శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ధన రాజకీయాలు ఎల్లవేళలా పనిచేయవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కావలి, మే 30: ధన రాజకీయాలు ఎల్లవేళలా పనిచేయవని, రాజ్యసభ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి సాయిరెడ్డి విజయాన్ని ఎలాగైనా అడ్డుకోవాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుయుక్తులకు పాల్పడుతున్నారని, సాయిరెడ్డి విజయాన్ని అడ్డుకోవడం ఆయన తరం కాదని ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని 6వ వార్డు నుంచి వైసిపి తరపున కౌన్సిలర్‌గా ఎన్నికైన ఏడుంబాకల పోలయ్య ఇటీవల మృతిచెందగా పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డితో సోమవారం ఉదయం మృతుని ఇంటి వద్దకు వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. పోలయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పార్టీపరంగా అండగా వుంటామని తెలిపారు. అనంతరం ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ రాజ్యసభ ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ధన, అధికార బలంతో అనైతిక రాజకీయాలకు తెరతీశారని, ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా తమ అభ్యర్థి విజయాన్ని ఆపడం ఆయన తరం కాదన్నారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం పార్టీ పరంగా చర్చించేందుకు ఏర్పాటు చేసిన తిరుపతి మహానాడులో లక్ష్యానికి దూరంగా రామజపం మాని జగన్ జపంతో సరిపెట్టారని విమర్శించారు. తమ పార్టీ అధినేత యువశక్తికి ప్రతినిధిగా వున్న జగన్‌మోహన్‌రెడ్డి అనుక్షణం గుర్తుకు వస్తూ చంద్రబాబుకు నిద్రలేకుండా చేస్తున్నారని మహానాడులో జరిగిన చర్చలు నిరూపించాయన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని, ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా విభజన రాజకీయాలతో పబ్బం గడుపుతూ తెలుగు తమ్ముళ్ళకు నీరు-చెట్టు వంటి కార్యక్రమాలతో నిధులు పంచిపెడుతున్నారని విమర్శించారు. పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో పార్టీ అత్యంత పటిష్టంగా ఉందన్నారు. ఏ ఒక్క ఎమ్మెల్యే పార్టీ నుంచి దూరమయ్యే ప్రసక్తే లేదని, పొరపాటున పచ్చకండువా వేసుకున్న గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ పాశ్చాత్తప పడే రోజు దగ్గరలోనే వుందన్నారు. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై ఎంపి మేకపాటి సారధ్యంలో సమర్ధవంతంగా పోరాటాలు చేస్తామని, రానున్న ఎన్నికల్లో పది అసెంబ్లీ స్థానాలను గెలిచి అధినేత జగన్‌కు కానుకగా ఇస్తామని తెలిపారు. ఎమ్మెల్యే రామిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కుంభకోణాలు, కుతంత్ర రాజకీయాలు మినహా చంద్రబాబు సర్కార్ ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. ఆయన వెంట మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ కనమర్లపూడి వెంకట నారాయణ, అధికార ప్రతినిధి పందిటి కామరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి మనె్నమేల సుకుమార్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి గంధం ప్రసన్నాంజనేయులు, రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి జగదీష్‌రెడ్డి, కుందుర్తి శ్రీనివాసులుతో పాటు పలువురు కౌన్సిలర్లు, నాయకులు వున్నారు. అనంతరం 32వ వార్డుకు చెందిన నాయకులు మాల్యాద్రి తండ్రి మాలకొండయ్య ఇటీవల మరణించగా ఎమ్మెల్యే రామిరెడ్డి పరామర్శించారు. అదే విధంగా సపోటా తోటకు చెందిన పార్టీ నాయకులు శేషారెడ్డిని, తుమ్మలపెంట పంచాయతీ మోర్లవారిపాలెంకు చెందిన కార్యకర్త గుడిపల్లి వెంకయ్యను పరామర్శించారు. అదేవిధంగా మద్దూరుపాడుకు చెందిన పి కల్యాణ్‌కుమార్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుండగా ఎంపీ మేకపాటి సహకారంతో 25వేల రూపాయలు పిఎం రిలీఫ్ ఫండ్ నుంచి సాయం అందచేశారు.