శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

అలసత్వం ప్రదర్శించిన ఏఇలపై చర్యలు తీసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేదాయపాళెం, జూన్ 21: తొంభై రోజుల పనిదినాలు కల్పించడంలో అలసత్వం ప్రదర్శించిన 14 మండలాల గృహనిర్మాణశాఖ ఏఇలపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని గృహనిర్మాణ శాఖ పీడీని జిల్లా కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు ఆదేశించారు. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో హౌసింగ్, ఎంజీఎస్‌ఆర్‌ఇజీఎస్ కన్వర్‌జన్సీపై జిల్లాలోని 46 మండలాలు, గృహనిర్మాణ శాఖ ఇఇలు, ఏఇలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంజీఎన్‌ఆర్‌ఇజీఎస్ కన్వర్‌జన్సీ 90 పనిదినాల కల్పన, బ్రిక్ జనరేషన్, ఐహెచ్‌హెచ్‌ఎల్ పురోగతి, పీఎస్‌ఎస్ డేటా తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత మూడు నెలలుగా సమావేశాలు నిర్వహించినప్పటికీ ఎలాంటి పురోగతి సాధించలేదని అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. ఈనెలలో అసలు ప్రగతి సాధించని గూడూరు, చిట్టమూరు, బాలాయపల్లి, తడ, కొడవలూరు, పొదలకూరు, విడవలూరు, డీవీ సత్రం, ఉదయగిరి, దగదర్తి, ఎస్‌ఆర్ పురం, బోగోలు, ఏఎస్‌పేట, మనుబోలు ఏఇలపై చర్యలు తీసుకొని రేపు సాయంత్రానికి ఇ - ఆఫీసు ద్వారా తనకు పంపించాలని హౌసింగ్ పీడీని ఆదేశించారు. ఎన్‌ఆర్‌ఇజీఎస్ చెల్లింపులను ఎంసీసీ లాగిన్‌లో పొందుపరచుటకు కంప్యూటరు ఆపరేటర్లను ఉపయోగించుకోవడం లేదన్నారు. దీనివలన లబ్ధిదారులకు చెల్లింపులు జరగడం లేదన్నారు. లబ్ధిదారులు అందరూ ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన నిరుపేదలని వారికి చెల్లిపులు చేయడంలో హౌసింగ్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఇలు, ఏఇలు, ఎంపీడీఓలతో సమీక్షలు నిర్వహించుకోవడం లేదన్నారు. స్మార్ట్ పల్స్ సర్వే డేటాలో ఎంపిక చేసిన అర్హులైన వారికి పంపిణీ చేయడానికి భూసేకరణలో ప్రభుత్వ భూములు, పట్ట్భాములు వివరాలను సమీక్షించారు. ఈ సమావేశంలో హౌసింగ్ పీడీ ఎస్‌వీఆర్ ప్రసాద్, డ్వామా ఏపీడీ నాసర్‌రెడ్డి, 46మండలాల హౌసింగ్ ఇఇలు, డీఇలు, ఏఇలు పాల్గొన్నారు.