శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరుసిటీ, మార్చి 28: ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పోరాటానికి సిద్ధం కావాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ అధ్యక్షుడు భవానీ నాగేంద్రప్రసాద్ పిలుపునిచ్చారు. సోమవారం ఇందిరాభవన్‌లో సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉడతా వెంకట్రావు ఆధ్వర్యంలో నగర కమిటీని నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాదాపు పదేళ్ల క్రితం ఏర్పడిన నగరానికి ఉడతా వెంకట్రావు నాయకత్వన నూతన కమిటీ ఏర్పడటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. నగరపాలక సంస్థలో ఉన్న అవినీతిని ఎండగట్టడానికి, పెన్నా బ్యారేజీ పనులను నిలుపుదల చేసి రైతాంగానికి సాగునీరు, నగర ప్రజలకు తాగునీరు లేకుండా చేసినందుకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పోరాటం చేయాలన్నారు. పిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి ఆదేశానుసారం చిరంజీవి యువత నాయకులకు కీలకమైన ఉపాధ్యక్ష పదవులను ఇవ్వడం జరిగిందన్నారు. నగరంలోని అన్ని డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ కమిటీలను ఏర్పాటు చేస్తుందని తెలిపారు.
నగర కాంగ్రెస్ పార్టీ కార్యవర్గం
నగర కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గన్ని సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉడతా వెంకట్రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. వీరిలో ఉపాధ్యక్షులుగా 5 మంది వారిలో కారంపూడి కృష్ణారెడ్డి, సాయి గోపాల్, సంజీవరాయులు, గౌస్‌బాషా, కిరణ్‌కుమార్, ప్రధాన కార్యదర్శిలుగా 9 మందిని ఎంపిక చేశారు. కార్యదర్శులుగా 10 మందిని నియమించారు. ఈ కార్యక్రమంలో పిసిసి సమన్వయ కమిటీ సభ్యుడు సివి శేషారెడ్డి, పిసిసి అధికార ప్రతినిధి కనకట్ల రఘురామ్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

ఎసిబి వలలో రెవెన్యూ చేప
* లంచం తీసుకుంటూ రెడ్‌హేండెడ్‌గా పట్టుబడ్డ తహశీల్దార్
* భారీగా అక్రమాస్తులు గుర్తించిన ఎసిబి అధికారులు

కావలి, మార్చి 28: పట్టణంలోని ఉత్తర జనతాపేటలో నివసిస్తున్న దుత్తలూరు తహశీల్దార్ లలిత ఓ రైతు నుంచి 15వేల రూపాయలు లంచం తీసుకుంటూ తన ఇంటిలో జిల్లా ఎసిబి అధికారులకు రెడ్‌హేండెడ్‌గా పట్టుబడ్డారు. దుత్తలూరు మండలం తురకపల్లి గ్రామానికి చెందిన యువ రైతు పోలు శివరామిరెడ్డి తన కుటుంబానికున్న 14.75 ఎకరాల పొలం వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని దరఖాస్తు చేసుకోగా లంచం కోసం వేధించగా చివరికి ఎసిబి అధికారులను ఆశ్రయించారు. డిఎస్‌పి తోట ప్రభాకర్, సిఐ ఎన్ శివకుమార్‌రెడ్డి, ఇతర సిబ్బంది రైతుతో కలిసి సోమవారం వల వేయగా లంచం తీసుకుంటూ రెడ్ హేండెడ్‌గా దొరికిపోయారు. అనంతరం ఇంటిలోని బీరువాలను, పరిసరాలను తనిఖీలు చేశారు. ఇందులో ఏ ఆధారాలూ చూపని 7.95 లక్షల రూపాయల నగదు, కొండాపురం మండలంలోని పలువురు రైతులకు చెందిన పొలం పాస్ పుస్తకాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అలాగే కొన్ని