శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

బోయలను గిరిజన కులంలో చేర్చడం తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోవూరు, మే 21: బోయలను గిరిజన కులంలో చేర్చేలా ముఖ్యమంత్రి తీర్మానం చేయడం గిరిజనులను మోసం చేయడమేనని దళిత గిరిజన జే ఏసీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు పాలకీర్తి రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక తహసిల్దారు కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన దళిత గిరిజన జే ఏసీ అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. బోయలను గిరిజనులుగా చేర్చడం వెనుక చంద్రబాబు రాజకీయ కుట్ర దాగి ఉందన్నారు. రాష్ట్రంలోని ఏడు గిరిజన అత్యధిక నియోజకవర్గాలలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు ప్రతిపక్ష సభ్యులు గెలుపొందడంతో గిరిజనులంతా ప్రతిపక్ష పార్టీ వైపు ఉన్నారన్న అక్కసుతో ముఖ్యమంత్రి చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు తెరతీశాడన్నారు. హైకోర్టు న్యాయవాది ఎస్టీ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శివరామకృష్ణ మాట్లాడుతూ గిరిజనులు రాజకీయంగా ఎదిగేందుకు త్వరలో ఆదివాసి సమాజ్ పార్టీ స్థాపిస్తున్నామని తద్వారా వారి రాజకీయ అభివృద్ధికి ప్రోత్సహిస్తామన్నారు. రానున్న ఎన్నికల్లో ఆదివాసి సమాజ్ పార్టీ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందని తెలిపారు. తూర్పు గోదావరి జిల్లాలో పడవ బోల్తాపడి ఆదివాసీల బిడ్డలు చనిపోతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎటువంటి ఎక్స్‌గ్రేషియా లభించలేదని అధికారుల నిర్లక్ష్యానికి బలైన ప్రతి ఆదివాసి బిడ్డకు రూ.25లక్షలు నష్టపరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. అనంతరం పట్టణంలోని దళితవాడ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అటునుంచి పట్టణంలో ప్రధాన వీధుల్లో దళిత హక్కులను కాపాడాలని నినాదాలు చేస్తూ ప్రదర్శన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ జేఏసీ అధ్యక్షుడు తుమ్మా మస్తాన్, ఉపాధ్యక్షుడు సముద్రాల దావీదు, జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సీహెచ్ మాధవి, ప్రధాన కార్యదర్శి కాకి సుజాతమ్మ, జిల్లా మహిళా అధ్యక్షుడు అనిత, జిల్లా అధ్యక్షుడు కట్టా అశోక్, ఎలింగ్‌పాల్, చెన్నకేశవులు, హేమంత్‌బాబు, సన్ని తదితరులు పాల్గొన్నారు.