శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

పెరిగిన ఎరువుల ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూరు, జూన్ 17: ప్రభుత్వాలు మారినా అన్నదాత ఆర్థిక ప్రగతిలో మార్పు రావడంలేదు. రైతు లేనిదే రాజ్యం లేదని ఉపన్యాసాలు చేప్పే పాలకులు రైతుల అభివృద్ధిని మరచి ఎడతెగని భారాలు మోపుతున్నాయి. ఒకవైపు పంట పెట్టుబడులకు వెతుకులాడుతుంటే సీజన్ ప్రారంభం కాకుండానే ఎరువుల ధరలు పెంచి అదనపు భారం మోపడంతో అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా తయారయింది. బస్తాకు రూ.120 నుండి 135 రూపాయల వరకు ఎరువుల ధరలు అమాంతంగా పెంచి రైతుల నడ్డి విరిచారు. వ్యవసాయం భారంగా మారిన పరిస్థితుల్లో ప్రభుత్వం ఎరువుల ధరలు పెంచడం అనాలోచిత చర్యని రైతుసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పెరిగిన వ్యవసాయ ఖర్చులకు ఎరువుల ధరలు తోడవటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం ధరల నియంత్రణకు ముందుకు రావటంలేదు. నాలుగేళ్లుగా వర్షాలు లేక కరువుకాటకాలతో అల్లాడుతున్న ఆత్మకూరు నియోజకవర్గ రైతులు ఎరువుల ధరలు పెంచడం సరైన నిర్ణయం కాదంటున్నారు. పొలం సొంతదారుల పరిస్థితే ఇలా ఉంటే ఇక కౌలురైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంటుందని రైతు సంఘాలు అంటున్నాయి. పెరిగిన విత్తనాలు, ఎరువుల ధరలు, కూలీల ఖర్చులకు తోడు ప్రకృతి కరుణించక ఆశించిన స్థాయిలో దిగుబడులు రాక అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎరువుల ధరల పెంపకం విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలని వ్యవసాయ సంఘాలు సూచిస్తున్నాయి.

రైల్వేస్టేషన్‌లో కూలిన వరండా స్లాబ్
సూళ్లూరుపేట, జూన్ 17: సూళ్లూరుపేట రైల్వేస్టేషన్‌లో ఆదివారం రాత్రి వరండా (పోర్టికో) స్లాబ్ కూలిపోయింది. ఆ సమయంలో ప్రయాణికులు ఎవరు అక్కడ లేకపోవటంతో పెద్ద ప్రమాదం తప్పింది. రైల్వేస్టేషన్ ముందు స్లాబ్‌తో కలసి ముందుకు పెంచిన వరండా స్లాబ్ ఒక్కసారిగా నేలకొరగింది. సమీపంలో ఉన్న వారు ఏమి జరిగిందోనని భయంతో పరుగులు తీశారు. రైల్వే అధికారులు కూలిన వరండా స్లాబ్‌ను పరిశీలించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. కూలిన స్లాబ్‌ను తొలిగించే పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు. రాత్రి సమయంలో స్లాబ్ కూలటం, ప్రయాణికులు లేకపోవటంతో పెనుప్రమాదం తప్పింది. అదే పగటిపూట ప్రయాణికులతో కిక్కిరిసి ఉండే ఈ స్టేషన్‌లో ఇటువంటి సంఘటనలు జరిగేతే ప్రమాద తీవ్రత ఎలా ఉండేదని అటు అధికారులు, ఇటు ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేసారు.