శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ఫలితాన్నిస్తున్న భద్రతా చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, ఏప్రిల్ 22: రహదారి ప్రమాదాలను తగ్గించేందుకు జిల్లా రహదారి భద్రతా మండలి తరపున అధికారులు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. సుమారు 165 కిలోమీటర్ల మేర 16వ నెంబరు జాతీయ రహదారితో పాటు ముంబాయి, బెంగళూరు రహదారులు, ఇతర ప్రధానమైన రాష్ట్ర రహదారులు కలిగిన నెల్లూరు జిల్లాలో గతంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరగని రోజంటూ లేదంటే అతిశయోక్తి కాదు. కానీ ఇటీవలి కాలంలో ఈ రహదారి రోడ్డు ప్రమాదాల సంఖ్య గత ఏడాదితో పోల్చుకుంటే గణనీయంగా తగ్గిందనే చెప్పాలి. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఎస్పీ, రవాణా ఉప కమిషనర్ తదితరులు ఉన్న జిల్లా రహదారి భద్రతా మండలి తీసుకుంటున్న పలు నివారణ చర్యలు జిల్లాలో రోడ్డు ప్రమాదాల తీవ్రతను తగ్గించాయనే చెప్పాలి. ప్రస్తుతం జిల్లాలో 5,33,313 వివిధ రకాల వాహనాలు రోడ్లపై తిరుగుతున్నాయి. ఇవి కాక అదనంగా ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి ఎన్నో వేల వాహనాలు నెల్లూరు రహదారులపై నిత్యం ప్రయాణిస్తుంటాయి. జిల్లాలో జరుగుతున్న ప్రమాదాలను పరిశీలిస్తే అత్యధికంగా 33.8 శాతం ద్విచక్ర వాహన ప్రమాదాలే ఉన్నాయి. లారీలు 21 శాతం, కార్లు 23.6, బస్సులు 13.8 శాతంగా నమోదవుతున్నాయి. ఈ ప్రమాదాల్లోనూ 98 శాతం మానవ తప్పిదాలు కాగా కేవలం రెండు శాతం మాత్రమే యాంత్రిక సంబంధిత, వాతావరణ పరిస్థితుల వల్ల జరుగుతుండటం గమనార్హం. మానవ తప్పిదాల వల్లనే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుండటంతో ఆ దిశగా నివారణ చర్యలకు జిల్లా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ప్రతి నెలా మూడవ మంగళవారం జిల్లా రహదారి భద్రతా మండలి సమావేశం నిర్వహిస్తూ తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి, అమలు చేస్తున్నారు. చర్యల్లో భాగంగా ఇంజనీరింగ్ విద్యార్థుల సహకారంతో జాతీయ రహదారిపై భద్రతా ఆడిట్‌ను పోలీస్ అధికారులు, రవాణా అధికారులు పూర్తిచేసి తగు సూచనలను భద్రతా మండలికి అందచేశారు. ఎల్‌ఎల్‌ఆర్ మేళాలు నిర్వహించి 8వేల మందికి పైగా ఆటోడ్రైవర్లకు, 12వేల మందికి పైగా విద్యార్థులకు లైసెన్స్‌లను రవాణాశాఖ అధికారులు గత కొంతకాలంగా అందచేశారు. రవాణా, పోలీసు అధికారులతో కలిసి ప్రత్యేక తనిఖీ బృందాలు ఏర్పాటు చేసి జిల్లా అంతటా విస్తృతంగా తనిఖీలు నిర్వహించి రహదారి భద్రతా నియమాలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటుంటున్నారు. దీంతో పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది.
నేటి నుంచి రహదారి భద్రతా వారోత్సవాలు
సోమవారం నుంచి 29వ తేదీ వరకు రహదారి భద్రతా వారోత్సవాలను రవాణా అధికారులు నిర్వహిస్తున్నారు. సోమవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించే కార్యక్రమంలో జిల్లా మంత్రులు పొంగూరు నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఈ వారోత్సవాలను ప్రారంభించనున్నట్లు డీటీసీ శివరాంప్రసాద్ తెలిపారు. వారోత్సవాల్లో భాగంగా పాఠశాల, కళాశాల విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు. హెల్మెట్ ధరించడం, సీటు బెల్టు వాడటం, మద్యం సేవించి వాహనాలు నడపకుండా ఉండటం వంటి అంశాలపై వారిలో చైతన్యం తీసుకువచ్చే చర్యలకు శ్రీకారం చుడుతున్నారు. వారోత్సవాల్లో భాగంగా డ్రైవర్లకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి బీపీ, షుగర్, కంటి పరీక్షలు ఉచితంగా నిర్వహించబోతున్నట్లు అధికారులు తెలిపారు. మరిన్ని పకడ్బందీ చర్యలు తీసుకోవడం ద్వారా జిల్లాను రహదారి ప్రమాద రహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేస్తున్నామని డీటీసీ శివరాంప్రసాద్ తెలిపారు.
