శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

రాంగ్ నెంబర్‌తో జత కలిపి...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూరు, మే 27: అదే అతగాడి వ్యాపకం... అందమైన మహిళలతో అనుబంధం పెంచుకోవాలనుకుంటాడు... వాళ్లకు తానో జ్ఞాపకం కావాలనుకుంటాడు... అందుకోసమై నిత్యం ఏవేవో నెంబర్లకు ఫోన్లు చేస్తూ ఉంటాడు. ఎవరైనా మహిళ ఫోన్‌కు తాను చేసిన నెంబర్ కలిసిందంటే ఇక వదలడు. మాటామంతి కలిపేస్తుంటాడు. మీకు ఎవరు కావాలి... మీరు రాంగ్ నెంబర్‌కు చేశారని అవతల వైపునుంచి ఆ అభాగిణి చెప్తున్నా వినడు. మళ్లీ మళ్లీ చేస్తూ మొత్తమీద ఆమె మాట్లాడుతున్న స్వరాన్ని అంచనాగా వయస్సు నిర్ధారణకు వచ్చేస్తాడు. ఎలాగైనా తన బుట్టలో పడాలనేదే ఆ ప్రబుద్ధుడి నిర్వాకం. అలా నారీలోకాన్ని మాయాలోకంలోకి తీసుకెళ్లాలనే ఫోన్ నెంబర్లతో గాలం వేసే యువకుడికి ఆత్మకూరు పట్టణంలో దేహశుద్ధి చేసిన వైనమిది.
మర్రిపాడు మండలం డిసిపల్లి గ్రామానికి చెందిన మహిళను వేధిస్తున్న యువకుడికి ఆత్మకూరు పట్టణంలో దేహశుద్ధి జరిగింది. ఈమెకు గత ఆరు నెలల క్రితం ఓ రాంగ్‌నెంబర్ కాల్ వచ్చింది. ఆమె రాంగ్‌నెంబర్ అని చెప్తున్నా వదలకుండా గత ఆరు నెలలుగా నిత్యం పదేపదే ఫోన్లు చేయసాగాడు. తనది కర్నూలు జిల్లా అని, తన పేరు కుమార్ అంటూ అతను మళ్లీమళ్లీ ఫోన్లు చేస్తున్నాడు. ఫోన్‌లోనే ఎంతగా దూషించినా వదలడం లేదు. ఇక చేసేదేమి లేక ఈ విషయాన్ని ఆమె తన బంధువులకు ఈ విషయాన్ని తెలిపింది. ఓ ప్రణాళిక ప్రకారం ఆమె ద్వారానే ఆత్మకూరు పట్టణానికి రప్పించారు. నిన్ను పడేయడానికి ఆరు నెలలు పట్టిందా...అనుకుంటూ ఆ యువకుడు కర్నూలు నుంచి ఆత్మకూరుకు చేరుకున్నాడు. సుమారుగా 400 కిలోమీటర్ల దూరం నుంచి ఆ ఆకతాయి మోటార్‌బైక్‌పైనే చేరుకోవడం గమనార్హం. ఇక్కడకు వచ్చాక ఆమెను మోటార్‌బైక్‌పైనే షికారుగా తీసుకెళ్దామనే ఉద్దేశం అతనిలో వికృతపుఆశలు పెంచడంతోనే అలా వచ్చాడు. తీరా, ఇక్కడకు వచ్చాక చూస్తే వ్యవహారం బెడిసికొట్టింది. ఫోన్‌లో పలకరించిన మహిళతోపాటు పలువురు ఆమె బంధువులు చుట్టూ ఉన్నారు. తప్పించుకుని పరారయ్యేందుకు అవకాశం లేకుండా పోయింది. ఆమె ఆ యువకుడి చొక్కా పట్టుకుని చెప్పుతో చెడామడా వాయించేసింది. దారినపోతున్న వాళ్లు కూడా విషయం ఆలకించి తలా ఒక దెబ్బ వేశారు. ఆత్మకూరుకు చెందిన వడ్డీవ్యాపారి చిట్టమూరు వెంకురెడ్డి తదితరులు కూడా అతనికి ఘాటుగా దేహశుద్ధి చేశారు. కలలో కూడా ఊహించని రీతిలో ఎదురైన తీరని భంగపాటుతో తన ఊరికి తిరుగు ప్రయాణమయ్యాడు.