శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

పరిశ్రమల ఏర్పాటుకు భూసేకరణపై ప్రత్యేక చర్యలు చేపట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు కలెక్టరేట్, మే 6: పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూములను సేకరించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్న గ్రీవెన్స్ హాలులో శుక్రవారం ఆయన రెవెన్యూ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ భూ సమస్యలకు సంబంధించిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించి, అర్హులైన వారికి ప్రయోజనాలు కల్పించాలన్నారు. అసైన్డ్, సిజెఎఫ్‌ఎస్ భూములకు రుణ అర్హతలు కల్పించాలన్నారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలన్నారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా భూముల క్రమబద్ధీకరించి సంబంధిత నివేదికలు ఆన్‌లైన్‌లో పొందుపరచాలన్నారు. అలాగే న్యాయస్థానాల్లో ఉన్న రెవెన్యూ కేసుల వివరాలు పంపాలన్నారు. సర్కార్ భూములకు సంబంధించి రీ సెటిల్‌మెంట్, రిజిస్ట్రేషన్‌ల ప్రక్రియను సక్రమంగా పూర్తి చేయాలన్నారు. నీటి తీరువా పన్నులను వసూలు చేయాలని, ఈ ప్రక్రియలో రెవెన్యూ అధికారులు నిర్ధేశించిన లక్ష్యాలను పూర్తి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఒక ఏడాది కాల పరిమితి మించిన కార్యాలయ పైళ్లను అవసరమైన మేరకు ఉంచి మిగిలినవి డిస్పోజ్ చేయాలన్నారు. వీటిపై మండల స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు పేరుకుపోయిన అనవసర పైళ్లను తీసివేయాలన్నారు. జన్మభూమి, మీకోసం, మీభూమి వంటి కార్యక్రమాల్లో వచ్చిన అర్జీలను పెండింగ్‌లో లేకుండా చూడాలన్నారు. ప్రజల నుండి తీసుకున్న విజ్ఞప్తులకు చేపట్టిన చర్యలను గూర్చిన సమాచారం అందజేయాలన్నారు. నూతనంగా జిల్లాలో చేపడుతున్న రహదారులకు సంబంధించి భూసేకరణ పెండింగ్‌లో లేకుండా చేయాలన్నారు. బీచ్ కారిడార్ అభివృద్ధికి కేటాయించిన భూముల సేకరణపై ప్రత్యేక శ్రద్ధ కనుపరచాలన్నారు. ఈ ప్రక్రియలో సంబంధిత 12 మండలాల వివరాలు పంపాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న గృహ నిర్మాణం, విద్యుత్ ఉప కేంద్రాలు, ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు అవసరమైన భూమిని గుర్తించి కేటాయించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ, అసైన్డ్ భూముల రికార్డుల నిర్వహణ సమర్ధవంతంగా పూర్తి స్థాయిలో సమాచారం ఉండేలా చూడాలన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం సుదర్శన్ రెడ్డి, గూడూరు సబ్ కలెక్టర్ గిరిషా పిఎస్, నెల్లూరు, ఆత్మకూరు, కావలి, ఆర్‌డిఒలు వెంకటేశ్వర్లు, ఎస్‌వి రమణ, లక్ష్మీ నరసింహన్, వివిధ మండలాలకు చెందిన తహశీల్దార్లు, తదితర అధికారులు పాల్గొన్నారు.