శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

అవినీతిపరుడు మంత్రి సోమిరెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు రూరల్, ఆగస్టు 14: అవినీతికి పాల్పడడంలో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి దిట్ట అని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జిల్లా పరిషత్ సమావేశం వాయిదాపడిన అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడారు. మంత్రి సోమిరెడ్డి, ఆయన కుమారుడు రాజగోపాల్‌రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గాన్ని దోచుకు తింటున్నారని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు. సర్వేపల్లి నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి అక్రమాల గురించి అధికారులను ప్రశ్నిస్తుంటే తన భాగోతం ఎక్కడ బయటపడుతుందనే ఉద్దేశ్యంతో సోమిరెడ్డి ఏవో గొప్పలు చెప్పుకుంటూ అంతా తన ఘనతే అన్నట్లుగా మాట్లాడుతున్నారని అన్నారు. గత సంవత్సరం రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పించకపోగా రైస్‌మిల్లుల యాజమాన్యాలతో కుమ్మక్కై 50 కోట్ల రూపాయలు దిగమింగింది మీరు కాదా అని ఆయన నిలదీశారు. సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు చాలా మంచివారని కాని సోమిరెడ్డిలాంటి నేతపై తాను పోటీపడటం తనకే అసహ్యం వేస్తోందని అన్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న పనుల్లో వాటాల పేరుతో సోమిరెడ్డి దోచుకుంటున్నారని అన్నారు. చేయని పనులను కూడా చేసినట్లుగా చూపి బిల్లులు చేసుకుంటున్నది మీరు కాదా అని నిలదీశారు. సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు నాలుగుసార్లు ఛీకొడితే దొడ్డిదారిన మంత్రి అయినంతమాత్రాన మీరేమైనా గొప్ప లీడరా అని ఆయన ప్రశ్నించారు. మీ అక్రమాల చిట్టా మొత్తాన్ని బయటపెడతానని, విదేశాల్లో ఉన్న మీ ఆస్తులను, మీరు చేస్తున్న అక్రమాలను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే సమస్యే లేదన్నారు. సర్వసభ్య సమావేశంలో సమాధానం చెప్పకుండా పారిపోయిన ఘనుడు సోమిరెడ్డి అని ఆయన ఎద్దేవా చేశారు. సోమిరెడ్డి చేస్తున్న అకృత్యాలు జిల్లా ప్రజలు గమనిస్తున్నారని, తగిన రీతిలో ప్రజలే ఆ పార్టీకి బుద్ధి చెబుతారని ఆయన అన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో టెండర్ల రూపంలో పిలవాల్సిన పనులను సోమిరెడ్డి ఆదేశాల మేరకు చిన్నచిన్న బిట్లుగా మార్చి దోచుకుతింటున్నారని ఆయన విమర్శించారు. రాజవోలుపాడు ఎత్తిపోతల రివర్స్ పంపింగ్ విషయంలో సుమారు 35 లక్షల రూపాయలు అవినీతి జరిగిందని, అది ప్రశ్నిస్తే సోమిరెడ్డి ఎదురు దాడి చేస్తున్నారని అన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పొదలకూరు మండలంలో పంటలు బ్రహ్మాండంగా పండాయని, అది కూడా సోమిరెడ్డి తన ఘనతగా చెప్పుకుంటున్నారని ఆయన విమర్శించారు.