శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

నిత్య పెళ్లికొడుకు ఇంటి ముందు నాల్గొ భార్య ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బుచ్చిరెడ్డిపాళెం, మే 21: పెళ్లిపేరుతో ముగ్గురు మహిళలను మోసగించి నాలుగో పెళ్లికి సిద్ధమైన నిత్య పెళ్లికొడుకు బండారం బట్టబయలైన సంఘటన బుచ్చిలో సోమవారం చోటు చేసుకుంది. బాధితురాలి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. బుచ్చిరెడ్డిపాళెంకు చెందిన కమతం ప్రసాద్‌రెడ్డి మెగా సిటీల్లో ఉద్యోగం చేస్తున్నానంటూ మహిళలకు వలవేస్తుంటాడని తెలుస్తోంది. వివాహం పేరుతో మహిళలను మోసగించి వారి ఇచ్చిన కట్న, కానుకలతో జల్సాలు చేస్తుంటాడని అతని మొదటి భార్య రాధ తెలిపింది. సోమవారం ప్రసాద్‌రెడ్డి నాల్గవ వివాహానికి సిద్ధం అవుతున్న సమయంలో భర్త ఇంటి ఎదుట బైఠాయించి నిరసన తెలిపింది. ఆమె తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కృష్ణాజిల్లా బద్రిరాజుపాళెంకు చెందిన రాధతో బుచ్చి శాంతినగర్‌కు చెందిన ప్రసాద్‌రెడ్డితో డిసెంబరు 4, 2016లో వివాహం జరిగింది. పెళ్లికి రూ. 11 లక్షల కట్నం, 15 సవర్ల బంగారు నగలతో పాటు ఆడపడుచు కట్నం, ఇతర అత్తింటి లాంఛనాలతో కాపురానికి వచ్చినట్లు బాధితురాలు తెలిపింది. మొదటి 5 నెలలు కాపురం సజావుగా సాగినప్పటికీ తర్వాత ఉద్యోగం పేరుతో ఇంటిపట్టున ఉండేవాడు కాదని రాధ పేర్కొంది. ఆ సమయంలో ప్రసాద్‌రెడ్డి తండ్రి శ్రీనివాసులురెడ్డి తన పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడని వాపోయింది. అంతే కాకుండా అత్త శ్రీనివాసమ్మ, ఆడపడుచు శిరీషలు సైతం వేధింపులకు గురి చేసేవారని పేర్కొంది. దీంతో విజయవాడలోని తన పుట్టింటికి వెళ్లి భర్త, మామ, అత్త, ఆడబిడ్డలపై వేధింపుల కేసు పెట్టానని తెలిపింది. ఇంతలో తనకు నిర్ఘాంతపోయే వాస్తవాలు తెలిశాయని బాధితురాలు రాధ పేర్కొంది. తన భర్తకు గతంలోనే రెండు వివాహాలు జరిగాయని తెలిసి అవాక్కయ్యానంది. 2016 మేలో సుప్రియ అనే యువతితో తన భర్తకు పెళ్లయిందని, భర్త ప్రసాద్‌రెడ్డి వేధింపులు తాళలేక ఆమె వెళ్లిపోయిందని తెలిపింది. తర్వాత బుచ్చిరెడ్డిపాళెం మండలంలోని రేబాలకు చెందిన నిరోషా అనే యువతితో వివాహం నిశ్చయం అవగా ప్రసాద్‌రెడ్డికి ముందే పెళ్లయిన విషయం తెలిసి ఆ వివాహం ఆగిపోయిందన్నారు. అనంతరం బెంగుళూరులో ఉద్యోగం చేస్తున్నానని నమ్మించి తనను 2016 డిసెంబరు 4న తిరుమలలో వివాహం చేసుకున్నాడని వివరించింది. భర్త, అత్త, మామల వేధింపులు తాళలేక పుట్టింట్లో ఉన్న తనకు సోమవారం బుచ్చిలో నాల్గవ పెళ్లికి సిద్ధం అవుతున్నట్లు తెలిసి వచ్చానని తెలిపింది. వచ్చి చూడగా పెళ్లి బట్టల్లో ఉన్న భర్త ప్రసాద్‌రెడ్డిని చూచి నివ్వెరపోయానంది. తనకు జరిగిన అన్యాయం ఇంకే మహిళకూ జరగకూడదని భర్త ఇంటి ఎదుట పోరాటానికి దిగానంది. కానీ తనను ఇంటి ముందు నుంచి గెంటేశారని వాపోయింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు పేర్కొంది.
బాధితురాలు రాధ ఫిర్యాదుపై ఎస్ ఐ ప్రసాద్‌రెడ్డిని వివరణ కోరగా జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి వచ్చిన ఆదేశాల మేరకు విచారణ చేపట్టామన్నారు. బాధితురాలి నుండి ఫిర్యాదు తీసుకుని విచారిస్తున్నట్టు ఆయన తెలిపారు. అపరిచిత వ్యక్తులతో వివాహ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఎస్‌ఐ తెలిపారు.

అర్జీలు స్వీకరించిన జిల్లా కలెక్టర్
వేదాయపాళెం, మే 21: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన గ్రీవెన్స్‌లో జిల్లా కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యలపై వచ్చిన బాధితులు కలెక్టర్ ముందు తమ గోడు వినిపించుకున్నారు. బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన కలెక్టర్ సంబంధిత అధికారులను పిలిచి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలుశాఖల అధికారులు పాల్గొన్నారు.