శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

పారదర్శకంగా పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, మే 29: జిల్లాలో ఉన్న 5 రవాణా శాఖ కార్యాలయాల్లో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పారదర్శకంగా పనులు చేపడుతున్నట్లు ఉప రవాణా కమిషనర్ ఎన్.శివరాంప్రసాద్ స్పష్టం చేశారు. సోమవారం ఆయన ఈ విలేఖరితో మాట్లాడుతూ కార్యాలయంలో ఏ పని ఉన్నా మధ్యవర్తులను ఆశ్రయించవద్దని, అవసరమైన సమాచారాన్ని తమ ఉద్యోగుల వద్ద పొందవచ్చని భరోసా ఇచ్చారు. మే నెలాఖరు వరకు చేపట్టిన పెండింగ్ దరఖాస్తుల పరిష్కార కార్యక్రమంలో మొత్తం 632 దరఖాస్తులకు గాను కేవలం 24 దరఖాస్తులు మాత్రం పెండింగ్‌లో ఉన్నాయని, మిగతావన్నీ పరిష్కరించినట్లు తెలిపారు. అదేవిధంగా ఏ రోజు దరఖాస్తులను అదేరోజు పరిష్కరించేందుకు పూర్తిస్థాయి చర్యలు తీసుకుని అమలు చేస్తున్నట్లు చెప్పారు. కార్యాలయంలో ఎటువంటి ఇబ్బంది కలిగినా జిల్లాలోని అన్ని కార్యాలయాల ఎదుట ఉన్నతాధికారుల ఫోన్ నెంబర్లను నోటీస్ బోర్డు ద్వారా బహిరంగపరచడం జరిగిందన్నారు. సమస్యలు ఎదురైనవారు వెంటనే తనకు గానీ, నోటీస్ బోర్డుల్లో పేర్కొన్న అధికారి ఎవరికైనా ఫోన్ చేయవచ్చని సూచించారు. జిల్లాలోని కళాశాలలు, పాఠశాలలకు సంబంధించి 1342 వాహనాలు ఉన్నాయనీ, వీటిలో ఇప్పటిదాకా 36 వాహనాలకు సామర్థ్య ధ్రువీకరణ పత్రాలు (ఎఫ్‌సి) మంజూరు చేశామనీ, మరో 248 వాహనాలకు ఇప్పటికే ఎఫ్‌సిలు ఉన్నాయన్నారు. మిగతా 1088 వాహనాలకు సంబంధించి ఆయా విద్యాసంస్థల యాజమాన్యాలు త్వరతిగతిన ఎఫ్‌సిలు పొందాలని సూచించారు. రోజుకు 200 వాహనాలకు ఎఫ్‌సిలు అందించగలిగే అధికార సామర్థ్యం తమకు ఉందన్నారు. రవాణా శాఖ నిబంధనల మేరకు అన్ని ఏర్పాట్లు, సౌకర్యాలు కలిగిన స్కూల్ వ్యాన్లకు వెంటనే ఎఫ్‌సిలు అందచేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లాకు రూ.170.35 కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగిందన్నారు. అందుకు సంబంధించి ఏప్రిల్ నెలలో 117 శాతం లక్ష్యాన్ని చేరుకోగలిగామని చెప్పారు. అందుకు కారణం తమ సిబ్బంది సమష్టిగా కృషి చేయడమేనన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని కూడా చేరుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
మూతపడిన దళారుల కార్యాయాలు
ఉపరవాణా కమిషనర్ శివరాంప్రసాద్ తీసుకున్న చర్యల కారణంగా గత వారం రోజులుగా ఆర్‌టిఓ కార్యాలయం చుట్టూ ఉన్న మధ్యవర్తుల దుకాణాలు మూతపడ్డాయి. కేవలం హెచ్చరికలకు మాత్రమే పరిమితం కాకుండా తరచూ కార్యాలయం బయటకువచ్చి దుకాణాలు తెరిచినదీ, లేనిదీ డిటిసి పరిశీలిస్తుండడంతో తమ కార్యాలయ దుకాణాలు తెరిచేందుకు దళారులు జంకుతున్నారు. తమ కార్యాలయాలు తాళాలు వేసి చెట్ల కింద చేరి సాధ్యమైనంత మేర రవాణా కార్యాలయంలో పైరవీలు చేసేందుకు కొద్దిమంది దళారులు పూనుకుంటున్నారు. అయినప్పటికీ గతంతో పోలిస్తే పరిస్థితి ఎంతో మెరుగ్గా ఉందనీ, దళారులు అధికారుల పేరు చెప్పి ముక్కుపిండి వసూలు చేసే పద్ధతి లేకపోవడంతో బాగుందని కొందరు కార్యార్ధులు తెలిపారు. నిత్యం దళారులతో నిండి ఉండే రవాణా కార్యాలయం కాస్తా ప్రస్తుతం కార్యార్ధులతో కళకళలాడుతుండడం గమనార్హం.