విలువైన డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. దాడి జరిగిన విషయాన్ని తెలుసుకున్న పలువురు బాధితులు నేరుగా, మరి కొంతమంది ఫోన్‌లోనూ ఎసిబి అధికారులకు ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా గత భారీ వర్షాలకు నష్టపోయిన చేనేతలకు ఒక్కొక్కరికి 11500 రూపాయల వంతున 51 మంది బాధితులకు ప్రభుత్వం పరిహారం మంజూరు చేసింది. అయితే వాటిని లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి మళ్లించాల్సి ఉండగా తహశీల్దార్ నేరుగా లబ్ధిదారులను 15 వందల రూపాయల వంతున డిమాండ్ చేసినట్టుగా పలువురు చేనేత కార్మికులు ఎసిబి డిఎస్‌పికి ఫిర్యాదులు చేశారు. దాని గురించి తహశీల్దార్ లలితను వాకబు చేయగా ఆర్డీవోపై చెప్పినట్లు సమాచారం. వెంటనే డిఎస్‌పి ప్రభాకర్ కావలి ఆర్డీవో ఎంఎల్ నరశింహంను ఫోన్‌లో సంప్రదించారు. అది తనకు సంబంధం లేదని, మండల రెవెన్యూ అధికారులే చూసుకుంటారని చెప్పినట్లు తెలిసింది. ప్రజల సొమ్ముతో జీవిస్తూ, సౌకర్యాలు అనుభవిస్తూ చేనేతలను కూడా మీ మండల అధికారులు వదలరా అంటూ మండిపడ్డారు. అంత జరుగుతుంటే మీరు ఎందుకు పర్యవేక్షణ చేయలేదని, ఎందుకు చర్యలకు సిఫార్సులు చేయలేదని తాను మొత్తం వ్యవహారాన్ని పరిశీలించి ప్రభుత్వానికి నివేదిస్తానని తెలిపారు. అయితే దాడి జరిగిన విషయాన్ని తెలుసుకున్న కొంతమంది సంబంధిత తహశీల్దార్ బాధితులు డిఎస్‌పికి ఫిర్యాదులు చేశారు.
తనిఖీలు జరుగుతుండగానే డిఎస్‌పి ప్రభాకర్, సిఐ శివకుమార్‌రెడ్డి దాడికి సంబంధించిన వివరాలను తెలియజేశారు. ఫిర్యాదుదారుడైన శివరామిరెడ్డి కుటుంబానికి 14.75 ఎకరాల పొలం ఉండగా తండ్రి తిమ్మారెడ్డి, పిన తండ్రి చిన్నారెడ్డి పేరిట పాస్ పుస్తకాలు, రిజిష్టర్ డాక్యుమెంట్లు ఉన్నాయని, కానీ ఆన్ లైన్‌లో వివరాలు సరిగా లేవన్నారు. బ్యాంక్‌లో పంటరుణం ఇచ్చేందుకు ఆన్‌లైన్‌లో వివరాలే ప్రామాణికం కాగా, అందుకోసం తమ వద్ద ఉన్న ఆధారాలతో తహశీల్దార్‌ను నాలుగునెలల క్రితం సంబంధిత రైతు కలిసినట్లు తెలిపారు. కిందిస్థాయి అధికారుల పరిశీలన పూర్తి అయి చివరి దశలో తహశీల్దార్ పని పూర్తిచేయాల్సి ఉండగా 20 వేల రూపాయలు డిమాండ్ చేసినట్లు చెప్పారు. అలా రెండు నెలలు జరిగిపోగా చివరికి 15 వేల రూపాయల ఒప్పందం కుదరగా మొత్తం విషయాన్ని తమకు తెలియజేసినట్లు ఆమేరకు తాము వలపన్ని పట్టుకున్నట్లు డిఎస్‌పి ప్రభాకర్ తెలిపారు. కాగా, అవినీతి కార్యకలాపాలపై ప్రజల్లో తిరుగుబాటు రావాలని, ఎక్కడికక్కడ నిలదీసి ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. కేవలం ఇద్దరు ముగ్గురు యువకులు మాత్రమే స్పందిస్తున్నారని, ఇది సామాజిక బాధ్యతగా స్వీకరించి యువత అవినీతి రహిత సమాజం కోసం కృషి చేయాలని అన్నారు. తాము ఎవరి వివరాలు వెల్లడించమని చెప్తూ అవినీతి, అక్రమార్కులకు సంబంధించిన సమాచారాన్ని అందించాలని కోరారు. దుత్తలూరు తహశీల్దార్ కార్యాలయంలోనూ తనిఖీలు ఉంటాయని, పరిశీలన పూర్తయిన తర్వాత మొత్తం వివరాలను మీడియాకు వెల్లడిస్తామని అన్నారు. కాగా, ఎసిబి దాడి ఘటన ప్రభుత్వ అధికార యంత్రాంగంలో ప్రకంపనలు సృష్టించింది.

