శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

బదిలీలపై ఉద్యోగుల్లో ఉత్కంఠ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, జూన్ 9: రాష్టవ్య్రాప్తంగా ఈనెల 10 నుండి 20వ తేది వరకు ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు జరగాల్సి ఉంది. గురువారం రాత్రి వరకూ బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడకపోవడంతో బదిలీలు జరుగుతాయా, లేదా అనే మీమాంసలో అధికారులు ఉన్నారు. జిల్లాలో కింది స్థాయి నుంచి పైస్థాయి ఉన్నతాధికారి వరకు ఉత్కంఠ నెలకొంది. జిల్లాస్థాయి అధికారులు ఇప్పటికే రాజకీయ నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. గ్రామీణ స్థాయిలో ఉండే పంచాయతీ సిబ్బంది, విఆర్‌ఓలు మండల నేతల చుట్టూ మండల, జిల్లాస్థాయి అధికారులు ఆయా నియోజకవర్గాలకు చెందిన శాసనసభ్యులు ఇన్‌చార్జ్‌ల చుట్టూ తిరుగుతూ తాము కోరుకున్నచోట బదిలీలు చేయించుకునే ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నారు. గ్రామస్థాయిలోని కొంతమంది సిబ్బంది తెలుగు తమ్ముళ్లకు తలనొప్పిగా మారడంతో వారిని బదిలీ చేసేందుకు ఇప్పటికే పావులు కదుపుతున్నట్లు తెలిసింది. దీంతో రాజకీయ పైరవీలు జోరందుకున్నాయి. ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేసే విధంగా భూముల రికార్డులు ఆన్‌లైన్ చేపడితే ఆ వ్యవస్థ రెవెన్యూ యంత్రాంగానికి వరంగా మారిందని చెప్పవచ్చు. జిల్లాలోని కొన్ని గ్రామాల్లో విఆర్‌ఓలు, తహశీల్దార్లు, తెలుగు తమ్ముళ్లు కొంతమంది సిఫార్సు చేసినా వారి వద్ద నుంచి కొంత మామూళ్లు తీసుకోవడంతో వారు గుర్రుగా ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని అనేక మండలాల్లో ఎంపీడీవోల కొరత ఉంది. రానున్న రోజుల్లో ఆ మండలాలకు ఎంపీడీవోల కొరత తీరే అవకాశం ఉంది. జిల్లాలోని కొంతమంది ముఖ్య అధికారులను సైతం బదిలీ చేయనున్నట్లు సమాచారం. సోమశిల ఎస్‌ఇ, నెల్లూరు ఎస్‌ఇగా వచ్చేందుకు రాజధాని స్థాయిలో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటివరకు తెలుగుగంగ ఎస్‌ఇ ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్న ఈ పోస్టుకు ఇద్దరు అధికారులు ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. పలువురు అధికారులు రాష్టస్థ్రాయి నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు తెలిసింది. ప్రధానంగా ఆర్‌డబ్ల్యుఎస్, ఆర్ అండ్ బి, డిఆర్‌డిఏ, రెవెన్యూ శాఖల్లోని అధికారులకు స్థానచలనం కలిగే అవకాశం ఉంది. జిల్లాలో తమ ప్రాంతాలకు మండల తహశీల్దార్లుగా అనుకూలమైన వారిని నియమించుకునేందుకు ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు ఉన్నతాధికారుపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఉపాధ్యాయ జిల్లా బదిలీలు కూడా శుక్రవారం నుంచి మొదలుకానుండడంతో వీరు కూడా పైరవీలు ప్రారంభించేశారు. మండల స్థాయిలోని ఎస్సైలు, సిఐలకు బదిలీ జరిగే అవకాశాలు ఉండడంతో కొంతమంది ఈపాటికే ప్రజాప్రతినిధులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. బదిలీలకు ఎన్ని సంవత్సరాలను ప్రాతిపదికగా తీసుకుంటారనే విషయంలో ఇంకా స్పష్టమైన నిబంధనలు రాలేదు. శుక్రవారం నుంచి జరగాల్సిన బదిలీలకు సంబంధించి గురువారం రాత్రి వరకూ ఎటువంటి ఉత్తర్వులు వెలువడకపోవడంతో ప్రతి శాఖలోనూ ఉద్యోగుల్లో బదిలీలపై ఆందోళన నెలకొంది.