శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

నాలుగేళ్లలో చంద్రబాబు ఏం చేశారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేదాయపాళెం, జూన్ 17: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాలుగేళ్లలో ప్రజలకు చేసిందేమి లేదని వైసీపీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. నగరంలోని మాగుంట లేఅవుట్‌లోని వైసీపీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాలుగేళ్ల పరిపాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో విఫలమై, ప్రచారం చేసుకోవటానికి ఏమీలేక ప్రత్యుర్థులపై, ప్రతిపక్షాలపై దుష్ప్రచారం ప్రారంభించాడన్నారు. ప్రజా సమస్యలపై నాలుగేళ్లుగా వైఎస్ జగన్ చేస్తున్న పోరాటంతో చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందన్నారు. దీంతో చంద్రబాబునాయుడు ఏదో రకంగా ప్రతిపక్షంపై దుష్ప్రచారం చేయడం, లేనిపోని అభాండాలు వేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నిద్ర లేచినప్పటి నుంచి బీజేపీతో వైసీపీ జత కట్టిందంటూ జపం చేస్తున్నాడని ఎద్దేవా చేస్తూ, నాలుగేళ్లుగా బీజేపీతో కలిసి ఉంది చంద్రబాబా.. జగనా అని ప్రశ్నించారు. వైసీపీపై బురద చల్లే ప్రయత్నాలు ఎంతచేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. చంద్రబాబుకు మరో దారిలేక ప్రతి చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో చూపించటం సరికాదన్నారు. పీఏసీ చైర్మన్ ఢిల్లీ వెడితే దానిని వివాదాంగా మార్చటం సిగ్గుచేటన్నారు. రాజేంద్రనాథ్‌రెడ్డి ఢిల్లీ వెళ్లి మొదట అమిత్‌షాను కలిశారని ఆరోపించారని, కానీ అమిత్‌షాను కలిసిన ఆధారాలు లేక రామ్‌మాధవ్‌ను కలిసారని ఆరోపిస్తున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడే మాటల్లో ఎంతవరకు వాస్తవం ఉందనేది వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. రాజకీయ పరిజ్ఞానం లేని వ్యక్తి, తెలుగు కూడా సరిగా మాట్లాడలేని పిల్లవాడు లోకేష్ ట్వీట్ చేస్తే దానికి సంబంధించి ట్యాంపరింగ్ చేసే స్థితికి ముఖ్యమంత్రి దిగజారడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబునాయుడు ఎంత అభద్రతా భావంతో ఉన్నారో ఈ ఒక్క విషయాన్ని గమనిస్తే అర్థమవుతుందన్నారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే చంద్రబాబు తీరును రాష్ట్రప్రజలు గమనిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఆర్థికమంత్రి యనమలకు దమ్ము, ధైర్యం ఉంటే వారు చేసిన ఆరోపణలు నిరూపించాలని డిమాండ్ చేశారు. ఆరోపణలను నిరూపిస్తే రాజేంద్రనాథ్‌రెడ్డి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని, నిరూపించకపోతే మీరు రాజీనామాలకు సిద్ధంగా ఉన్నారా అంటూ సవాల్ విసిరారు. చంద్రబాబు అవినీతిని ప్రశ్నిస్తే బీజేపీతో సంబంధాలంటూ టీడీపీ నాయకులుల వ్యాఖ్యలు చేయటం సిగ్గుచేటని అన్నారు. ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరిస్తున్న ఒక నాయకుడి భార్య కేంద్రంలో కీలక పదవిలో ఉండటాన్ని ప్రస్తావిస్తూ దీనిని ఏ బంధమంటారో చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. ఓటుకు నోటు కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు భయపడి హైదరాబాద్‌ను వదిలి అమరావతికి పరుగెత్తుకు వచ్చిన చంద్రబాబునాయుడు తమ అధినేత జగన్‌పై విమర్శలు చేయటం ఏమిటని ప్రశ్నించారు. వ్యక్తిగత, స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టిన వ్యక్తిగా చంద్రబాబును అభివర్ణిచారు. ప్రజలకు ఇచ్చిన మాటకోసం అధికారంలో ఉన్న సోనియాగాంధీని ఎదిరించి ముందుకు వెళ్లిన వ్యక్తి జగన్ అని అన్నారు. జగన్ గురించి మాట్లాడే అర్హత, స్థాయి చంద్రబాబుకు లేదన్నారు. ఎంతమంది ఎన్ని సర్వేలు చేసినా వచ్చే ఎన్నికల్లో ఆంధ్రరాష్ట్ర చిత్రపటం నుంచి చంద్రబాబు చిత్రాన్ని ప్రజలు తొలగించటం ఖాయమన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు బుద్ధి తెచ్చుకుని వైసీపీపై బురదచల్లే ప్రయత్నాలు మానుకోవాలని, రాష్ట్ర ప్రజయోనాల కోసం పాటుపడాలని హితవు పలికారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీలు వెంకటశేషయ్య, చిరంజీవిగౌడ్, కడివేటి చంద్రశేఖర్‌రెడ్డి, దాసరి భాస్కర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.