ఎనె్నన్నో ఎత్తుపల్లాలు!
తెలుగుదేశం నెల్లూరు జిల్లా ప్రస్థానమిది
నేడు పార్టీ ఆవిర్భావ దినోత్సవం
ఆత్మకూరు, మార్చి 28: ప్రస్తుతం నవ్యాంధ్రగా పిలువబడుతున్న అవశేషాంధ్రప్రదేశ్‌లో అధికార భోగం అనుభవిస్తున్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు రాజకీయంగా ఎనె్నన్నో ఎత్తుపల్లాల్ని చవిచూసింది. ఉత్ధానపతనాల్లో పడి లేస్తూ నేడు జిల్లాలో పటిష్ఠంగానే కనిపిస్తున్నా అంతర్గతంగా వర్గపోరు మాత్రం పార్టీ పురోగతి పాలిట శాపగ్రస్తమే. 1982 ఫిబ్రవరి 29న ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీకి నాటి నుంచి నేటి వరకు నమ్ముకుని ఉన్న కేడర్ చాలామంది ఉన్నారు. అయితే వారి గుర్తింపు హోదాకు సంబంధించి పదవుల పందేరం అనే తారకమంత్రంలో మాత్రం అంతంతగానే ప్రాధాన్యత. పార్టీ వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్‌కు అభిమానులే ఆనాడు తెలుగుదేశంలో కీలక సైన్యంగా మారారు. అందులో ప్రథముడు, కొన్నాళ్లపాటైనా రాష్ట్రంలో సహాయ మంత్రి హోదా వరకు చేరుకున్న ఘనత అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘ అధ్యక్షునిగా పిలవబడుతున్న తాళ్లపాక రమేష్‌రెడ్డికే దక్కుతుంది. ప్రస్తుతం ఆయన నెల్లూరులోని ఎందరో నేతల్లో ఒకరిగానే పరిమితం. అంతేతప్ప ప్రత్యేక గుర్తింపు అంటూ ఏమీ లేదు. అలాగే నాటి నుంచి నేటి వరకు కొనసాగుతున్న వారిలో బుచ్చిలోని బెజవాడ కుటుంబీకుల్ని కూడా ప్రస్తావించుకోవచ్చు. నాటి కెరటం బెజవాడ పాపిరెడ్డికి పార్టీ పొలిట్‌బ్యూరోలో సభ్యత్వంతో సహా రాష్ట్ర మంత్రి పదవి, ఆ తరువాత 1984 ఎన్నికల్లో ఒంగోలు నుంచి ఎంపి అయ్యే అవకాశం లభించాయి. సదరు పాపిరెడ్డి మరణం అనంతరం ఆయన సోదరుడైన బెజవాడ ఓబులరెడ్డి పార్టీలోనే కొనసాగుతున్నారు. అయితే పార్టీలో ఆయన ప్రమేయం గౌరవప్రదంగానే భావించినా నిర్ణయాత్మకమైన అంశాల్లో కీలకమైతే కావడంలేదు. అలాగే పార్టీ ఎదుర్కొన్న తొలి ఎన్నికల్లోనే చేతుల్లోకి టిక్కెట్ వచ్చినా ఎన్టీఆర్ ఆజ్ఞతో ఆనం కుటుంబానికి ఆ అవకాశాన్ని త్యజించిన మెచ్చుకోదగ్గ నేతగా వైటి నాయుడ్ని పేర్కొంటారు. ఈయనను రాజకీయాల్లో నష్టజాతకుడిగా అభివర్ణిస్తుంటారు. ప్రస్తుతం అనారోగ్య సమస్యతో క్రియాశీలక రాజకీయాలకు దూరం పాటిస్తున్నారు. ఇక మిగిలిన నేతలు పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు ఉన్నవారు ఏ కొందరో. పార్టీ అధికారంలో