శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

రాజ్యసభ ఆశావహులకు మొండి చేయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు కలెక్టరేట్, మే 30: రాజ్యసభ సీటు ఆశించిన జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నేతలకు ఆ పార్టీ అధినాయకత్వం మొండిచేయి చూపింది. జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రావు, రాజధాని నిర్మాణ అభివృద్ధి కమిటీ సభ్యుడు బీద మస్తాన్‌రావు, ఇటీవల వైకాపా నుండి టిడిపిలో చేరిన ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తదితరులు రాజ్యసభ సీటును ఆశించిన వారిలో ఉన్నారు. అయితే పార్టీ అధినాయకత్వం మూడు రాజ్యసభ సీట్లలో మిత్రపక్షమైన బిజెపికి ఒకటి కేటాయించి మిగిలిన రెండింటిలో ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న సుజనాచౌదరికి మరోసారి అవకాశం ఇవ్వగా, మరొక సీటును టిజి వెంకటేశ్‌కు కేటాయించింది. కాగా ఇటీవల వైకాపా నుండి పార్టీలో చేరిన 17 మంది ఎమ్మెల్యేలతో నాలుగో అభ్యర్థిని ఎంపిక చేసే విధంగా రంగం సిద్ధం చేశారు. అయితే అనూహ్యంగా నాలుగో అభ్యర్థిని ప్రకటించటం లేదని నిర్ణయం తీసుకోవటంతో ఆ ఆశ ఆవిరైపోయింది. దీంతో జిల్లా నుండి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహించాలనుకున్న ఆశావహులు తీవ్ర నిరాశకు గురయ్యారు. తొలుత ఆదాల పార్టీలో చేరేటప్పుడు రాజ్యసభ సీటు పొందే హామీతోనే చేరారు. తీరా రాజ్యసభ ఎంపిక ప్రక్రియలో ఆయనకు అవకాశం దక్కలేదు. అలాగే ప్రత్యక్ష ఎన్నికలకు తాను దూరమని పరోక్షంగా రాజ్యసభ సీటును ఆశించిన వేమిరెడ్డికి కూడా చుక్కెదురైంది. అలాగే పరిశీలనలో ఉన్న బీద మస్తాన్‌రావుకు రాజ్యసభ సీటు దక్కకపోవటంతో ఆశావహులు నిరుత్సాహపడ్డారు.