-------------

కులసంఘాలు పేదలను ఆదుకోవాలి
* కాపు రిజర్వేషన్ల విషయంలో మాట నిలబెట్టుకున్న సీఎం * బలిజ ఉద్యోగుల సేవాసమితి సమావేశంలో మంత్రి నారాయణ
నెల్లూరుటౌన్, ఏప్రిల్ 22 : ప్రతి కులానికి కులసంఘం ఉండటం ఎంతో అవసరమని, కుల సంఘాలు ఉంటేనే ఆ కులాలు ఐకమత్యంగా ఉండి అభివృద్ధితో పాటు తమ హక్కులు సాధించుకోగలుగుతాయని రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి డాక్టర్ నారాయణ పేర్కొన్నారు. ఆదివారం మధ్యాహ్నం నగరంలోని పరమేశ్వరి కల్యాణ మండపంలో బలిజ ఉద్యోగుల అభ్యుదయ సేవాసమితి మూడో వార్షికోత్సవ సర్వసభ్య సమావేశాన్ని మంత్రి నారాయణ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సంఘ జిల్లా అధ్యక్షులు అనిల్‌కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రి నారాయణ మాట్లాడుతూ జిల్లాలో బలిజ కులస్థులంతా ఐకమత్యంగా ఉండి మూడో వార్షికోత్సవాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. కుల సంఘాలు తప్పనిసరిగా తమ కులంలో ఉన్న అత్యంత వెనుకబడిన వారిని గుర్తించి వారికి అండగా ఉండి వారు కూడా ఎంతోకొంత అభివృద్ధి సాధించేలా వారికి చేయూతనివ్వాలని అప్పుడే అన్ని కులసంఘాల ఏర్పాటు సార్థకత అవుతుందన్నారు. కేవలం రాజకీయ, వ్యక్తిగత స్వార్థాలతో కుల సంఘాలు ఏర్పాటు చేస్తే అవి అంతే వేగంగా విఫలమవుతాయని హెచ్చరించారు. కాపులకు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక కాపుకార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి భారీ ఎత్తున నిధులు కేటాయించిన విషయాన్ని కాపు సమాజం గుర్తుంచుకోవాలన్నారు. కాపుల రిజర్వేషన్ విషయంలో కూడా ముఖ్యమంత్రి మాటకు కట్టుబడ్డారని, అందుకే కాపుల రిజర్వేషన్లపై నియమించిన జస్టిస్ మంజునాధన్ కమిటీ వ్యతిరేకించినప్పటికీ, కాపులపై ఉన్న ప్రత్యేక అభిమానంతో కమిటీలోని మెజార్టీ సభ్యుల ఆమోదంతో కాపు రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపినట్లు వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు రాష్ట్రప్రభుత్వాన్ని మోసం చేసిందని, ఐతే కాపు రిజర్వేషన్లు సాధించేవరకు తమ ప్రభుత్వం కేంద్రం ఒత్తిడి తెస్తూనే ఉందన్నారు. తనపై అవినీతి ఆరోపణలు చేసేవారికి ఒకటే సమాధానమని తనకు డబ్బు సంపాదన అవసరమనుకుంటే రాజకీయాలు అక్కర్లేదని, ఏసీ రూముల్లో కూర్చొని తాను తన విద్యాసంస్థల ద్వారా భారీగా డబ్బు సంపాదించుకోగలనని ఈ విషయాన్ని తనను విమర్శించే వారు గుర్తుంచుకుంటే మంచిదన్నారు. అనంతరం బలిజ సంఘం ఆధ్వర్యంలో మంత్రిని గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు చక్రధర్, నుడా వైస్ చైర్మన్ ఢిల్లీరావు, ఓఎస్‌డి క్రైం విఠలేశ్వరరావు, ప్రొఫెసర్ రవిప్రసాదరావు, డాక్టర్ శశిధర్, సంఘ కార్యవర్గసభ్యులు తదితరులు పాల్గొన్నారు.