ఉన్నప్పుడో వచ్చి ఆ తరువాత అవకాశవాద ధోరణితో ముఖం చాటు వేసే వారే అధికమని చెప్పుకుంటే అతిశయోక్తి కాదు. ఇక ఇటీవల పార్టీలోకి పునఃప్రవేశించిన ఆనం కుటుంబీకులు తొలి ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి గెలుపొందారు. అటు తరువాత రెండేళ్లకల్లా వచ్చిన మధ్యంతర ఎన్నికలనాటికి తండ్రి ఆనం వెంకటరెడ్డి పార్టీకి దూరమైతే తనయుడు రామనారాయణరెడ్డి మాత్రమే పార్టీలో కొనసాగారు. ఆయన కూడా 1991లో సోదర సమేతంగా పార్టీకి దూరమై సరిగ్గా ఒకటిన్నర దశాబ్దకాలం తరువాత ఇటీవల పునఃప్రవేశించారు. ఇదిలాఉంటే మాజీ మంత్రి, ప్రస్తుతం ఎంఎల్‌సిగా ఉన్న సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని నిలబెట్టడంలో శక్తివంచన లేకుండా ప్రయత్నించారనే చెప్పాలి. అలాగే బీద సోదరులు కూడా జిల్లాలో పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. గత ఎన్నికలకు ముందు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ విజయానికి బాటలు వేశారని నెల్లూరు కోటాలో అమాత్య హోదా పొందిన ఘనత పొంగూరు నారాయణకే దక్కింది. ఇలా ప్రస్తుతం జిల్లాలో ముఖ్యనేతలు పలువురు ఉన్నా వారంతా ఒకే బాటపై నడిస్తేనే విపక్షానికి గట్టి పట్టున్న నెల్లూరు ఇలాఖాలో క్షేత్రస్థాయి నుంచి తెలుగుదేశం పటిష్ఠమయ్యేందుకు స్పష్టమైన బాటలు పడతాయి.

తల్లీబిడ్డల ఆత్మహత్య కేసులో ఇద్దరు అరెస్ట్
బుచ్చిరెడ్డిపాళెం, మార్చి 28: సంచలనం కలిగించిన చంటిబిడ్డలతో సహా తల్లి ఆత్మహత్య చేసుకున్న సంఘటనలో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు బుచ్చిరెడ్డిపాళెం సిఐ గంగా వెంకటేశ్వర్లు తెలిపారు. మండలంలోని జొన్నవాడ గ్రామంలో ఇటీవల ఇద్దరు చిన్నారులతో సహా తల్లి ప్రవల్లిక కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న విషయం పాఠకులకు తెలిసిందే. ఈ కేసులో ఆమె భర్త రాగాల మురళి, అత్త చిన్నమ్మలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రవల్లిక భర్త, అత్త కలసి ఆమెను మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురిచేసినందు వల్లే ఆమె బలవన్మరణానికి పాల్పడిందని ఆమె తల్లి శేషమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులను అదుపులోకి తీసుకుని వారిని కోర్టుకు హాజరుపరచినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఎస్సై వేణుగోపాల్ రెడ్డి, పోలీసు సిబ్బంది ఉన్నారు.

