శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, జూన్ 7: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పటికీ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తోందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ అన్నారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలు చంద్రబాబునాయుడుతోనే సాధ్యమన్నారు. మంగళవారం నగరంలోని కస్తూర్బా కళాక్షేత్రంలో నవ నిర్మాణ దీక్షలో భాగంగా ఏర్పాటు చేసిన సంక్షేమ కార్యక్రమాల చర్చా కార్యక్రమాల్లో మంత్రి నారాయణ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో దాదాపు 40 శాతం సంక్షేమానికే ఖర్చు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం గురించి ఆయన మాట్లాడుతూ రాష్టవ్య్రాప్తంగా 46 లక్షల కుటుంబాల వారికి 5,700 కోట్ల రూపాయలు వివిధ రకాల సామాజిక పింఛన్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. డ్వాక్రా మహిళలకు పెట్టుబడి నిధుల కింద పదివేల రూపాయలు మూడు విడతలుగా ఇస్తున్నారని, దానివల్ల సుమారు 80 లక్షల డ్వాక్రా మహిళలు లబ్ధి పొందుతున్నారన్నారు. 2016-17 వార్షిక బడ్జెట్‌లో గత వార్షిక బడ్జెట్‌కంటే షెడ్యూల్డు కులాల వారికి 59 శాతం, షెడ్యూల్డు తెగల అభివృద్ధికి 63 శాతం బలహీన వర్గాల అభివృద్ధి 31.5 శాతం, మైనార్టీల అభివృద్ధికి 83 శాతం అధికంగా నిధులు కేటాయించినట్లు ఆయన తెలిపారు. పేదల పండుగల సమయంలో కుటుంబాలతో సంతోషంగా ఉండడానికి సంక్రాంతి చంద్రన్న కానుక, రంజాన్ కానుక, క్రిస్మస్ కానుక అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం గర్భిణులకు పౌష్టికాహారం కూడా ఇస్తోందన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌కు 65 కోట్లు, కాపు కార్పొరేషన్‌కు 1000 కోట్ల రూపాయలు ఇచ్చిన విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. శాసనమండలి సభ్యుడు వాకాటి నారాయణరెడ్డి మాట్లాడుతూ నవ నిర్మాణ దీక్షా కార్యక్రమం నియోజకవర్గాల స్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు ఎంతో ఉత్సాహంగా జరుగుతోందన్నారు. నగర మేయర్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రతి పేదవారికి అందే విధంగా చర్యలు తీసుకుందన్నారు. ఎపిఐసిసి చైర్మన్ పివి కృష్ణయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బిడ్డ పుట్టక ముందుకు నుంచి సంక్షేమం అమలు చేస్తోందన్నారు. ఈసమావేశంలో జిల్లా కలెక్టర్ జానకి, స్పెషల్ అధికారి రవిచంద్ర, జాయింట్ కలెక్టర్లు ఇంతియాజ్, ఆర్‌ఎస్ రాజ్‌కుమార్, మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి, మాజీ శాసనసభ్యులు ముంగమూరు శ్రీ్ధర్‌కృష్ణారెడ్డి, కార్మికశాఖ ఉప కమిషనర్ శ్రీనివాస్, వైద్యాధికారి వరసుందరం, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం మెప్మా కింద 1217 కుట్టుమిషన్లు మెప్మా మహిళలకు మంత్రి అందజేశారు. 4.20 కోట్ల వ్యయంతో ఎన్‌ఎస్‌ఎఫ్‌డిసి, ఎన్‌ఎస్‌కెఎఫ్‌డిసి సహకారంతో ట్రాక్టర్లు, ఆటోలు, జెరాక్స్ మిషన్లు లబ్ధిదారులకు మంత్రి నారాయణ అందజేశారు. మేదరి సంఘాలకు నాలుగు యూనిట్లకు సబ్సిడీతో రుణాలు అందజేశారు. తొలుత చిన్నారులు శాస్ర్తియ జానపద నృత్య ప్రదర్శనలు చేశారు.