శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ఏ పంట సాగు చేసినా ఇంతేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూరు, ఏప్రిల్ 28: ప్రజా బాహుళ్యంలో ప్రతి వస్తుసేవకు విక్రయ ధర నిర్ణయం ఉత్పత్తిదారుడి అభీష్టం మేరకే ఉండటం పరిపాటి. రైతుల పంట విషయంలో మాత్రం కొనుగోలుదారుడు చెప్పిన ధరకు అమ్ముకోవడం దేశ దౌర్భాగ్యానికి నిదర్శనం. జాతిని బతికించే అన్నదాతలైన రైతన్నలు తాము ఆరుగాలం శ్రమించి సాగుచేసిన పంట చేతికొచ్చాక కొనుగోలుదారుడి ఇష్టానుసారంగా మసలుకోక తప్పడంలేదు. ఏ పంట సాగు చేసిన రైతులకైనా ఇదే పరిస్థితి నెలకొంటోంది. వ్యవసాయోత్పత్తులకు పెట్టుబడి వ్యయం ఆద్యంతం పరిగణనలోకి తీసుకుంటూ అసలుకు ఏభై శాతం అదనంగా అందజేస్తేనే కర్షకుల మనుగడకు బాటలు పడతాయంటూ జస్టిస్ స్వామినాధన్ వంటి ఉన్నత స్థాయి కమిషన్లు సిఫారసు చేసినా క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం ఆమడదూరంలోనే ఉంటోంది. ప్రభుత్వాలు పేరుకు ‘కనీస గిట్టుబాటు ధర’గా పేర్కొని అంతటితో వదిలేయడం మినహాయిస్తే, రైతులు ఆదాయబాటలోకి చేరుకునేలా సమర్ధవంతమైన చర్యలు తీసుకోవడం అంతంత మాత్రమే. వరుణుడు అనుకూలించాడు... ప్రకృతి కరుణించింది.. పంటలు బాగానే పండాయని ఎంతో ఆశతో సేద్యం చేసిన రైతుల పాలిట గిట్టుబాటు ధర సమస్యాత్మకంగా మారింది. వరి సాగు చేసిన రైతులు దళారులకు అమ్ముకోవాల్సిన అవసరం లేదు.. మీకోసం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామంటూ అధికారులు చెపుతున్నారు. ఆ కేంద్రాల కష్టనష్టాల సంగతి అటుంచితే, బహిరంగ మార్కెట్‌లో ఎక్కడైనా పొగాకు పంటను అమ్ముకుంటే నేరంగా పరిగణిస్తారు. ప్రభుత్వం తరపున వేలం కేంద్రాలను ఏర్పాటు చేసి అక్కడ మాత్రమే రైతులు సాగు చేసిన పొగాకు విక్రయించుకునేలా కఠినమైన చట్టం రూపొందించి తగిన ఏర్పాట్లు చేస్తుంటారు. ప్రభుత్వ అధికార్ల పర్యవేక్షణలో కొనసాగే ఈ వేలం కేంద్రాల ద్వారా ఏమైనా పొగాకు రైతులకు ఆశాజనకమైనా పరిస్థితులు ఏర్పడుతున్నాయా అంటే అదీ ఎండమావే. ప్రస్తుత సంవత్సరంలో పొగాకు వేలం ప్రక్రియ ఆరంభించి ఇప్పటికే 65 రోజులు పూరె్తైంది. రోజురోజుకు లోగ్రేడ్ పొగాకు ధరలు తగ్గించేస్తుండటంతో రైతులు లబోదిబోమంటున్నారు. వేలం ఆరంభించిన గడియల్లో గరిష్ట ధర 146 రూపాయలు, కనిష్టం 135 రూపాయల వరకు పలికింది. మేలు రకం పొగాకు ఉత్పత్తికి