శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, మే 30: డ్వాక్రా, మెప్మా మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని రాష్ట్ర మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు. సోమవారం నగరంలోని కస్తూర్బా కళాక్షేత్రంలో మహిళా సాధికారిత అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి మహిళలలో ఆర్థిక సాధికారితను పెంచి వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడానికి కృషి చేస్తున్నారన్నారు. నెల్లూరు కార్పొరేషన్, 7 పురపాలక సంఘాల పరిధిలో మెప్మా కింద 3 లక్షల 27వేల 638 సభ్యులున్నారని, వారు జిల్లా వ్యాప్తంగా ఉన్న మహిళలలో 12 శాతంగా ఉన్నారన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో డ్వాక్రా గ్రూపులు, పట్టణ ప్రాంతాలో ఉన్న మెప్మా మహిళా గ్రూపుల వారి తలసరి ఆదాయాన్ని పెంచుకున్నట్లు అయితే రాష్ట్రం తలసరి ఆదాయం పెరుగుతుందన్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి ఎంతో శ్రద్ధ వహించి మహిళా గ్రూపుల వారు ఆర్థిక పరిపుష్టి పొందడానికి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. గ్రామీణ ప్రాంతాలలోగాని, పట్టణ ప్రాంతాలలోని మహిళా గ్రూపులు తమకు నచ్చిన వ్యాపారాలు చేసి తమ ఆదాయం పెంచుకోవడంతో పాటు, రాష్ట్ర తలసరి ఆదాయాన్ని పెంచే విధంగా తోడ్పడాలని ఆయన కోరారు. విద్య అనేది ఏ రంగంలోనైనా ముందుకు పోవడానికి ఉపయోగపడుతుందని కాబట్టి మహిళా గ్రూపుల వారు తాము చదువుకోవడంతోపాటు తమ పిల్లలను కూడా చదవించి రాష్ట్ర భవిష్యత్తుకు తోడ్పడాలని కోరారు. రాష్టవ్య్రాప్తంగా 150 పాఠశాలలు పురపాలక సంఘాల యాజమాన్యంలో ఉన్నాయని, వాటిలో విద్యా నాణ్యతను పెంపొందించడానికి తగు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మునిసిపల్ పాఠశాలలు కార్పొరేటర్ పాఠశాలలకు దీటుగా విద్యను అందించడానికి ప్రణాళికను సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ సిఇఓ బి రామిరెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వర్లు, ప్రభుత్వ ప్రధాన హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ చాట్ల నరసింహారావు, కార్పొరేటర్ రాజానాయుడు, మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీ్ధర్‌కృష్ణారెడ్డి, మెప్మా గ్రూపు మహిళలు పాల్గొన్నారు.