శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

నెల్లూరు మండలాభివృద్ధికి కృషి:ఆదాల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు రూరల్, జూన్ 9: జిల్లాలోని నెల్లూరు మండలాన్ని అభివృద్ధి పథంలో మొదటి స్థానంలో ఉంచుతానని తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల ఇన్‌ఛార్జి ఆదాల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. గురువారం నెల్లూరు మండల పరిధిలోని కొండ్లపూడి సంగం, ములుముడి, సౌత్‌మోపూరు గ్రామాల్లో పర్యటించి సుమారు కోటి రూపాయలు విలువ చేసే సిమ్మెంట్ రోడ్డు పనులకు శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ప్రజల నుద్దేశించి ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర విభజన జరిగిన తరువాత ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేనప్పటికి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడం కోసం సిఎం చంద్రబాబునాయుడు తీవ్రంగా కృషి చేస్తున్నారని అన్నారు. ఒక్క నెల్లూరు మండలానికే నాలుగు కోట్ల సిమ్మెంట్ రోడ్లను మంజూరు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. గత సంవత్సరం నీరు-చెట్టు కార్యక్రమం కింద నాలుగున్నర కోట్లతో అభివృద్ధి చేయడం జరిగిందని, ఈ సంవత్సరం ఐదు కోట్ల రూపాయలతో నీరు-చెట్టు కార్యక్రమం పనులు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ములుమడి గ్రామంలో 80 లక్షల రూపాయలతో కాలువలలోని పూడికలను తీయడం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. రాబోవు మూడేళ్లలో నెల్లూరు మండలంలో ప్రతి వీధికి సిమ్మెంట్ రోడ్లు నిర్మించేందుకు గట్టిగా ప్రయత్నిస్తానని ఆయన తెలిపారు. ప్రతిఒక్కరు ఇంకుండు గంట ఏర్పాటు చేసుకోవాలని, తద్వారా భూగర్భ జలాలు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. అందరూ వారివారి నియోజక వర్గానికి వెయ్యి పక్కా ఇళ్లు తెచ్చుకొంటే ఒక్క నెల్లూరు మండలానికే ఐదు వందల ఇళ్లు మంజూరు చేయించానని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పింఛన్లను మండలంలోని 17 గ్రామాల్లో అర్హులైన ప్రతిఒక్కరికి అందించనున్నట్లు ఆయన అన్నారు. అనంతరం తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఆనం జయకుమార్‌రెడ్డి మాట్లాడుతూ విభజన సమయంలో అప్పులు మనకు, ఆదాయం తెలంగాణా రాష్ట్రానికి పోవడం వల్ల తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొత్త రాష్ట్రం ఏర్పడిందన్నారు. ఇలాంటి సమయంలో అత్యంత అనుభవజ్ఞుడైన చంద్రబాబునాయుడు సిఎం కావడంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఒక స్థితికి తీసుకొచ్చారని ఆయన కొనియాడారు. అర్హులందరికి పింఛన్లు, రేషన్‌కార్డులు అందించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ శ్రీనివాసులరెడ్డి, ఎంపిడిఓ వసుమతి, రామ్‌గోపాల్, హరిబాబు యాదవ్ పాల్గొన్నారు.