకి మండలంలో అక్కడి శాసనసభ్యుడు బొల్లినేని రామారావు కోటి రూపాయల విలువ చేసే చెక్‌డ్యాంను 50 లక్షలతో జర్మన్ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఫైబర్ చెక్‌డ్యాం బాగుందన్నారు. దీన్ని మోడల్‌గా తీసుకుని అన్నిచోట్ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. జిల్లాలోనే సర్వేపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిపథంలో ముందుకు తీసుకెళ్లి మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు. నియోజకవర్గంలోని వెంకటాచలం, మనుబోలు, పొదలకూరు మండలాల్లో 120 చెక్‌డ్యాంల నిర్మాణానికి 33 కోట్ల రూపాయల మంజూరుకు ప్రణాళికలు పంపినట్లు వెల్లడించారు. నీరు-చెట్టు కార్యక్రమం కింద నియోజకవర్గానికి 14.50 కోట్లు విడుదలైనట్లు ఆయన తెలిపారు. వీటిని నీటి సంరక్షణ కార్యక్రమాలకు కూడా వినియోగించాలని ఆయన సూచించారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే చంద్రబాబుతోనే సాధ్యమరు. నీటి పొదుపులో నియోజకవర్గం రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ రవికుమార్‌రెడ్డి, వెంకటాచలం జడ్పీటిసి సభ్యులు ఎం వెంకటశేషయ్య, మండల టిడిపి అధ్యక్షుడు నాగేంద్రప్రసాద్, జిల్లా ఎంపిటిసిల సంఘం అధ్యక్షుడు చాట్లా వెంకటసుబ్బయ్య, మండల ప్రత్యేక అధికారి కమలకుమారి, తహశీల్దార్ సుధాకర్, ఎంపిడివో సుగుణమ్మ, పలువురు మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.