శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

రహదారులను శుభ్రపరచే వాహన యంత్రం ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు కలెక్టరేట్, మే 30: అభివృద్ధి చెందిన నగరాలకు దీటుగా రాష్ట్రంలోని పట్టణాలు, నగరాలను సుందరీకరించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని పట్టణాభివృద్ధి, పురపాలక మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. జిల్లా కేంద్రంలోని వనంతోటలో సోమవారం నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన రోడ్ వాక్యూమ్ స్వీపర్ మిషన్ (రహదారులను శుభ్రపరచే వాహన యంత్రం)ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛ్భారత్, స్వచ్ఛ ఆంధ్ర శుభ్రత నిర్వహణకోసం ఆధునిక యంత్రాలను వినియోగించటం జరుగుతుందన్నారు. పూర్తిగా కాంట్రాక్ట్ పద్ధతిలో నడిచే ఈ వాహనానికి రానున్న మూడేళ్లలో 1.67 కోట్లు వినియోగించనున్నామన్నారు. ఈ యంత్రం మూడు మీటర్లు వెడల్పుతో గంటకు ఎనిమిది కిలోమీటర్ల రోడ్డును శుభ్రపరుస్తుందన్నారు. దీంతో సమయం చాలా ఆదా అవుతుందన్నారు. రాష్ట్రంలో విశాఖ, విజయవాడ, నెల్లూరులో మాత్రమే ఇప్పటికి ప్రారంభించామన్నారు. అన్ని జిల్లాలోనూ ఆధునిక యంత్రాలను వినియోగంలోకి తేనున్నామన్నారు. అలాగే రాష్ట్రంలో రోజుకు 7 వేల టన్నుల చెత్త లభ్యమవుతుందని దీనిలో సగానికి పైగా కాల్చివేయటం జరుగుతుందన్నారు. అయితే తడి చెత్త సమస్యగా మారుతుండటంతో ఢిల్లీ తరహాలో దీనిని విద్యుత్ తయారీ వినియోగానికి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. కాగా మురుగునీటి ట్రీట్‌మెంట్‌కు రూపకల్పన చేస్తున్నామన్నారు. నగరాలు, పట్టణాలు అభివృద్ధిలో భాగంగా రాష్ట్రంలోని 110 మున్సిపాలిటీల్లో పటిష్టమైన డిపిఆర్ సిద్ధంగా ఉందన్నారు. మంత్రి వెంట మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీ్ధర్‌కృష్ణారెడ్డి, తాళ్లపాక అనురాధ, నూనె మల్లికార్జున, నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.