శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

దళితులపై దాడులు అమానుషం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాపూరు, ఆగస్టు 14: కారణాలు ఏమైనా అమాయక దళితులపై అమానుషంగా పోలీసులు దాడులు చేసి వారిని చిత్రహింసలకు గురిచేయడం దారుణమని ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి విమర్శించారు. ఈనెల 1వ తేదీ రాత్రి రాపూరు పోలీసుస్టేషన్‌పై దాడి చేసిన సంఘటనలో కేసుల్లో సంబంధం లేని వారి ఇళ్లపై దాడులు చేసి అక్రమంగా కేసులు నమోదు చేయడంపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు దళితవాడలో ఇంటింటికి తిరిగి దాడి సంఘటనపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం దళితవాడలోని ఓ పాఠశాల ప్రాంగణంలో ఆయన మాట్లాడుతూ వెంటనే అమాయక దళితులపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇటీవల టీడీపీ హయాంలో అధికారులపై కూడా దాడులు ఎక్కువయ్యాయని అన్నారు. అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే కుమారుడు విధుల్లో ఉన్న ఓ ఎక్సైజ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌ను కొట్టారని, ఈ సంఘటనపై ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకుందని ప్రశ్నించారు. అలాగే విధి నిర్వహణలో భాగంగా అక్రమ ఇసుక మాఫీయాను అడ్డుకున్న ఓ మహిళా తహశీల్దార్‌ను బెదిరించి జుట్టు పట్టుకున్న సంఘటనలో ప్రభుత్వం ఏమిచేసిందని నిలదీశారు. సాక్షాత్తు రాష్ట్ర రాజధానిలో ఓ నిజాయితీగల రాష్టస్థ్రాయి ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌పై విజయవాడలోని అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే చొక్కా పట్టుకొని దుర్భాషలాడినప్పుడు ఈ అసమర్థ ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుందా అని ప్రశ్నించారు. ఇలాంటివాటితో పోల్చుకుంటే ఓ చిన్న స్వల్ప సంఘటనను భూతద్దంలో చూసి పోలీసులు పెట్రేగిపోవడం ఏమిటని దుయ్యబట్టారు. బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, తక్షణమే ఈ కుటుంబాలకు లక్ష రూపాయలను కాంగ్రెస్ పార్టీ తరఫున ఇస్తున్నామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, గూడూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి పనబాక కృష్ణయ్య, తిరుమతి మాజీ పార్లమెంట్ సభ్యుడు చింతా మోహన్, మాజీ జడ్పీ చైర్మన్ చెంచలబాబు యాదవ్, చేవూరు దేవకుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.