కారిడార్ భూసేకరణ సర్వే పరిశీలన
కోట, మార్చి 28: కారిడార్ భూసేకరణ సర్వే పనులను సోమవారం గూడూరు సబ్‌కలెక్టర్ గిరీషా పరిశీలించారు. కోస్టల్ కారిడార్‌లో భాగంగా రాబోవు పరిశ్రమల కోసం కోట మండలంలోని సిద్దవరం, కర్లపూడి పంచాయతీలలో 6000 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించనుంది. దీనికి సంబంధించి సర్వే పనులు జరుగుతున్నాయి. దీంతో సిద్దవరం, కర్లపూడి గ్రామాల్లో జరుగుతున్న సర్వే పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కారిడార్ వల్ల అనేక పరిశ్రమలు రానున్నాయని, దీంతో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఆయన అన్నారు. కారిడార్ కోసం జరుగుతున్న సర్వేలో ఇప్పటికి 3000 ఎకరాల్లో సర్వే పూర్తయిందన్నారు. త్వరతిగతిన సర్వే పనులు పూర్తి చేయాలని సర్వేయర్‌ను ఆదేశించారు. ఆయన వెంట తహశీల్దార్ బి లీలారాణి, ఆర్‌ఐ గ్లోరీ, సర్వేయర్, విఆర్‌వో ఉన్నారు.

జిల్లా పోలీసుల ‘పబ్లిక్ ఐ’
* వాట్సప్ పోలీసింగ్‌ను ప్రారంభించిన ఎస్పీ
* ప్రజల ఫిర్యాదుల కోసం వాట్సప్ నెంబర్ 9390777727
నెల్లూరు, మార్చి 28: ‘డయల్ యువర్ ఎస్పీ’ వంటి వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన జిల్లా ఎస్పీ విశాల్ గున్ని తాజాగా జిల్లాలో శాంతిభద్రతలు, ట్రాఫిక్ వంటి సమస్యల పరిష్కారానికి అనువుగా వాట్సప్ పోలీసింగ్‌కు శ్రీకారం చుట్టారు. సోమవారం తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎస్పీ ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు పోలీసుల ద్వారా సేవలను మరింత త్వరంగా విస్తృతంగా చేయడంలో భాగంగా ఈ వాట్సప్ పోలీసింగ్‌కు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. ప్రజలు తమ కళ్లెదుట ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగినా, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించే చర్యలు కనిపించినా ఇతర ఎటువంటి శాంతిభద్రతలకు విఘాత చర్యలు తమకు ఎదురైన పక్షంలో వాటిని తమ ఫోన్‌లో ఫొటోలుగా కానీ, వీడియోలుగా కానీ, వాయిస్ మెసేజ్ రూపంలో కానీ తాము సూచించే వాట్సప్ నెంబరుకు పంపాలని సూచించారు. ఇందుకోసం తాము 93907 77727 మొబైల్ నెంబరును అందుబాటులో ఉంచామన్నారు. ఈ నెంబరుకు వాట్సప్ ద్వారా జిల్లా ప్రజలు తమకు ఎదురైన విషయాలను చేరవేయాలని కోరారు. సత్వరం తాము చర్యలు తీసుకునే వీలు కలుగుతుందని చెప్పారు. ప్రజలు పంపిన ఫిర్యాదులు అందుకునేందుకు వీలుగా ఈ వాట్సప్ నెంబరును జిల్లా కార్యాలయంలోని కంట్రోల్‌రూంకు అనుసంధానించినట్లు తెలియచేశారు. అక్కడ ప్రత్యేక అధికారి పర్యవేక్షణలో తక్షణ చర్యలకు ఏర్పాట్లు ఉంటాయన్నారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించేవారిని, నో పార్కింగ్ చోట వాహనాలు నడిపేవారిని సైతం ప్రజలు వాట్సప్ ద్వారా తమకు సమాచారం అందించవచ్చన్నారు. 24 గంటలపాటు ఈ వాట్సప్ నెంబరు అందుబాటులో ఉంటుందని తెలిపారు. పోలీస్ వ్యవస్థకు ప్రజల నుంచి తగిన సహకారం కోరుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని, జిల్లావాసులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా నగరంలో ట్రాఫిక్ పోలీసులు ఎంతో బాధ్యతగా పని చేస్తున్నారని, ప్రజలు సైతం వారికి సహకరించాలని ఎస్పీ కోరారు. సెల్‌ఫోన్ ఉపయోగిస్తూ వాహనాలు నడపడం, ముగ్గురు ద్విచక్ర వాహనంలో ప్రయాణించడం, స్పీడ్ డ్రైవింగ్ వంటి ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడవద్దని ఎస్‌పి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్బీ డిఎస్పీలు కోటారెడ్డి, విక్రమ శ్రీనివాసరావు, సిఐ అల్త్ఫా తదితరులు పాల్గొన్నారు.
