శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ముద్రా యోజన ద్వారా 12 కోట్ల మందికి లబ్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోట, ఏప్రిల్ 28: పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముద్రా యోజన పథకం ద్వారా 12 కోట్ల మందికి లబ్ధి చేకూర్చాలన్నదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యమని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పి మాణిక్యాలరావు అన్నారు. కోటలోని రెడ్డి కల్యాణ మండపంలో గురువారం జరిగిన బిజెపి గూడూరు నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో పథకాలను ప్రవేశపెట్టడమే కాకుండా వాటిలో ప్రజలను కూడా భాగస్వాములను చేసిందన్నారు. దేశ చరిత్రలోనే పేదలు, ఎస్సీ, ఎస్టీలు, రైతులు కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన ఘనత బిజెపికే దక్కుతుందన్నారు. జీరో బ్యాలెన్స్‌తో బ్యాంక్ ఖాతాలను అనేక మందిచేత ప్రారంభింప చేశామని, ఈ ఖాతాల్లో 6 నెలల పాటు లావాదేవీలు జరిపిన ఖాతాదారుడికి బ్యాంకు ప్రమేయం లేకుండా 5 వేల రూపాయలను రుణంగా ఇవ్వడం జరుగుతుందన్నారు. దేవాలయాల భూములను ఆక్రమించడం చట్టరీత్యా నేరమన్నారు. ఆ భూములకు ఆక్రమణదారుల చెర నుంచి విడిపించడమే కాకుండా బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఆలయ కమిటీల నియామకాలను 80 శాతం పూర్తిచేశామని, మిగిలిన వాటిని త్వరలోనే పూర్తిచేస్తామన్నారు. దేవాలయాలకు సంబంధించిన పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లో పొందపర్చడం జరుగుతుందన్నారు. అనంతరం బిజెపి రాష్ట్ర కార్యదర్శి కె కోటేశ్వరరావు మాట్లాడుతూ 2019 ఎన్నికల నాటికి బిజెపిని రాజకీయ శక్తిగా మార్చేందుకు తమ ప్రభుత్వం చేపడుతున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, పథకాల గురించి వివరించాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. కరవును జయించాలన్న ఉద్దేశ్యంతోనే తమ ప్రభుత్వం నీరు - చెట్టు, ఇంకుడుగుంతల పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. రైతుల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి వారికి పెద్దపీట వేసిందన్నారు. శిథిలావస్థలో అనేక ఆలయాలు ఉన్నాయని వాటి పునరుద్ధరణకు సహకరించాలని మంత్రిని కోరారు.
మంత్రికి ఘన సన్మానం
రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పి మాణిక్యాలరావును గురువారం కోటలో బిజెపి నాయకులు ఘనంగా సన్మానించారు. బిజెపి రాష్ట్ర కార్యదర్శి కె కోటేశ్వరరావు స్వగ్రామంలో జరిగిన బిజెపి కార్యకర్తల సమావేశానికి తొలిసారిగా మంత్రి రావడంతో ఆ పార్టీ నాయకులు మంత్రికి ఘనస్వాగతం పలికారు. దీంతో ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులు మంత్రిని శాలువాలు, పూలమాలలతో ముంచెత్తారు.
ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఎస్ సురేష్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర యువమోర్చా ప్రధాకార్యదర్శి దయాకర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు పేర్నాటి రంగారెడ్డి, రంగినేని క్రిష్ణయ్య, మిడతల రమేష్, పెల్లేటి గోపాల్‌రెడ్డి, కె ఆనంద్‌బాబు, ఆంజనేయులురెడ్డి, సత్యనారాయణ, పార్టీ జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్షులు సురేంద్రరెడ్డి, దువ్వూరు గిరిధర్‌రెడ్డి, పనబాక కోటేశ్వరరావు, నియోజకవర్గ ఇన్‌చార్జ్ పాదర్తి కోటారెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు సత్యన అంబ్రీష్, పేర్నాటి ఆనంద్‌రెడ్డి, డాక్టర్ సారంగం రమేష్‌బాబు, చేవూరు శ్రీనివాసులు, వెంకయ్య, వాసు, మస్తానమ్మ, వెంకటేశ్వర్లుతో పాటు కోట, వాకాడు, చిట్టమూరు, చిల్లకూరు, గూడూరు మండలాల బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.