శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

శ్రీసిటీని సందర్శించిన జపాన్ రాయబారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తడ, మే 26: భారత్‌లోని జపాన్ రాయబారి కెంజుహిరమట్సు శనివారం శ్రీసిటీని సందర్శించారు. శ్రీసిటీ పౌండేషన్ ప్రెసిడెంట్ రమేష్ సుబ్రహ్మణ్యం ఆయనకు సాధర స్వాగతం పలికి పరిశ్రమల విశిష్టతలను, ప్రగతి ప్రయోజనాలను వివరించారు. శ్రీసిటీలో ఇది రెండో పర్యటనగా పేర్కొన్న కెంజు శ్రీసిటీ పారిశ్రామిక అభివృద్ధి ఎంతో ఆకట్టుకుందన్నారు. ప్రధానంగా జపాన్‌కు చెందిన పరిశ్రమలకు ఇక్కడ కల్పించిన వౌలిక వసతుల పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. వ్యాపారానికి అత్యంత అనువైన ప్రాంతం శ్రీసిటీ అని ఆయన అన్నారు. అనంతరం శ్రీసిటీలోని జపనీస్ పరిశ్రమల సీఈవోలు ఆయనతో సమావేశమై చర్చలు జరిపారు. ఈ పర్యటనలో కాన్సులేట్ జనరల్ ప్రతినిధి షిహోబాంబ పాల్గొన్నారు. ఈ పరిశ్రమల ద్వారా 8750కోట్ల పెట్టుబడులు, 8500 మందికి ఉద్యోగాలు లభించాయని ఆయన తెలిపారు.

చెంగాళమ్మ బ్రహ్మోత్సవాలతో
సూళ్లూరుపేటకు పండుగ కళ
సూళ్లూరుపేట, మే 26: మరో ఐదు రోజుల్లో చెంగాళమ్మ పరమేశ్వరిదేవి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపధ్యంలో సూళ్లూరుపేటకు పండుగ కళ వచ్చింది. పట్టణంలో ఎక్కడ చూసినా సందడి వాతావరణం నెలకొంది. ఈసారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ పాలకవర్గం నిర్ణయం తీసుకుంది. స్థానిక హోలిక్రాస్ కూడలి నుంచి ఆలయానికి ఇరువైపులా జాతీయ రహదారి నుంచి పెద్దపెద్ద ఆర్చీలు, విద్యుత్ దీపాలంకరణతో పట్టణం కళకళలాడుతోంది. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను శనివారం ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్ ముప్పాళ్ల వెంకటేశ్వరరెడ్డి, ఈవో ఆళ్ల శ్రీనివాసులురెడ్డి పరిశీలించారు. ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని కాంట్రాక్టర్ నిర్వాహకులకు సూచించారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే వేదిక కూడా ఓం ఆకారంలో వచ్చేలా అద్భుతంగా నిర్మిస్తున్నారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేయనుండడంతో వారికి తాగునీరు తదితర అన్ని వసతులు కల్పించేలా ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఈసారి ప్రత్యేక ఆకర్షణగా ఏనుగులను తీసుకురానున్నారు. ఈ నెల 31న బలిహరణ, సుడిమాను ప్రతిష్ఠతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమై జూన్ 6వ తేదీ పుష్పపల్లకి సేవతో ముగియనున్నాయి. 31న బలిహరణ, సుళ్లు ఉత్సవం, జూన్ 1వ తేదీ సుళ్లు ఉత్సవం, అశ్వవాహనం, 2న సుళ్లు ఉత్సవం, మహిషాసురమర్థిని, 3న సుళ్లు ఉత్సవం, నందిసేవ, 4న తెప్పోత్సవం, 5న శయన సేవ, 6న పుష్పపల్లకి సేవతో బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగియనున్నాయి. ఈ వారం రోజులపాటు సినీ సంగీత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. ఈసారి ప్రత్యేకంగా హెలికాప్టర్ విహార సౌకర్యం కూడా కల్పించారు.