శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

జిల్లాలో కానిస్టేబుళ్ల బదిలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, ఏప్రిల్ 22: జిల్లా వ్యాప్తంగా పోలీస్ శాఖలో కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు, ఎఎస్సైల బదిలీ ప్రక్రియను జిల్లా ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ ఆదివారం ప్రారంభించారు. స్థానిక పోలీస్ కవాతు మైదానంలోని ఉమేష్ చంద్ర సమావేశ మందిరంలో జిల్లా పోలీస్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎటువంటి పైరవీలకు ఆస్కారం లేకుండా అందరికీ ఆమోదయోగ్యంగా ఈ ప్రక్రియను జిల్లా ఎస్పీ చేపట్టడం విశేషం. ఆదివారం 389 మంది కానిస్టేబుళ్లను ఎస్పీ బదిలీ చేశారు. ఇందులో ఆరోగ్య సమస్యలపై 8 మందికి, మరో 11 మంది కానిస్టేబుళ్లకు భార్యాభర్తల అంశాన్ని తీసుకొని బదిలీ చేశారు. ఎటువంటి అనుమానాలకు తావులేకుండా పాదర్శకంగా ఉండేలా ఒక కమిటీ ఏర్పాటు చేసి ఈ బదిలీ ప్రక్రియను ఎస్పీ కొనసాగించారు. సోమవారం హెడ్ కానిస్టేబుళ్లు, ఎఎస్సైల బదిలీలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో ఎఎస్పీ బి శరత్‌బాబు, డీఎస్పీలు, జిల్లా పోలీస్ కార్యాలయ సిబ్బంది, పోలీస్ అధికారుల సంఘ అధ్యక్షుడు మద్దిపాటి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయండి
* అధికారులకు మంత్రి సోమిరెడ్డి ఆదేశం
వేదాయపాళెం, ఏప్రిల్ 22 : జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆదేశించారు. ఆదివారం నగరంలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో జాయింట్ కలెక్టర్ వెట్రిసెల్వి, సివిల్ సప్లై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైస్‌మిల్లర్ల నుంచి బ్యాంకు గ్యారెంటీలు తీసుకోడానికి త్వరితగతిన చర్యలు చేపట్టాలన్నారు. రైతులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రత్యేకంగా నెల్లూరు జిల్లా కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు రైతులు సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ వెట్రిసెల్వి, సివిల్ సప్లై అధికారులు తదితరులు పాల్గొన్నారు.