త్యాగరాజస్వామి స్మరణోత్సవాలు ఘనంగా ప్రారంభం
నెల్లూరు కలెక్టరేట్, మార్చి 28: జిల్లా కేంద్రంలోని పురమందిరంలో త్యాగరాజస్వామి స్మరణోత్సవాలను సోమవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ కన్వీనర్ డాక్టర్ వై నాగదేవిప్రసాద్ మాట్లాడుతూ ఈ ఉత్సవాలు ఏప్రిల్ 3 వరకు నిర్వహించనున్నామన్నారు. సాయంత్రం చెన్నై వారి గాత్రకచేరీ శ్రోతలను ఆకట్టుకుంది. త్యాగరాజస్వామి స్మరణోత్సవాలకు అధిక సంఖ్యలో హాజరుకావడం అభినందనీయమన్నారు. ఈ స్మరణోత్సవాలలో రోజూ అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఉత్సవాల కమిటీ అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు.

ఉగాది నిర్వహణకు ఏరాట్లు చేపట్టాలి:కలెక్టర్
నెల్లూరు కలెక్టరేట్, మార్చి 28: తెలుగు సంవత్సరాది ఉగాది పండుగను ఏప్రిల్ 8న ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎం జానకి ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ప్రాంగణంలోని తన ఛాంబర్‌లో సోమవారం అధికారులతో ఉగాది పండుగ నిర్వహణపై మాట్లాడారు. నగరంలోని ఎసి సుబ్బారెడ్డి క్రీడా మైదానంలో పండుగ నిర్వహణ ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రత్యేకించి పండుగ ఉద్దేశాలను తెలిపే అన్నిరకాల వంటకాలు తయారుచేసి అందించే విధంగా పర్యాటక, ప్రముఖ హోటళ్ల యాజమాన్యాలను ఆమె కోరారు. ఇందుకోసం మైదానంలో 15 స్టాళ్లను ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా, రాష్ట్ర ప్రధాన వంటకాలతో పాటు చైనీస్, సాంప్రదాయ వంటకాలను కూడా తయారుచేయించాలన్నారు. అలాగే పండుగ ప్రాముఖ్యాన్ని తెలిపే పంచాంగ శ్రవణం, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను అన్ని శాఖల సమన్వయంతో చేపట్టాలన్నారు. ఎండ తీవ్రతలను దృష్టిలో ఉంచుకుని ఆహూతులందరికి మంచినీరు, పారిశుద్ధ్య బాధ్యతలను నగరపాలక సంస్థ చేపట్టాలన్నారు. సమావేశంలో ఎజెసి సాల్మన్ రాజ్‌కుమార్, హోటల్ యాజమాన్యాలు, ప్రతినిథులు, గూడూరు సబ్ కలెక్టర్ గిరీషా పిఎస్, డిఆర్‌ఒ ఎం సుదర్శన్‌రెడ్డి, నెల్లూరు ఆర్‌డిఒ వెంకటేశ్వర్లు, జడ్పీ సిఇఒ బి రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వ్యవసాయ గోదాముల ఏర్పాటుకు
ప్రణాళికలు తయారుచేయాలి:కలెక్టర్
