శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ప్రజా సంక్షేమమే మోదీ లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు టౌన్, మే 30: కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆధ్వర్యంలో రెండేళ్ల కాలంలో దేశ వ్యాప్తంగా ఏడు వందలకు పైగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు పి సురేంద్రరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని రామ్మూర్తినగర్‌లో ఉన్న బిజెపి కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తమ పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు విజయ్‌పర్వం అనే కార్యక్రమం ద్వారా గ్రామ గ్రామానికి వెళ్లి తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకి తెలియజేసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. అందులో భాగంగా జూన్ 3న జిల్లా కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటుచేసి అన్ని విషయాలను కూలంకషంగా చర్చించి ప్రజలకు ఎలా తెలియజేయాలో తగు నిర్ణయాలు తీసుకుంటామన్నారు. తమ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రచారం చేసుకోవడంలో వెనుకబడినా ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్ల లబ్ధిపొందిన వారు ప్రభుత్వానికి అండగా ఉన్నారన్నారు. కూలీల స్థాయి నుండి ఉన్నతస్థాయి వర్గాల వారందరు కూడా బిజెపి చేస్తున్న సంక్షేమ, అభివృద్ధిని హర్షిస్తున్నారన్నారు. జూన్ 3 నుండి 15 వరకు జరగనున్న కార్యక్రమానికి కేంద్ర మంత్రులు పారికర్, విజయ్ శ్యాంపాల్‌లు పాల్గొంటారని వెల్లడించారు. సమావేశంలో బిజెపి నాయకులు ఎం ఈశ్వరయ్య, చక్రధారి, నరసింహులు నాయుడు, ఎం విజయలక్ష్మి, కె మధు, పరశురాం, నాగరాజు, కోటేశ్వరమ్మ, బాలకృష్ణారెడ్డి, రామిరెడ్డి, శ్రీహరి పాల్గొన్నారు.