శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

నేటి నుంచి వెంకయ్యస్వామి ఆరాధనోత్సవాలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకటాచలం, ఆగస్టు 17 : మండలంలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి 36వ ఆరాధనోత్సవాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా గొలగమూడి ఆశ్రమాన్ని ముస్తాబు చేశారు. దక్షణ భారతదేశంలోనే అవదూత వెంకయ్యస్వామి ఆశ్రమం అధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది. ప్రతి ఏటా ఆగస్టు 18 నుంచి 24వ తేదీ వరకు జరగనున్న వెంకయ్య స్వామి ఆరాధనకు ఏటా లక్షలాదిమంది భక్తులు హాజరవుతారు. ఆరాధనోత్సవాలకు హజరయ్యే భక్తుల కోసం ఆశ్రమ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. వెంకయ్య స్వామి ఆరాధనోత్సవాలు గతంలో నాలుగు రోజులపాటు నిర్వహిస్తుండగా ప్రస్తుతం ఏడు రోజులకు పెంచారు. ఈ ఏడాది జరిగే ఆరాధనోత్సవాలకు సుమారు ఐదులక్షల మందికి పైగా భక్తులు వస్తారని ఆశ్రమ నిర్వాహకులు అంచనాలు వేస్తున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆరాధనోత్సవం చివరి రోజున 24వ తేదీ సుమారు రెండు లక్షల మందికి పైగా భక్తులు హజరవుతారని అంచనా. ఈ ఏడాది వచ్చే భక్తులకు ఆశ్రమ నిర్వాహకులు సుమారు రూ.20 లక్షలతో వసతులు ఏర్పాటు చేశారు. భక్తులకు నిరంతరం తాగునీరు, సుమారు 150పైగా వసతిగృహాలు, సేదతీరేందుకు ప్రత్యేక డార్మెంటరీలు, కల్యాణ మండపాలు సిద్ధం చేయగా, నాలుగు చోట్ల మరుగుదొడ్లు, పార్కింగ్‌లు ఏర్పాటు చేశారు. ఆశ్రమం తరపున, బయట వ్యక్తులు అన్నదాన కార్యక్రమాలు, ఆర్టీసీ వారు ప్రత్యేక బస్సులు, వైద్య ఆరోగ్య శాఖ వారు వైద్య శిబిరాలు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నెల్లూరు రూరల్ డీఎస్పీ రాఘవరెడ్డి, నెల్లూరు రూరల్ సీఐ శ్రీనివాసులురెడ్డి అధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
* ఆరాధనోత్సవాల్లో భాగంగా
వెంకయ్యస్వామి 36వ ఆరాధనోత్సవాల్లో భాగంగా ఈ నెల 18వ తేదీ శనివారం ఉదయం సర్వభూపాల వాహన సేవ, రాత్రి కల్పవృక్ష సేవ, 19న ఉదయం హనుమంత వాహన సేవ, రాత్రి చంద్రప్రభ వాహన సేవ, 20న ఉదయం చిన్నశేష వాహన సేవ, రాత్రి హంస వాహన సేవ, 21న ఉదయం సూర్య ప్రభ వాహన సేవ, రాత్రి గజవాహన సేవ, 22న ఉదయం అశ్వ వాహన సేవ, రాత్రి పెద్దశేషవాహన సేవ, 23న ఉదయం సింహ వాహనసేవ, రాత్రి గరుడ సేవ, 24న ఉదయం రథోత్సవం, రాత్రి తెప్పోత్సవం నిర్వహించనున్నారు. వీటితోపాటు ప్రతి రోజు పూజా కార్యక్రమాలతోపాటు రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు. చివరి రోజున 24వ తేదీ ఉదయం 9 గంటలకు స్థానిక ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్‌రెడ్డి దంపతులు వెంకయ్య స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఆరాధన ఉత్సవాలకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పాల్గొనే అవకాశం ఉంది. ఆశ్రమ ఈవో బాలసుబ్రహ్మణ్యం భక్తుల వసతి సౌకర్యాలను పర్యవేక్షించనున్నారు.