సంబంధించి గరిష్ట ధర కొంత స్థిరంగానే ఉంటున్నా, కనిష్టం మాత్రం ఆథఃపాతాళానికి దిగజారిపోతోంది. తొలుత పలికిన 135 రూపాయల్లో ఇప్పుడు సగం ధరకు అంటే అరవై రూపాయల వరకు చేరుకోవడం శోచనీయం. వేలం కేంద్రాల్లో కొనుగోలుదారులు పొగాకు బేళ్లను పరిశీలిస్తూ ఏమాత్రం కుంటిసాకు కనిపించినా లోగ్రేడ్‌గా నిర్ధారిస్తుండటం రైతులను నిలువునా కుంగదీస్తోంది. అలాగని పొగాకు రాశిని విక్రయిస్తే ఈ ఏడాది నష్టపోయే దుస్థితి కూడా లేకపోవడంతో కర్షకులు ఎటూ పాలుపోక అందినకాడకి సొమ్ము చేసుకునేలా అమ్ముకోవడానికే సిద్ధపడుతున్నారు. నెల్లూరు జిల్లాలోని రెండు వేలం కేంద్రాల్లోనూ ఇదే వైనం సాగుతోంది. కలిగిరి పొగాకు వేలం కేంద్రంలో పలు దఫాలుగా ఆందోళనా కార్యక్రమాలు చోటుచేసుకున్నాయి. డిసి పల్లి వేలం కేంద్రంలో మాత్రం రైతులు ఊగిసలాడుతున్నారు. వాస్తవంగా డిసి పల్లిలో ఎప్పుడూ నిరసనలతోనే వేలం ప్రక్రియ ప్రారంభం కావడం ఆనవాయితీ. అయితే ఈదఫా ఇంతవరకు ఆ ఛాయలు కనిపించలేదు. కాగా, రైతుల నుంచి పొగాకును కొనుగోలు చేయడంలో సింహభాగం ఎప్పుడూ ఐటిసిదే. కొనుగోలు చేసే రాశిలో సగానికిపైగానే ఐటిసి చెంత చేరుతుంది. అయితే ఈ ఏడాది ఇంతవరకు ఐటిసి ప్రతినిధులు వేలం ప్రక్రియలో కీలక భాగస్వాములు కాలేదు. ఈ పరిణామం రైతులకు తీరని భంగపాటు. గరిష్ట ధర కిలో తాజాగా,144 రూపాయల వరకు పలుకుతున్నా, ఐటిసి ప్రతినిధులు కేవలం 141 రూపాయలకే ధర స్థిరీకరణ దిశగా పావులు కదుపుతున్నారు. వేలం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు గరిష్ట ధరకు కొనుగోలు చేస్తున్నదంతా చిన్నాచితక కంపెనీలే. వారు కొనుగోలు చేయగలిగినన్ని రోజులు వదిలేయాలనేది ఐటిసి యోచనగా ఉంది. చిన్నాచితక కంపెనీలన్నీ వెళ్లిపోతే అప్పుడు రైతులు తమకే తలొగ్గి 141 రూపాయలకే కిలో పొగాకు ఇస్తారనేది అసలు సంగతి. ఇదిలాఉంటే ఒకప్పుడు సిరులు పండించిన పొగాకు నేడు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, వేలం కేంద్రాల అధికారుల అవకాశవాద వ్యవహార శైలి, కొనుగోలు కంపెనీల అక్రమాల పరంపరతో రైతులు కుదేలవుతున్నారని చెప్పడంలో సందేహం లేదు. ఏటేటా ఉత్పత్తి వ్యయం పెరుగుతుండటం వల్ల అదే స్థాయిలో ధరలు పుంజుకుంటునే పొగాకు రైతుకు మనుగడ. ఇదిలాఉంటే జాతీయంగా, అంతర్జాతీయంగా పలు అంశాలు ప్రభావితం చోటుచేసుకోవడం కూడా పొగాకు సాగుకు ప్రతిబంధకాలుగా మారుతున్నాయి.