నెల్లూరు కలెక్టరేట్, మార్చి 28: వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేసేందుకు మండలాలవారీగా గోదాముల అవసరంపై ప్రణాళికలు తయారుచేయాలని కలెక్టర్ ఎం జానకి అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్న గోల్డెన్‌జూబ్లీ హాలులో సోమవారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌లు, జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వచ్చిన అధిక దిగుబడులకు ప్రస్తుతమున్న గోదాముల సామర్ధ్యం సరిపోదన్నారు. రైతుల సంక్షేమార్ధం నాబార్డ్ సహకారంతో మండలాలలో గోదాముల నిర్మాణాలకు ప్రణాళికలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించాలన్నారు. అలాగే మార్కెట్ యార్డులకు ఉన్న రవాణ సదుపాయాలు, అంతర్గత రహదారులు, ధాన్యం సేకరణపై సమీక్షించారు. కాగా జిల్లాలో రైతుబంధు పథకం పకడ్బందీగా అమలు చేయాలన్నారు. ధాన్యం కొనుగోలుకు కావాల్సిన పరికరాల కొనుగోళ్లు, త్వరిత సేకరణకు గన్నీ బస్తాలు పంపిణీ చేయాలన్నారు. సమావేశంలో జెసి ఎఎండి ఇంతియాజ్, మార్కెటింగ్ శాఖ ఎడి కెవిఎస్ ఉపేంద్రకుమార్, పౌరసరఫరాల మేనేజర్ కొండయ్య, మార్కెట్ యార్డ్ ఛైర్మన్‌లు పాల్గొన్నారు.

పెళ్లిలో చోరీ
నెల్లూరు, మార్చి 28: నగరంలో జరిగిన శుభకార్యంలో పాల్గొనడానికి వచ్చిన దంపతులకు చెందిన సుమారు 95 గ్రాముల బంగారు నగలు చోరీకి గురయ్యాయి. పోలీసుల కథనం మేరకు ఓజిలి మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన మధుసూదన్‌రావు సురేఖ దంపతులు ఈనెల 24న నగరంలోని ఓ కల్యాణ మండపంలో జరుగుతున్న పెళ్లికి హాజరయ్యారు. అదేరోజు రాత్రి కల్యాణ మండపంలో వారు నిద్రకు ఉపక్రమిస్తూ తమకు చెందిన రెండు జతల బంగారు గాజులు, నక్లెస్, తదితర ఆభరణాలను తమ బ్యాగులో పెట్టుకుని నిద్రించారు. ఉదయం నిద్రలేచి తమ గ్రామానికి బయలుదేరి వెళ్లారు. అక్కడకు వెళ్లి బ్యాగులో చూసుకోగా తమ బంగారు ఆభరణాలు చోరీకి గురయినట్లు గుర్తించారు. ఈసంఘటనపై సోమవారం నాల్గో నగర పోలీసులకు వారు ఫిర్యాదు చేశారు. నాలుగో నగర సిఐ సీతారామయ్య కేసు దర్యాప్తు చేస్తున్నారు.

నగదు చోరీ
నెల్లూరు, మార్చి 28: తన జేబులో ఉంచుకున్న 90వేల రూపాయలు చోరీకి గురైనట్లు శ్రీనివాసులరెడ్డి అనే వ్యక్తి పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశాడు. పోలీసుల కథనం మేరకు బాలాజీనగర్‌కు చెందిన శ్రీనివాసులరెడ్డి, టిప్పర్ యజమాని తన టిప్పర్‌కు చెందిన ఫైనాన్స్ వాయిదాలు కట్టే నిమిత్తం 90వేల రూపాయలను జేబులో పెట్టుకుని ఈనెల 25న ఏసి సెంటర్‌కు వచ్చారు. అక్కడ తన మిత్రులతో కలసి రంగనాథస్వామి రథోత్సవంలో రథం లాగాలని వెళ్లగా రథంలాగే సమయంలో జేబులో నగదును ఎవరో తస్కరించినట్లు గుర్తించారు. చుట్టుపక్కల విచారించి చివరకు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడో నగర డిఎస్పీ రామకృష్ణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.