శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

నేడే ఎంసెట్ పరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేదాయపాళెం, ఏప్రిల్ 28: ఇంజనీరింగ్, మెడిసిన్, అగ్రికల్చరల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఎంసెట్ పరీక్షను అధికారులు జిల్లాలో శుక్రవారం నిర్వహించనున్నారు. జిల్లావ్యాప్తంగా 22 కేంద్రాలలో ఈ పరీక్ష జరుగుతుంది. ఈ పరీక్షకు 16,290 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండు విభాగాలకు సంబంధించి పరీక్ష జరుగుతుంది. ఇదిలావుండగా పరీక్షల దృష్ట్యా విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు రెండు గంటల ముందు నుంచే అనుమతించడం జరుగుతుందని నగర డిఎస్పీ వెంకటరాముడు తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నగరంలో భారీ వాహనాలను అనుమతించేది లేదన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ఆయన తెలిపారు. నెల్లూరు నగరం, పరిసర ప్రాంతాలలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు రీజనల్ కో ఆర్డినేటర్ వై.రామ్మోహన్‌రావు తెలిపారు.

‘ప్రతి కుటుంబానికి మరుగుదొడ్డి తప్పనిసరి’
కొండాపురం, ఏప్రిల్ 28 : సమాజంలో మహిళల గౌరవం కాపాడాలంటే ప్రతీకుటుంబం తప్పనిసరిగా మరుగుదొడ్డి నిర్మించుకోవాలని మండల ప్రత్యేకాధికారి కె శ్రీనివాస్ అన్నారు. గురువారం మండలంలోని పార్లపల్లి గ్రామంలో ఆత్మగౌరవ సదస్సు నిర్వహించారు. సర్పంచ్ బాసం లక్షమ్మ అధ్యక్షతన సభ నిర్వహించారు. ఈసభలో పాల్గొన్న ప్రత్యేకాధికారి మాట్లాడుతూ ముఖ్యంగా మహిళలు బహిరంగ మలవిసర్జనకు వెళ్ళాలంటే ఎంతో అవమానాన్ని భరిస్తుంటారని అన్నారు. వారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ఇంటిలో మరుగుదొడ్డి నిర్మించుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో ఎంపిడివో ఖాజాబి, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు, ఎంపిటిసి మామిళ్ళపల్లి సౌభాగ్యమ్మ, బాసం మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.